కరోనా మహమ్మారి నేపథ్యంలో డిమాండ్ పెంచి, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ వివిధ వడ్డీ రేట్లలో వరుసగా కోతలు విధించింది. తదనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. కేవలం వీటి పైనే ఆధారపడే వారు, వృద్ధులపై ప్రభావం పడింది. దీంతో పలు బ్యాంకులు కాస్త ఊరటనిచ్చే ఉద్దేశ్యంలో భాగంగా సీనియర్ సిటిజన్స్‌కు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును ప్రవేశపెట్టాయి. సీనియర్ సిటిజన్లకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని 30 జూన్ 2021 వరకు పొడిగించారు.

సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ
సాధారణ ఎఫ్‌డీ పథకాలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు ఉంటాయి. ప్రత్యేక ఎఫ్‌డీ వడ్డీ స్కీం అదనపు వడ్డీ రేటును అందిస్తుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సీనియర్ సిటిజన్లకు అందించే ప్రత్యేక FD స్కీం వివరాలు ఇలా...

ఎస్బీఐ వీకేర్ డిపాజిట్
ఎస్బీఐ 'వీకేర్ డిపాజిట్' సీనియర్ సిటిజన్లకు అందించే ప్రత్యేక FD స్కీం. సాధారణ పౌరులకు వర్తించే వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. 80 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు ఉంది. సాధారణంగా సీనియర్ సిటిజన్లు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు 6.20 శాతంగా ఉంటుంది.

HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్
HDFC బ్యాంకు సీనియర్ సిటిజన్ కేర్ FD 75 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీం కింద 6.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

ICICI బ్యాంకు గోల్డెన్ ఇయర్స్
ICICI బ్యాంకు గోల్డెన్ ఇయర్స్ FD స్కీం కింద 80 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీం కింద 6.30 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ కోసం 100 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ప్రత్యేక ఎఫ్‌డీ స్కీం కింద (5 ఏళ్ల నుండి 10 ఏళ్లు) 6.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications