For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బ్యాంకుల్లో FD వడ్డీ రేట్లు ఎక్కువ, ఇన్సురెన్స్ కోసం కండిషన్స్ అప్లై

|

పిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడి చాలా సురక్షితం, సులభం. అయితే ఇటీవల కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దీంతో బ్యాంకులు FDలపై తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. హైయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్న ఇన్వెస్టర్ అయితే ఆ మాత్రం కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందులో పెట్టుబడి పెడితే మంచిది అనే ఆలోచన అందరిలో తలెత్తవచ్చు. ప్రత్యామ్నాయం మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్ కనిపిస్తాయి. మీరు సంప్రదాయ పెట్టుబడిదారుఅయితే మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో FD స్కీంకు వెళ్లవచ్చు.

ఇక్కడ వడ్డీ రేటు మూడు నుండి అయిదేళ్ల కాలంలో 6.75 శాతం నుండి ఉంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సర్వోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 6.75 శాతం నుండి వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇవి మూడు నుండి అయిదేళ్ల కాలపరిమితికి వర్తిస్తుంది. షార్ట్ డ్యురేషన్ పీరియడ్ రెండు నుండి మూడేళ్ల కాలపరిమితికి 6.25 శాతం నుండి 6.75 శాతం వర్తిస్తుంది. అదే సమయంలో ఎస్బీఐ మూడు నుండి అయిదేళ్ల కాలపరిమితికి 5.30 శాతం వడ్డీని ఇస్తోంది.

అసలు ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎందుకు ఎక్కువ?

అసలు ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎందుకు ఎక్కువ?

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కువ వడ్డీ అందిస్తోంది స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే. ఈ బ్యాంకులను నేరుగా ఆర్బీఐ నియంత్రిస్తుంది. కొన్ని బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.

రూ.5 లక్షలు మించవద్దు

రూ.5 లక్షలు మించవద్దు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో ఉన్న మిగతా అన్ని బ్యాంకు డిపాజిట్లు డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్(DICGC) ఇన్సురెన్స్ ప్రోగ్రాం పరిధిలో ఉంటాయి. అంటే రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది. ఉదాహరణకు ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నష్టపోతుందని భావిస్తే, ఆ బాధ్యత DICGC తీసుకుంటుంది. అయితే రూ.5 లక్షల మొత్తం దాటితే ఇందులో చేర్చలేదు. కాబట్టి ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రూ.5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ మించకూడదు.

ఇన్సురెన్స్

ఇన్సురెన్స్

ఈ రూల్ అన్ని FD, బ్యాంకు అకౌంట్ హోల్డర్లకు వర్తిస్తుంది. మీ వద్ద రూ.7 లక్షలు ప్లస్ రూ.7 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఉంటే, ఇది మొత్తం రూ.14 లక్షలు అవుతుంది. అయితే ఇందులో రూ.5 లక్షల వరకు మాత్రమే ఇన్సురెన్స్ కింద కవర్ అవుతుంది. ఇందులో వడ్డీ రేటు కూడా కలిసి ఉంటుంది.

English summary

ఈ బ్యాంకుల్లో FD వడ్డీ రేట్లు ఎక్కువ, ఇన్సురెన్స్ కోసం కండిషన్స్ అప్లై | These banks will give better returns, Conditions apply for insurance

FD is safe and easy in terms of investment, but if the condition of the economy is weak, then the interest on it also starts getting less.
Story first published: Tuesday, July 20, 2021, 18:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X