For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి.. ప్రయోజనాలివే

|

నవంబర్ 14.. బాలల దినోత్సవం. ఈ రోజు మీ పిల్లల కోసం సేవింగ్స్ ఖాతాను తెరవండి. బ్యాంకింగ్ గురించి తెలుసుకోవడానికి వారికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి సేవింగ్ అకౌంట్స్ ద్వారా పిల్లలు మనీ సేవింగ్, మనీ ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంకు, ICICI వంటి బ్యాంకులు మైనర్లకు పొదుపు ఖాతాలు అందిస్తున్నాయి. మీ పిల్లల వయస్సు 10 దాటిన తర్వాత వారు ఆపరేట్ చేయవచ్చు.

ఎయిర్‌టెల్-ఐడియా ఆర్థిక నష్టాలకు కారణాలివేనా?ఎయిర్‌టెల్-ఐడియా ఆర్థిక నష్టాలకు కారణాలివేనా?

వ్యక్తిగత ఫైనాన్స్ నైపుణ్యాలు

వ్యక్తిగత ఫైనాన్స్ నైపుణ్యాలు

బ్యాంకు డిపాజిట్, ఉపసంహరణ వంటి ప్రాథమిక బ్యాంకు అవసరాలు అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. నెలవారీ స్టేట్‌మెంట్స్ ద్వారా ఖర్చులు, ఆదా, అవసరానికి ఎలా ఖర్చులు చేయాలనే అవగాహన వస్తుంది. మీ పిల్లలకు విభిన్నరీతుల్లో ఆధునిక బ్యాంకింగ్‌ను పరిచయం చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తిగత ఫైనాన్స్ సూక్ష్మ నైపుణ్యాలను నేర్పుతుంది. మీరు మీ పిల్లల పేరుపై సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇవి చూడండి...

SBI పహ్లా కదమ్ అండ్ పహ్లీ ఉదాన్

SBI పహ్లా కదమ్ అండ్ పహ్లీ ఉదాన్

పిల్లలు లేదా మైనర్లు ఏ వయస్సులోని వారు అయినా SBI పహ్లా కదమ్ అండ్ పహ్లీ ఉదాన్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పేరెంట్స్ లేదా గార్డియన్‌తో కలిసి పిల్లల పేరుపై జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.

SBI పహ్లా కదమ్ అండ్ పహ్లీ ఉదాన్ ప్రయోజనాలు

SBI పహ్లా కదమ్ అండ్ పహ్లీ ఉదాన్ ప్రయోజనాలు

ట్రాన్సాక్షన్లకు రోజుకు ఇన్ని అని పరిమితి ఉంది. 10 చెక్కులు కలిగిన చెక్ బుక్ ఇస్తారు. ఇది మైనర్ పేరిట గార్డియన్‌కు ఇస్తారు. ఏటీఎం కార్డు ఇస్తారు. POS లిమిట్ రూ.5000. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా రోజుకు ట్రాన్సాక్షన్ పరిమితి రూ.2,000. వీటితో పాటు ఆటో స్వైప్ సౌకర్యం కూడా ఉంది. రూ.20,000 పరిమితి ఉంది. రూ.1,000 చొప్పున రూ.10,000 వరకు స్వైపింగ్ సౌకర్యం ఉంది.

HDFC బ్యాంకు కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్

HDFC బ్యాంకు కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్

HDFC బ్యాంకు కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ కావాలంటే 18 ఏళ్ల వయస్సులోని మైనర్ అయి ఉండాలి. ఈ అకౌంట్ డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి రూ.2,500 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. రూ.10,000 వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఈ అకౌంట్ పైన ఉచిత ఎడ్యుకేషన్ ఇన్సురెన్స్ కవర్ అవుతుంది. పిల్లల కోసం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ఉచిత మంత్లీ ఎలక్ట్రానిక్ స్టేట్‌మెంట్స్, ఎస్సెమ్మెస్ - ఈ-మెయిల్స్ ద్వారా ఇన్‌స్టాంట్ ట్రాన్సాక్షన్ అలర్ట్ ఉంటాయి. ఈ అకౌంట్‌కు మినిమం బ్యాలెన్స్ (యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్) రూ.5000. ఫ్రీ పాస్ బుక్, ఫోన్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాలు ఉన్నాయి.

ICICI బ్యాంకు యంగ్ స్టార్స్ సేవింగ్ అకౌంట్

ICICI బ్యాంకు యంగ్ స్టార్స్ సేవింగ్ అకౌంట్

ICICI బ్యాంకు యంగ్ స్టార్స్ సేవింగ్ అకౌంట్ ద్వారా పిల్లలకు బ్యంకింగ్ సేవలు అందిస్తోంది. మీ పిల్లల కోసం అకౌంట్ ఓపెన్ చేసి, ఆపరేట్ చేయవచ్చు. డెబిట్ కార్డు ఇస్తారు. రోజుకు రూ.2,500 వరకు షాపింగ్, రూ.5,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ (POS) మిషన్ ద్వారా నేరుగా మీ పిల్లలు కొనుగోలు చేయవచ్చు. ఏదైనా ఏటీఎం నుంచి నగదు తీసుకోవచ్చు. యాక్సిడెంటల్ ఇన్సురెన్స్, పర్చేస్ ప్రొటక్షన్ కవర్ ఉన్నాయి. 18 ఏళ్ల వయస్సు వరకు ఉన్న వారు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. తల్లిదండ్రులు లేదా గార్డియన్ వారి తరఫున అకౌంట్ ఆపరేట్ చేయవచ్చు.

English summary

మీ పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయండి.. ప్రయోజనాలివే | SBI, HDFC Bank, ICICI Bank savings account for kids compared

On this Children's Day, open a savings account for your child. This will help them to learn about banking. With a savings account, they will learn the importance of saving their money and using it for the things they really want to.
Story first published: Thursday, November 14, 2019, 12:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X