For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాతికేళ్లలో రూ.10 కోట్లు రావాలంటే ఎన్ని సంవత్సరాలకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాలి?

|

సాధారణంగా పదవీ విరమణ వయస్సు అరవై. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది పదవీ విరమణ కోసం ప్రణాళిక చేస్తుంటారు. రిటైర్మెంట్ తర్వాత జీవితం కోసం కావాల్సిన మొత్తాన్ని కూడబెట్టిన వారు ఈ వయసు కంటే ముందుగానే పదవీ విరమణ చేయవచ్చు. త్వరగా రిటైర్ కావాలని భావించేవారు పెట్టుబడులను వీలైనంత త్వరగా ప్రారంభించడం మంచిది. కనీసం పాతిక సంవత్సరాల వయస్సులో దీనిని ప్రారంభించాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) ద్వారా పెట్టుబులు పెట్టాలి. నెలవారీగా చిన్న మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

కార్పస్ ఏర్పాటు

కార్పస్ ఏర్పాటు

50 ఏళ్ల వయస్సులో రిటైర్ కావాలనుకుంటే పాతిక సంవత్సరాలకే పెట్టుబడులను ప్రారంభించాలి. ఈ వయస్సులో సంపాద‌న ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయ‌డం సాధ్యంకాదు. ఇలాంటి పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్ సిప్ అనుకూలం. దీని ద్వారా ఎక్కువ మొత్తంలో కార్ప‌స్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

15 శాతం రాబడి

15 శాతం రాబడి

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ ద్వారా దీర్ఘకాలంలో 12 శాతం నుండి 15 శాతం రాబడికి అవకాశముంది. అయితే కేవ‌లం SIP ద్వారా మాత్ర‌మే ప్రతిష్ఠాత్మక ల‌క్ష్యాన్ని చేరుకోలేరు. ప్రతి ఏడాది ఏడాది పెట్టుబ‌డుల‌ను పెంచాలి. ఒక వ్య‌క్తి పెట్టుబ‌డిలో వార్షిక స్టెప్ అప్ 10 శాతం ఉండేలా చూసుకోవాలి. దాదాపు ప్రతి సంవత్సరం వ్యక్తి ఆదాయంలో పెరుగుదల ఉండే అవకాశాలు ఉంటాయి. దానికి అనుగుణంగా పెట్టుబడులు పెంచాలి.

నెల‌వారి SIPలో 10 శాతం వార్షిక స్టెప్ అప్ రూ.10 కోట్ల ల‌క్ష్యాన్ని సుల‌భంగా చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల్లో నెల‌వారి సిప్, వార్షిక స్టెప్ అప్‌లు ఇన్వెస్టర్ల పెట్టుబ‌డుల‌పై గ‌రిష్ఠ కాంపౌండింగ్ ప్రయోజనం అందిస్తాయి.

ఎంత అవుతుందంటే

ఎంత అవుతుందంటే

ఉదాహరణకు ఒక వ్యక్తి పాతికేళ్లకు సిప్ ప్రారంభిస్తే 12 శాతం రాబడి అంచనాతో యాభై ఏళ్ళ వయస్సుకు రూ.10 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు నెలకు రూ.25,000 పెట్టుబడి పెట్టాలి. పది శాతం వార్షిక స్టెప్ అప్ రేటు ఉండాలి. అప్పుడు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.2.91 కోట్లు, మొత్తం రాబడి రూ.7.32 కోట్లు, మెచ్యూరిటీ మొత్తం రూ.10.27 కోట్లు అవుతుంది.

English summary

పాతికేళ్లలో రూ.10 కోట్లు రావాలంటే ఎన్ని సంవత్సరాలకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాలి? | Rs 25,000 monthly SIP is needed to accumulate Rs 10 crore by age 50

if someone wants to retire early, he or she will have to start investing as early as possible or say at least by 25 years of age.
Story first published: Monday, June 21, 2021, 19:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X