For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాది, మూడేళ్లలో అత్యధిక రిటర్న్స్ అందించిన ఇంటర్నేషనల్ MFs

|

ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే ఇండియన్ ఈక్విటీ ఫండ్స్.. ఆపిల్, అమెజాన్, బార్‌క్లేస్, డ్యూయిష్ బ్యాంకు, ఫియట్, నోవార్టిస్, ఇతర అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడి పెడుతాయి. ఇలా గత మూడు లేదా అయిదేళ్ల కాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన ఐదు బెస్ట్ అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్‌ను ఇక్కడ చూడండి.

- PGIM India Global Equity Opportunities Fund - ఏడాదిలో ఇచ్చిన రిటర్న్స్ 27.57 శాతం, మూడేళ్లలో ఇచ్చిన రిటర్న్స్ 30.6 శాతం.

- Franklin India Feeder Franklin US Opportunities Fund - ఏడాదిలో ఇచ్చిన రిటర్న్స్ 27.62 శాతం, మూడేళ్లలో ఇచ్చిన రిటర్న్స్ 24.41 శాతం,

- Nippon India US Equity Opportunities Fund - ఏడాదిలో ఇచ్చిన రిటర్న్స్ 25.35 శాతం, మూడేళ్లలో ఇచ్చిన రిటర్న్స్ 19.81 శాతం,

- Edelweiss Greater China Equity Off-shore Fund - ఏడాదిలో ఇచ్చిన రిటర్న్స్ 14.82 శాతం, మూడేళ్లలో ఇచ్చిన రిటర్న్స్ 24.31,

- ICICI Prudential US Bluechip Equity Fund - ఏడాదిలో ఇచ్చిన రిటర్న్స్ 31.72 శాతం, మూడేళ్లలో ఇచ్చిన రిటర్న్స్ 19.39 శాతం.

See this International Mutual Funds Based On High Returns

ఈ ఫండ్స్ పైన ఓ లుక్కేద్దాం....

PGIM ఇండియా గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్

PGIM ఇండియా గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ రూ.1,371 కోట్ల అసెట్ కలిగి ఉంది. ఈ ఫండ్ ఎక్స్‌పెన్సెస్ రేషియో 1.39శాతంగా ఉంది. ఇతర ఇంటర్నేషనల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువగా ఉంది. PGIM ఇండియా గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ వన్ ఇయర్ డైరెక్ట్ గ్రోత్ రిటర్న్స్ 29.08 శాతంగా ఉంది. సగటున ప్రతి సంవత్సరం 12.72 శాతం రిటర్న్స్ అందిస్తోంది.

ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఇండర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ స్కీం... ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్ రూ.3,764 కోట్ల అసెట్ వ్యాల్యూను కలిగి ఉంది. ఈ ఫండ్ ఫీ రేషియో 0.52 శాతంగా ఉంది. ఇతర ఇంటర్నేషనల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎక్స్‌పెన్స్ రేషియో కాస్త తక్కువగా ఉంది. గత ఏడాది ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ 28.91 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ ప్రారంభం నుండి సగటున ప్రతి సంవత్సరం 21.87 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ అమెరికాకు చెందిన స్మాల్, మీడియం, లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసింది.

నిప్పోన్ ఇండియా యూఎస్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్

నిప్పోన్‌కు చెందిన నిప్పోన్ ఇండియా జపాన్ ఈక్విటీ ఫండ్ జపానీస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తోంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇస్తుంది. 90 శాతం ఫండ్స్ ఈక్విటీ అసెట్స్‌లో ఉన్నాయి. పది శాతం ఇతర అసెట్స్‌లో ఉన్నాయి. హెవీ వెయిట్ ఈక్విటీలలో ఇంజినీరింగ్‌లో 22 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఎఫ్ఎంసీజీలో 10 శాతం, ఆటో మొబైల్స్‌లో 10 శాతం ఉన్నాయి. నిప్పోన్ ఇండియా యూఎస్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఏడాది రిటర్న్స్ 26.95 శాతంగా ఉన్నాయి. ఏడాది రిటర్న్స్ 26.95 శాతం కాగా, ఇది ప్రారంభమైనప్పటి నుండి సగటున 17.43 శాతం రిటర్న్స్ అందించింది.

See this International Mutual Funds Based On High Returns

ఎడెల్వెసిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్ షోర్ ఫండ్

జేపీ మోర్గాన్ ఫండ్స్, జేఎఫ్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఫండ్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ లాభాలు ఇస్తుంది. ఎడెల్వెసిస్ గ్రేటర్ చైనా ఈక్విటీ ఆఫ్ షోర్ ఫండ్అసెట్ వ్యాల్యూ 1792 కోట్లు. ఫండ్ ఫీ రేషియో 1.43 శాతంగా ఉంది. ఇతర ఇంటర్నేషనల్ ఫండ్స్‌తో పోలిస్తే ఇది ఎక్స్‌పెన్సివ్. ఇది ప్రారంభమైనప్పటి నుండి సగటున 16.37 శాతం రిటర్న్స్ అందించింది. గత ఏడాది 15.90 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

ICICI ప్రుడెన్షియల్ యూస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్

ఐసీఐసీై ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్.. ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తోంది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీలో గుర్తింపు పొందిన లేదా లిస్ట్ అిన కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే ఇండియన్, ఓవర్సీస్ కార్పోరేషన్స్ ఇష్యూ చేసిన అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్(ADRs), గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్(GDRs)లో ఇన్వెస్ట్ చేస్తుంది. ICICI ప్రుడెన్షియల్ యూస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అసెట్ వ్యాల్యూ రూ.1766 కోట్లుగా ఉంది. ఫండ్ ఫీ రేషియో 1.27 శాతంగా ఉంది. ఇతర అంతర్జాతీయ పండ్స్‌తో పోలిస్తే ఎక్స్‌పెన్సివ్. గత ఏడాది ICICI ప్రుడెన్షియల్ యూస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ 33.02 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇది ప్రారంభమైనప్పటి నుండి సగటున ప్రతి సంవత్సరం 18.90 శాతం రిటర్న్స్ అందించింది.

మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి ఈ కథనం ఆధారంగా పెట్టుబడి కంటే మార్కెట్ లేదా ఫండ్స్ నిపుణుల సలహాలతో పెట్టుబడులు సురక్షితం. అలాగే, మార్కెట్ లేదా ఫండ్స్ పైన పూర్తి అవగాహనతో పెట్టుబడులు మంచిది.

English summary

ఏడాది, మూడేళ్లలో అత్యధిక రిటర్న్స్ అందించిన ఇంటర్నేషనల్ MFs | See this International Mutual Funds Based On High Returns

International funds are Indian equity funds that invest in global stocks such as Apple, Amazon, Barclays, Deutsche Bank, Fiat, Novartis, and others.
Story first published: Friday, August 20, 2021, 12:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X