For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI’s Monetary Policy: ఈ స్టాక్స్ కొంటే మంచి లాభాలు! ఇది గుర్తుంచుకోవాలి..

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మానిటరీ పాలసీ కమిటీ ఆగస్ట్ 4వ తేదీ నుండి ఆగస్ట్ 6వ తేదీ వరకు ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మూడు రోజుల పాటు సమావేశం అవుతుంది. కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ వెల్లడించనున్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీకి ముందు బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోలు చేయవచ్చునని పలువురు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

తాజాగా ప్రముఖ మార్కెట్ ఏజెన్సీలు ఎంకే గ్లోబల్, ప్రభుదాస్ లీలాధర్ రెండు బ్యాంకింగ్ స్టాక్స్‌ను సజెస్ట్ చేస్తున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ స్టాక్స్‌ను సజెస్ట్ చేస్తున్నాయి.

ఇండస్ఇండ్ బ్యాంకు

ఇండస్ఇండ్ బ్యాంకు

ఇండస్ఇండ్ బ్యాంకు 40 శాతం వరకు రిటర్న్స్ ఇవ్వవచ్చునని అంచనా వేస్తున్నాయి బ్రోకరేజీ సంస్థలు. ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్ రూ.1032 వద్ద ఉంది. 2021 క్యాలెండర్ ఏడాదిలో ఇది దాదాపు 15 శాతం లాభపడింది. ప్రస్తుతం రూ.1032 వద్ద ఉన్న ఈ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధరను రూ.1375కు పెంచింది బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్.

ఈ బ్రోకరేజీ సంస్థ ప్రకారం ఇండస్ఇండ్ బ్యాంకు స్టాక్ కరోనా సెకండ్ వేవ్ అనంతరం SME ఒత్తిడిని తక్కువగా ఎదుర్కొంటొంది. అలాగే, ఆరోగ్యకరమైన కోవిడ్ కాంటింజెంట్ ప్రొవిజన్స్ (రూ.20 బిలియన్లు) కలిగి ఉంది. ఇందులో రూ.12 బిలియన్లు రీస్ట్రక్చర్ అయ్యాయి. ఎంకే గ్లోబల్ నివేదిక ప్రకారం డిపాజిట్ వృద్ధి ఏడాది ప్రాతిపదికన 26 శాతం, క్రెడిట్ వృద్ధి ఏడాది ప్రాతిపదికన 6 శాతం పెరిగింది.

ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్

ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్

మరో బ్రోకరేజీ సంస్థ ప్రభుదాస్ లీలాదర్... ఐసీఐసీఐ బ్యాంకు స్టాక్ కొనుగోలు చేయవచ్చునని సూచించింది. ప్రస్తుతం ఈ బ్యాంకు స్టాక్ రూ.690 వద్ద ఉండగా, టార్గెట్ ధరను రూ.815కు పెంచింది. బ్రోకరేజీ సంస్థ ప్రకారం ఆస్తుల నాణ్యత బాగుంది. ప్రధానంగా రిటైల్, వ్యవసాయం, బంగారు రుణాల నుండి బ్యాంకు 72.3 బిలియన్లు (లోన్‌లో 4 శాతం) స్లిప్పేజీలను చూసింది. బ్రోకరేజీ సంస్థ ప్రకారం బిజినెస్ గ్రోత్ (లోన్స్) ఏడాది ప్రాతిపదికన 17 శాతం పెరిగింది. బిజినెస్ బ్యాంకింగ్ 53 శాతం పెరిగింది. గతంలో ఈ బ్యాంకు టార్గెట్ ధర రూ.750 కాగా, దీనిని రూ.815కు పెంచింది.

డిస్‌క్లెయిమర్

డిస్‌క్లెయిమర్

స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ లేదా ఆ స్టాక్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాగే నిపుణుల సలహాలు తీసుకోవాలి. వ్యాసం ఆధారంగా స్టాక్ కొనుగోలు కంటే పూర్తి అవగాహనతో కొనుగోలు చేయడం మంచిది. అలాగే, స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

English summary

RBI’s Monetary Policy: ఈ స్టాక్స్ కొంటే మంచి లాభాలు! ఇది గుర్తుంచుకోవాలి.. | RBI’s Monetary Policy: These Banking stocks to buy

Two banking and finance stocks to buy ahead of the RBI's Monetary Policy. If the policy sounds dovish bank stocks could rally, but, brokerages have recommended these stocks for long-term.
Story first published: Wednesday, August 4, 2021, 13:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X