For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Market and Gold Market Forecast: ఈ వారం మార్కెట్, బంగారం ధరలు ఎలా ఉండవచ్చు?

|

గతవారం స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ లాభాల్లో ముగిశాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో శుక్రవారం మాత్రం సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. పెరుగుతున్న ద్రవ్యోల్భణం కారణంగా పలువురు ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అయితే ఈ వారం మార్కెట్ సానుకూలంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. బులియన్ మార్కెట్ దాదాపు స్థిరంగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు, ద్రవ్యోల్భణంతో పాటు యూరోపియన్ మార్కెట్లు వంటి అంశాలు భారత మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి.

లాభాలు.. పరిమితం

లాభాలు.. పరిమితం

గతవారం యూరోపియన్ మార్కెట్లు ఒత్తిడితో ముగిశాయి. మరో రెండో వారాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ట్రేడింగ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెలలో సూచీలు ఇప్పటికే ఐదు శాతానికి పైగా లాభపడ్డాయి.

ఈ వారం కూడా సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ లాభాలు పరిమితం కావొచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ 50 సూచటీ 18000 నుండి 18400 పాయింట్ల మధ్య కదలాడవచ్చునని చెబుతున్నారు. 18400 దాటితే మాత్రం 18500 దిశగా పరుగు పెట్టవచ్చునని అంచనాలు ఉన్నాయి.

సెన్సెక్స్ మద్దతు

సెన్సెక్స్ మద్దతు

సెన్సెక్స్ వరుసగా మూడో వారం లాభాల్లో ముగిసింది. ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం 62,245కు సమీపంలో ఉంది. ఈ వారం 60,300 నుండి 60,700 పాయింట్ల మధ్య సెన్సెక్స్ తక్షణ మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే స్వల్ప నుండి సమీపకాలంలో మార్కెట్ స్థిరీకరణ లేదా దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఈ వారం సెన్సెక్స్ తక్షణ మద్దతు 60,690 పాయింట్లు, నిరోధకస్థాయి 61,622 పాయింట్లు. ఈ స్థాయిని దాటితే 63,400కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు

గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్ ఈ వారం కాస్త లాభపడే అవకాశాలు ఉన్నాయి. రూ.47,300 కంటే దిగువకు వస్తే బలహీనపడవచ్చునని, టెక్నికల్‌గా రూ.47,400 వద్ద మద్దతు కనిపిస్తోందని అంటున్నారు. ఇది కోల్పోతే రూ.46,990 దిగువకు పడిపోవచ్చునని, పైకి చేరుకుంటే రూ.48,080 ఆ తర్వాత రూ.48,380 వద్ద పరీక్షను ఎదుర్కోవచ్చునని భావిస్తున్నారు.

English summary

Market and Gold Market Forecast: ఈ వారం మార్కెట్, బంగారం ధరలు ఎలా ఉండవచ్చు? | Stock Market and Gold Market Forecast for January 17 week

Bull took a breather on Friday and the benchmark indices settled marginally lower on Friday as the rising cases of Omicron variant spooked the traders. Rising inflationary concerns also made some investors cautious. However, high hopes of a stellar earnings season are likely to sustain for the coming week.
Story first published: Monday, January 17, 2022, 8:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X