For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాదిలో అదరగొట్టిన ఎనిమిది స్టాక్స్.. ఎంత జంప్ చేశాయంటే

|

2020 చివరలో స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిశాయి. క్రితం క్యాలెండర్ ఏడాది ప్రారంభంలో వచ్చిన నష్టాలను పూర్తిగా మరిపించి, మురిపించాయి. 2021లో కూడా సెన్సెక్స్ సరికొత్త శిఖరాలను తాకుతోంది. నేడు 50,000 మార్కును దాటింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సూచీలు 67 శాతం ఎగిశాయి. అయితే ఇదే సమయంలో 8 స్టాక్స్ ఏకంగా 80 శాతం లాభపడ్డాయి. గత రెండు నెలల కాలంలో సెన్సెక్స్ 42వేల నుండి 50వేలకు చేరుకుంది.

వెనక్కి తగ్గాల్సిందే: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ, కేంద్రం ఘాటు లేఖవెనక్కి తగ్గాల్సిందే: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ, కేంద్రం ఘాటు లేఖ

లాభపడిన స్టాక్స్ ఇవే

లాభపడిన స్టాక్స్ ఇవే

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కాలంలో 184 శాతం లాభపడింది. మార్చి 31, 2020న రూ.285గా ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.812కు చేరుకుంది.

ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్ 168 శాతం ఎగిసింది. మార్చి 31, 2020న రూ.35.15గా ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.930కి చేరుకుంది.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 125 శాతం జంప్ చేసింది. మార్చి 31, 2020న రూ.436.75గా ఉన్న ఈ షేర్ ప్రస్తుతం రూ.991కు చేరుకుంది.

బజాజ్ ఫైనాన్స్ స్టాక్ 124 శాతం లాభపడింది. మార్చి 31, 2020న రూ.2216గా ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.5114కు చేరుకుంది.

ఇన్ఫీ, రిలయన్స్ కూడా

ఇన్ఫీ, రిలయన్స్ కూడా

ఇన్ఫోసిస్ షేర్ 106 శాతం ఎగిసింది. మార్చి 31, 2020న రూ.640గా ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.1342కు చేరుకుంది.

బజాజ్ ఫిన్ సర్వ్ 94 శాతం లాభపడింది. మార్చి 31, 2020న రూ.4590గా ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.9063కు చేరుకుంది.

మారుతీ సుజుకీ స్టాక్ 85 శాతం ఎగిసింది. మార్చి 31, 2020న రూ.4287గా ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.8090కు చేరుకుంది.

రిలయన్స్ స్టాక్ 83 శాతం ఎగిసింది. మార్చి 31, 2020న రూ.1101గా ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ.2107కు చేరుకుంది.

రిలయన్స్ పైపైకి

రిలయన్స్ పైపైకి

భారత మార్కెట్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ సెప్టెంబర్ నుండి 18 శాతం వరకు లాభపడింది. ఫ్యూచర్ రిటైల్ డీల్‌కు సంబంధించి సెబి పచ్చజెండా ఊపిన తర్వాత ఈ స్టాక్స్ జంప్ చేస్తున్నాయి. గత రెండు మూడు నెలలుగా రూ.2000కు దిగువన ఉన్న స్టాక్స్, ఇప్పుడు రూ.2100ను దాటింది. నేడు రిలయన్స్ ఓ సమయంలో దాదాపు 3 శాతం లాభపడింది. చివరకు రూ.2017 వద్ద ముగిసింది.

English summary

ఏడాదిలో అదరగొట్టిన ఎనిమిది స్టాక్స్.. ఎంత జంప్ చేశాయంటే | RIL share price down 17 percent since September, These stocks gained over 80 percent

In the financial year 2021 so far, the benchmark index Sensex has gained over 67 percent and is now kissing distance from 50,000.
Story first published: Thursday, January 21, 2021, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X