For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీరో రిటర్న్స్, ఈ స్టాక్‌లో వాటా తగ్గించుకున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

|

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) FY2022 మూడో త్రైమాసికంలో జీరో రిటర్న్స్ తర్వాత భారత ప్రముఖ ఇన్వెస్టర్, బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఈ నవరత్న కంపెనీలో తన వాటాను తగ్గించుకున్నారు. సెయిల్ షేర్ హోల్డింగ్ ప్యాట్రన్ ప్రకారం రాకేష్ తన వాటాను 1.76 శాతం నుండి 1.09 శాతానికి తగ్గించుకున్నారు. Q3FY22 త్రైమాసికంలో ఈ స్టాక్ ధర స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 30, 2021లో రూ.113.65 వద్ద ఉన్న ఈ స్టాక్ గత త్రైమాసికం ముగిసే నాటికి రూ.113.65కు పడిపోయింది. తద్వారా జీరో రిటర్న్స్ అందించింది.

2.75 కోట్ల షేర్ల విక్రయం

2.75 కోట్ల షేర్ల విక్రయం

సెయిల్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 4.50 కోట్ల ఈ పీఎస్‌యూ షేర్లను కలిగి ఉన్నారు. అంతకుముందు 1.76 శాతంతో పోలిస్తే ఇది 1.09 శాతం. అంతకుముందు అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చూస్తే ఆయనకు 1.76 శాతం వాటా కలిగిన 7.25 కోట్ల షేర్లు ఉన్నాయి. అంటే అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఈ భారత వారెన్ బఫెట్ 2.75 కోట్ల షేర్లను విక్రయించారు.

జూన్ 2021లో ఆయనకు 1.40 శాతం షేర్లు ఉన్నాయి. అయితే సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి ఇవి 1.76 శాతానికి పెరిగాయి. కానీ గత త్రైమాసికంలో మళ్లీ తగ్గాయి.

గత ఆరు నెలలుగా ఈ స్టాక్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఏడాది కాలంలో రూ.44 నుండి రూ.102కు (చివరి ముగింపు) పెరిగి 76 శాతం కంటే పైగా లాభపడినప్పటికీ, ఆరు నెలల కాలంలో మాత్రం భారీగా పడిపోయింది. ఆరు నెలల క్రితం రూ.126, ఆ తర్వాత రూ.151కి చేరుకున్న ఈ స్టాక్ ఈ ఆరు నెలల కాలంలో 18 శాతం క్షీణించి రూ.102కు పడిపోయింది.

ఇండియా బుల్స్‌లో కొనుగోలు

ఇండియా బుల్స్‌లో కొనుగోలు

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇటవల ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో 35,00,000 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ద్వారా రేర్ ఎంటర్‌ప్రైజెస్ నుండి ఈ కొనుగోలు చేశారు. ఒక్కో షేర్ వ్యాల్యూ రూ.219.

ప్రకాశ్ పైప్స్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ప్రాఫిట్ బుకింగ్ చేశారు. ఈ స్టాక్‌లో రాకేష్‌కు 1 శాతం వాటా ఉండగా, ఈసారి షేర్ హోల్డర్స్ ప్యాటర్న్‌లో ఆయన లేరు. అదే సమయంలో చెన్నైకు చెందిన ఇన్వెస్టర్ డాలీ ఖన్నా పేరు కనిపించింది. అతను 1.35 శాతం వాటాను కొనుగోలు చేశారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 1.31 శాతం వాటాను విక్రయించారు.

రాకేష్ స్టాక్‌పై మోతీలాల్ బెట్

రాకేష్ స్టాక్‌పై మోతీలాల్ బెట్

రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను బిగ్ బుల్ అని, ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలుస్తారు. రాకేష్, తన భార్య.. వీరిద్దరి పేరుపై పదుల సంఖ్యలో స్టాక్స్ ఉన్నాయి. వీటి వ్యాల్యూ రూ.36,315.3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు ఇండియన్ హోటల్స్ కంపెనీలో వాటాలు ఉన్నాయి. ఈ స్టాక్ 2022లో మంచి ప్రదర్శన కనబరచవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది.

English summary

జీరో రిటర్న్స్, ఈ స్టాక్‌లో వాటా తగ్గించుకున్న రాకేష్ ఝున్‌ఝున్‌వాలా | Rakesh Jhunjhunwala trims stake in this PSU metal stock

After getting zero return in Q3FY22 from the PSU stock — Steel Authority of India Limited or SAIL — Big Bull Rakesh Jhunjhunwala has trimmed his stake in the Navratna company during October to December 2021 quarter.
Story first published: Sunday, January 23, 2022, 14:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X