For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 నెలల్లోనే సెన్సెక్స్ 7000 జంప్, 37 స్టాక్స్ అదరగొట్టాయి

|

ముంబై: బీఎస్ఈ సెన్సెక్స్ నేడు(సోమవారం, జనవరి 11) మరో కొత్త శిఖరాన్ని తాకింది. సెన్సెక్స్ 49000 మార్కును దాటింది. నిఫ్టీ కూడా 13,500 పాయింట్లకు సమీపంలో నిలిచింది. సెన్సెక్స్ 486.81 పాయింట్లు(1%) లాభపడి 49,269 పాయింట్ల వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు(0.96%) ఎగిసి 14,485 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. కేవలం రెండు నెలల కాలంలో సెన్సెక్స్ 7000 పాయింట్లు ఎగిసిపడటం గమనార్హం. ఇదే కాలంలో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం భారీగా పతనమైంది.

రెండు నెలల్లో 7వేల పాయింట్స్ జంప్

రెండు నెలల్లో 7వేల పాయింట్స్ జంప్

నవంబర్ ప్రారంభంలో సెన్సెక్స్ 49,000 దిగువన ఉంది. ఆ తర్వాత నవంబర్ రెండో వారంలో 42000 మార్కును దాటి నిలిచింది. ఆ తర్వాత ఈ రెండు నెలల కాలంలో దాదాపు ప్రతి వారం సగటున వెయ్యి పాయింట్ల కంటే ఎక్కువ లాభపడుతూ వచ్చింది. ఈ కాలంలో భారీగా లాభపడిన స్టాక్స్‌లో ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ ఉన్నాయి. ఈ స్టాక్స్ దాదాపు 40 శాతం మేర లాభపడ్డాయి. ఆ తర్వాత 10 స్టాక్స్ 20 శాతం నుండి 31 శాతం మేర లాభపడ్డాయి.

మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్

మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్

బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ రికార్డు గరిష్టాన్ని తాకింది. గతంలో జనవరి 2018, జనవరి 2020లో రికార్డ్ హైకి చేరుకుంది. బిఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2018 రికార్డు హైకి 1100 పాయింట్ల దూరంలో ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఎఫ్ఐఐ ఇన్-ఫ్లో. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక రికవరీకి తీసుకున్న నిర్ణయాలు కారణం.

ఈ స్టాక్స్ జంప్

ఈ స్టాక్స్ జంప్

ఈ రెండు నెలల కాలంలో బీఎస్ఈ 500 స్టాక్స్ దాదాపు 97 శాతం ఎగిశాయి. ఇందులో టాప్ 410 స్టాక్స్ దాదాపు డబుల్ డిజిట్ గ్రోత్ అందించాయి. ఈ స్టాక్స్‌లో సుజ్లాన్ ఎనర్జీ, వక్రంజీ, టాన్లా ప్లాట్ ఫామ్ సెయిల్ ఉన్నాయి. తదుపరి 33 స్టాక్స్ 50 శాతం మేర లాభపడ్డాయి. ఇందులో హిందుస్తాన్ కాపర్, ట్రైడెంట్, స్పైస్ జెట్, వేదాంత, గ్రాఫైట్ ఇండియా ఉన్నాయి. ఈ రెండు నెలల కాలంలో 37 స్టాక్స్ 50 శాతం నుండి 157 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చాయి. 4 స్టాక్స్ రెండింతల కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి.

English summary

2 నెలల్లోనే సెన్సెక్స్ 7000 జంప్, 37 స్టాక్స్ అదరగొట్టాయి | Sensex adds 7,000 points in just 2 months, 37 stocks index rally 50 to 157 percent

The BSE Sensex crossed another crucial level of 49,000 and hit a fresh record high of 49,269.02 on January 11, a 16.5 percent rally from November 9, 2020 when the index touched its January 2020 record high level.
Story first published: Monday, January 11, 2021, 18:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X