For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Gold Loan: అతి తక్కువ వడ్డీ రేటు, సౌకర్యవంతమైన రీపేమెంట్

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బంగారం పైన ఆకర్షణీయ వడ్డీ రేటును అందిస్తోంది. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నవారు తమకు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అత్యవసర సమయంలో చాలామంది తీసుకునే రుణం వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం. పర్సనల్ లోన్ అన్-సెక్యూర్డ్ కాబట్టి వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ లోన్ సెక్యూర్డ్ రుణం. కాబట్టి పర్సనల్ లోన్ కంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. తక్కువ మొత్తంలో డబ్బులు అత్యవసరమైతే మొదట తీసుకోవాల్సిన రుణం గోల్డ్ లోన్ అని చెబుతారు. అయితే గోల్డ్ లోన్ పైన వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు వివిధ రకాలుగా ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసిగ్ ఫీజు, రీపేమెంట్ సౌకర్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని గోల్డ్ లోన్ తీసుకోవాలి.

ఎస్బీఐ వడ్డీ రేటు

ఎస్బీఐ వడ్డీ రేటు

పండుగ సందర్భంగా ఎస్బీఐ గోల్డ్ లోన్ తక్కువ వడ్డీకి ఆఫర్ చేస్తోందని, మీకు ఇష్టమైన రీపెమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చునని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. ఎస్బీఐ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు 7.50 శాతం నుండి ప్రారంభం అవుతున్నాయి. 'మీకు బంగారం రుణం కావాలా.. వడ్డీ రేటు 7.50 శాతం మాత్రమే' అని ట్వీట్ చేసింది.

ఎన్నో ప్రయోజనాలు

ఎన్నో ప్రయోజనాలు

ఎస్బీఐ గోల్డ్ లోన్‌లో సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, ఈఎంఐ సౌకర్యం ఉన్నాయి. వడ్డీ రేటు తక్కువగా ఉండటంతో పాటు రోజువారీ బ్యాలెన్స్ తగ్గింపు ఆధారంగా వడ్డీ రేటు ఉండటం మరో ప్రయోజనం. ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉందని, హిడెన్ కాస్ట్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు లేవని పేర్కొంది.

మినిమం డాక్యుమెంటేషన్ అవసరమని తెలిపింది. రీపేమెంట్ పెనాల్టీ ఉండదని, మీ దగ్గర సర్-ప్లస్ మొత్తం ఉంటే దానిని ముందుగానే చెల్లిస్తే వడ్డీ రేటు తగ్గుతుందని సూచించింది.

వివిధ బ్యాంకుల్లో గోల్డ్ లోన్

వివిధ బ్యాంకుల్లో గోల్డ్ లోన్

ఐసీఐసీఐ గోల్డ్ లోన్, యాక్సిస్ బ్యాంకు గోల్డ్ లోన్, HDFC గోల్డ్ లోన్, కెనరా బ్యాంకు గోల్డ్ లోన్, ముథూట్ గోల్డ్ లోన్, ఎస్బీఐ గోల్డ్ లోన్, కొటక్ మహీంద్రా గోల్డ్ లోన్, ఇండస్ఇండ్ బ్యాంకు గోల్డ్ లోన్, మనప్పురం గోల్డ్ లోన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గోల్డ్ లోన్, PNB గోల్డ్ లోన్, బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ రుణాలు అందిస్తాయి.

English summary

SBI Gold Loan: అతి తక్కువ వడ్డీ రేటు, సౌకర్యవంతమైన రీపేమెంట్ | SBI Gold Loan: Interest Rate and other details

State Bank of India is offering gold loan at an attractive interest rate. Borrowers will get the option of repayment based on their convenience.
Story first published: Wednesday, November 17, 2021, 13:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X