For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ విమానాల్లో ప్రయాణించే వారికి అదిరిపోయే EMI ఆఫర్.. వడ్డీ లేకుండానే

|

దేశీయ లో-కాస్ట్ క్యారియర్ స్పైస్‌జెట్ విమాన ప్రయాణీకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. అధిక ఛార్జీల కారణంగా విమానంలో ప్రయాణించడం సామాన్యులకు ఇప్పటికీ ఓ కలగానే ఉంది. అయితే అలాంటి వారి కోసం స్పైస్‌జెట్ ఈఎంఐ రూపంలో మంచి పథకాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. విమాన టిక్కెట్లను ఈఎంఐ పద్ధతిలో చెల్లించేందుకు అనుమతిస్తోంది. మొత్తం మూడు, ఆరు, 12 నెలల కాల వ్యవధితో ఈ ఈఎంఐ ఆప్షన్ ఉంది. మీరు ఎంచుకున్న కాలపరిమితిలో టిక్కెట్లు చెల్లించవచ్చు.

ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలనుకుంటే వన్ టైమ్ పాస్‌వర్డ్(OTP) ధ్రువీకరణ నిమిత్తం పాన్, ఆధార్, వీఐడీ వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాలి. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి EMI చెల్లించాలి. ఆ తర్వాత ఈఎంఐలు అదే యూపీఐ నుండి డిడక్ట్ అవుతాయి. క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు అవసరం లేదు.

వడ్డీ లేకుండానే

వడ్డీ లేకుండానే

స్పైస్ జెట్ ప్రవేశపెట్టిన ఈ వినూత్న ఈఎంఐ పథకంలో మూడు నెలలు, ఆరు నెలలు, 12 నెలల్లో సమాన వాయిదాలలో చెల్లింపులు జరిపేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనికి ఎలాంటి వడ్డీ కూడా లేదు. టిక్కెట్ బుకింగ్ సమయంలో పాన్, ఆధార్, ఓటీపీ ద్వారా వివరాలను ధృవీకరించవలసి ఉంటుంది. ఈ పథకం లాంచ్ ఆఫర్ కింద మూడు నెలల వాయిదాలపై అదనపు భారం (జీరో) వడ్డీ ఆప్షన్ కల్పిస్తున్నట్లు తన ప్రకటనలో తెలిపింది. ఈ స్కీం ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో స్పైస్ జెట్ ఆపరేషన్స్ ప్రాథమికంగా దెబ్బతిన్నాయి.

ఈ క్రెడిట్ కార్డ్స్‌కు...

ఈ క్రెడిట్ కార్డ్స్‌కు...

అలాగే, ఈ స్కీం ఇండియా-ఇష్యూడ్ క్రెడిట్ కార్డ్స్‌కు కూడా వ్యాలీడ్ అవుతుంది. యాక్సిస్ బ్యాంకు, HSBC బ్యాంకు, కొటక్ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకులకు ఈ స్కీం చెల్లుబాటు అవుతుంది. త్వరలో ఇతర బ్యాంకులకు కూడా వర్తించనుంది.

ప్రయాణీకులు ఈ క్రెడిట్ కార్డ్స్ పైన 3 నెలల నుండి 12 నెలల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. వడ్డీ రేటు 12 శాతం నుండి 14 శాతం. సాధారణంగా క్రెడిట్ కార్డు వడ్డీ రేటు 36 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీ టిక్కెట్ కాస్ట్ రూ.5000 అయితే ఈ పథకంలో 12 నెలల చెల్లింపుపై రూ.1000 వరకు ఆదా చేయవచ్చు.

జీఎస్టీ బకాయిలు

జీఎస్టీ బకాయిలు

ఇదిలా ఉండగా, విమానాల లీజింగ్ సంస్థలు ఇబ్బందిపడుతున్నాయి. స్పైస్ జెట్ కు లీజుకిచ్చిన విమానాలను తిరిగి తీసుకోవడానికి అవి చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడంలేదు. స్పైస్‌జెట్ ప్రభుత్వానికి జీఎస్టీ బకాయిలను చెల్లించవలసి ఉంది. దీంతో స్పైస్‌జెట్ నుండి విమానాలను తిరిగి తీసుకునే క్రమంలో భాగంగా లెస్సార్స్ ప్రయత్నాలకు టాక్స్ అధికారులు చెక్ చెప్పారు. ఐసీబీసీ లీజింగ్, ఏవియేషన్ క్యాపిటల్ గ్రూప్, బీబీఏఎం సహా ప్రధాన ఫైనాన్సింగ్ కంపెనీల పెట్టుబడులు ఉన్న సంస్థల నుండి స్పైస్ జెట్ లీజుకు తీసుకున్నది.

English summary

ఆ విమానాల్లో ప్రయాణించే వారికి అదిరిపోయే EMI ఆఫర్.. వడ్డీ లేకుండానే | SpiceJet EMI Payment Scheme To Book Tickets On These Credit Cards

SpiceJet on Monday announced the launch of ‘Book Now, Pay Later’, a convenient Equated Monthly Installment (EMI) scheme.
Story first published: Tuesday, November 9, 2021, 11:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X