For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు తగ్గాయి, 387% పెరిగిన దిగుమతులు: ఇన్వెస్ట్ చేయడమే మంచిదా?

|

బంగారం ధరలు ఇటీవల భారీగా పడిపోతున్నాయి. కరోనా కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు దృష్టి సారించడంతో గత ఏడాది ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు చేరుకుంది. ఆ తర్వాత నుండి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. 2021 కొత్త సంవత్సరంలో ఏకంగా రూ.50,000 దిగువకు పడిపోయాయి. ఇప్పుడు ఆల్ టైమ్ గరిష్టంతో ర.11,000కు పైగా తక్కువగా ఉంది. దీంతో బంగారం అమ్మకాలు పెరుగుతున్నాయి. సమీప భవిష్యత్తులో కొనుగోలు చేసేవారికి, దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయంగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

<strong>పెరిగిన సిలిండర్ ధరలు: హైదరాబాద్‌లో ఎంత అంటే? LPGపై వీటి ప్రభావం</strong>పెరిగిన సిలిండర్ ధరలు: హైదరాబాద్‌లో ఎంత అంటే? LPGపై వీటి ప్రభావం

బంగారం కొనుగోళ్లు పెరిగాయి.. కారణం

బంగారం కొనుగోళ్లు పెరిగాయి.. కారణం

బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. బడ్జెట్ తర్వాత కూడా రూ.4000కు పైగా తగ్గాయి. దీంతో కొనుగోలుదారులు పసిడి పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇటీవల బంగారం కొనుగోళ్లు పెరిగాయి. దీనికి తగినట్లు దిగుమతులు కూడా భారీగానే పెరిగాయి. కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని తగ్గించడం మున్ముందు మరింత డిమాండ్ పెరిగేలా చేస్తుందని అంటున్నారు.

కేవలం గుజరాత్‌లోనే జనవరి నెలలో 1.31 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే ఫిబ్రవరి నెలలో ఇది 3.78 మెట్రిక్ టన్నులకు పెరిగింది. దిగుమతులు 387 శాతం పెరిగాయి. బంగారం ధరలు భారీగా క్షీణించడం, వ్యాపారులు ఆఫర్లు ప్రకటించడం కలిసి వస్తుంది. కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు కూడా ప్రభావం చూపుతుంది.

పెళ్లిళ్ళ సీజన్

పెళ్లిళ్ళ సీజన్

చాలా రోజుల తర్వాత పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కారణంగా కూడా బంగారానికి డిమాండ్ పెరిగింది. అదే సమయంలో పాత బంగారాన్ని అమ్మి కొత్త బంగారం కొనుగోలు చేయడం కూడా పెరుగుతోంది. గత కొంతకాలంగా బంగారం డిమాండ్ క్రమంగా పుంజుకుంటోందని, పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా కలిసి వచ్చిందని అహ్మదాబాద్ జ్యువెల్లరీ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.

15 నెలల గరిష్టానికి

15 నెలల గరిష్టానికి

బంగారం ధరలు తగ్గడంతో కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ కస్టమర్లు ఫిక్స్డ్ బడ్జెట్‌తో ముందుకు వస్తున్నారని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఫిబ్రవరి నెలలో ఇక్కడ (గుజరాత్)లో బంగారం దిగుమతులు పదిహేను నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఇదే ఒరవడి దేశీయంగా కనిపిస్తోందని అంటున్నారు. అంతకుముందు నవంబర్ 2019లో 4.54 మెట్రిక్ టన్నుల బంగారం దిగుమతులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇదే రికార్డ్.

ఇన్వెస్ట్ చేయవచ్చా?

ఇన్వెస్ట్ చేయవచ్చా?

బంగారంపై ప్రస్తుతం దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇటీవల క్రిప్టోకరెన్సీ కారణంగా బంగారం నుండి బిట్ కాయిన్ వంటి క్రిప్టో వైపు కూడా చాలామంది దృష్టి సారించారు. అయితే అది ఆల్ టైమ్ గరిష్టం 58వేల డాలర్ల నుండి 45వేల డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడికి ధరలు తగ్గిన ఈ సమయం మంచిదే అంటున్నారు.

English summary

బంగారం ధరలు తగ్గాయి, 387% పెరిగిన దిగుమతులు: ఇన్వెస్ట్ చేయడమే మంచిదా? | Price dip boosts gold sales, imports up nearly 387 percent

The decline in gold prices following the reduction in basic customs duty (BCD) on gold after the Union budget announcement boosted demand for the yellow metal.
Story first published: Tuesday, March 2, 2021, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X