For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాది క్రితం ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీ పంట పండినట్లే: రూ.1 లక్షకు రూ.47 లక్షల భారీ రిటర్న్స్

|

భారత స్టాక్ మార్కెట్లు ఈవారం సరికొత్త గరిష్టాలను తాకాయి. వరుసగా మొదటి నాలుగు సెషన్లు భారీ లాభాల్లో ముగిశాయి. అయితే చివరి సెషన్లో మాత్రం స్వల్పంగా నష్టపోయింది. గత ఏడాది కాలంలో పలు స్టాక్స్ పలువురు స్టాక్ హోల్డర్ల రిటర్న్స్‌ రెట్టింపు, అంతకుమించి చేశాయి. ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో స్మాల్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ షేర్లు ఉన్నాయి. అంతేకాదు, కొన్ని SME స్టాక్స్ కూడా ఈ మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లోకి ప్రవేశించాయి. ఈ ఏడాది వాటాదారుల డబ్బును రెట్టింపు చేసిన స్టాక్స్ జాబితాలో ఎనర్జీ రంగం ముందు ఉంది. ప్రధానంగా గీతా రెనెవబుల్ ఎనర్జీ స్టాక్స్ ఇందులో ఉంది. ఇది గత ఏడాది కాలంలోనే ఏకంగా 4600 రెట్ల రిటర్న్స్‌ను అందించింది.

ఏడాదిలో ఎంత పెరిగిందంటే?

ఏడాదిలో ఎంత పెరిగిందంటే?

గీతా రెనెవబుల్ ఎనర్జీ స్టాక్ క్రితం సెషన్‌లో రూ.12.35 లేదా 4.99 శాతం లాభపడి రూ.260 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో రూ.5 నుండి రూ.260కి ఎగిసిపడింది. అంటే 4627 రెట్ల రిటర్న్స్ అందించింది. అలాగే, 2021 క్యాలెండర్ ఏడాదిలోనే రూ.252 నుండి రూ.260కి పెరిగింది. అంటే జనవరి 1వ తేదీ నుండి నిన్నటికి ఆ మేరకు పెరిగింది. ఇది 3609 శాతం వృద్ధి. అలాగే, ఆరు నెలల కాలంలో రూ.249 లేదా 2285 శాతం, నెల రోజుల కాలంలో రూ.161 లేదా 165 శాతం ఎగిసిపడింది. ఈ స్టాక్ నిన్న 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో ముగిసింది.

రూ.550తో షేర్లు కొంటే ఇప్పుడు రూ.26,000

రూ.550తో షేర్లు కొంటే ఇప్పుడు రూ.26,000

గీతా రెనెవబుల్ ఎనర్జీ స్టాక్ గత ఐదు సెషన్లలో 21.50 శాతం లాభపడింది. అంటే రూ.214 నుండి రూ.260కి చేరుకుంది. నెల రోజుల కాలంలో 165 శాతం పెరిగింది. నెల రోజుల క్రితం రూ.93.60గా ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.260 వద్ద ఉంది. ఆరు నెలల క్రితం రూ.10.90 వద్ద, ఏడాది క్రితం అక్షరాలా రూ.5.50 వద్ద ఉంది. అంటే ఏడాది క్రితం రూ.5.50 పైసలు పెట్టి ఒకరు షేర్ కొనుగోలు చేస్తే ఇప్పుడు వారి షేర్ ధర రూ.260. ఎవరైనా రూ.550తో 100 షేర్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు వారి ఆదాయం రూ.26,000 అవుతుంది. అంట ఏడాదిలో ఇది ఎంతో రిటర్న్స్ ఇచ్చినట్లు.

రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.47 లక్షలు

రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే రూ.47 లక్షలు

- ఒక ఇన్వెస్టర్ ఐదు రోజుల క్రితం రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి స్టాక్స్ కొనుగోలు చేస్తే ఆ సంపద ఇప్పుడు రూ.1.21 లక్షలకు పెరిగినట్లు.

- నెల క్రితం రూ.1లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.2.77 లక్షలకు పెరుగుతాయి.

- ఆరు నెలల క్రితం రూ.1లక్ష పెట్టుబడిగా పెడితే ఇప్పుడు రూ.23.85లకు పెరిగాయి.

- సంవత్సరం క్రితం రూ.1లక్ష పెట్టుబడిగా పెట్టిన వారికి మాత్రం ఇప్పుడు భారీగా రిటర్న్స్ వచ్చినట్లే. వారు ఏడాది క్రితం కేవలం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు వారి సంపద రూ.రూ.47.27 లక్షలకు చేరుకున్నట్లే.

English summary

ఏడాది క్రితం ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మీ పంట పండినట్లే: రూ.1 లక్షకు రూ.47 లక్షల భారీ రిటర్న్స్ | RS 1 lakh becomes RS 47 lakh in one year in this stock

The year 2021 has witnessed huge number of stocks that have doubled share holders' money in one year. These multibagger stocks in 2021 in Indian stock market include shares from small-cap, mid-cap and large-cap too.
Story first published: Saturday, August 7, 2021, 14:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X