For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం బంగారం, స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు? ప్రభావం చూపే అంశాలు

|

స్టాక్ మార్కెట్ గతవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. బులియన్ మార్కెట్ పరిస్థితి కూడా దాదాపు అంతే. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్ ఎలా ఉంటుందనే ప్రశ్న ఇన్వెస్టర్లలో నెలకొంది. ఈ వారం స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ పైన వివిధ అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయ సూచీలపై ప్రధానంగా ఎల్ఐసీ ఐపీవో ప్రభావం ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ల పైన ఫెడ్ సమావేశం ప్రభావం ఉంటుంది. అంతర్జాతీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పైన ప్రభావం చూపుతుంది.

ప్రభావం చూపే అంశాలు

ప్రభావం చూపే అంశాలు

అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం మే 3వ తేదీ నుండి మే 4వ తేదీ మధ్య, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సమావేశం, 28వ ఒపెక్, నాన్-ఒపెక్ మినిస్టీరియల్ సమావేశం కూడా ఈ వారం ఉన్నాయి. వీటితో పాటు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కరోనా మహమ్మారి తీవ్రత అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగనంకు కారణం కావొచ్చునని భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పైన ప్రభావం చూపుతుంది. ఇక, దేశీయంగా ఎల్ఐసీ మెగా ఐపీవో 4న ప్రారంభమై 9న ముగుస్తుంది. దీంతో సూచీలు సానుకూలంగా ఉండవచ్చు.

మద్దతు, నిరోధకం

మద్దతు, నిరోధకం

నిఫ్టీ 16,850 నుండి 17,600 మధ్య కదలాడవచ్చునని భావిస్తున్నారు. సెన్సెక్స్ గతవారం 57,060 వద్ద ముగిసింది. ఈ వారం 57,950 పాయింట్ల వద్ద నిరోధకం, 56,400 పాయింట్ల వద్ద మద్దతు కనిపిస్తోంది.

టెలికంలో టారిఫ్ పెంపు లేకపోవడం వల్ల ఈ రంగం షేర్లు సానుకూలంగా ఉండవచ్చు. బ్యాంకు మార్జిన్లపై ఒత్తిడి నేపథ్యంలో ఈ స్టాక్స్ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముంది.

బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు ఈ వారం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,000 వద్ద మద్దతు లభించవచ్చునని, ఈ స్థాయి దిగువకు వెళ్తే రూ.50,500 దిగువకు పడిపోవచ్చునని భావిస్తున్నారు. ధర పెరిగితే మాత్రం రూ.52,400 వద్ద నిరోధకం కనిపిస్తోంది. రూ.52,300 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.51,940 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. వెండి ధరలు ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. రూ.61,500 వద్ద కొనుగోలు మద్దతు కనిపిస్తోంది.

English summary

ఈ వారం బంగారం, స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు? ప్రభావం చూపే అంశాలు | Stock Market and Gold market Forecast for 02 May 2022 week

Experts make weekly updates forecasting the next possible moves of the gold prices and stock market. Here you can find the forecast by gold, market experts for the week 02 May 2022.
Story first published: Monday, May 2, 2022, 9:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X