For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఇది మీకోసమే! ఏ బ్యాంకులో ఎంతంటే?

|

వివిధ అవసరాల కోసం ఎంతోమంది పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. ఇటీవలి కాలంలో ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తోంది. కాబట్టి ఎంతో కొంత వడ్డీ భారం తగ్గుతోంది. బ్యాంకులు అందించే రుణాలు తక్కువకు వస్తుంటాయి. అలాగే, ఇటీవలి కాలంలో చాలా వేగంగా మన చేతికి వస్తున్నాయి. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటాయి. ఇవి అన్ సెక్యూర్డ్ లోన్స్ కనుక వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది.

ఈ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్: రూ.10,000 వరకు తగ్గింపు, HDFC కార్డ్ ఉంటే..ఈ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్: రూ.10,000 వరకు తగ్గింపు, HDFC కార్డ్ ఉంటే..

వ్యక్తిగత రుణాలు

వ్యక్తిగత రుణాలు

వ్యక్తిగత రుణానికి మీ క్రెడిట్ హిస్టరీ తప్పనిసరి. క్రెడిట్ హిస్టరీ బాగుంటే రుణ వడ్డీ రేటు తగ్గవచ్చు. అలాగే, మీరు కోరే వడ్డీ రేటు, మీ వేతనం, మీ చెల్లింపు సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని రుణాన్ని మంజూరు చేస్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ బ్యాంకులకు ఇవి సెక్యూర్డ్ లోన్స్ కావు. కాబట్టి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.

పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో వీటిని పరిగణలోకి తీసుకోండి...

పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో వీటిని పరిగణలోకి తీసుకోండి...

వివిధ బ్యాంకులు వివిధ రకాల వడ్డీలపై పర్సనల్ లోన్స్ అందిస్తాయి. ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC, ICICI బ్యాంకు సహా అన్ని పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. అత్యవసర సమయంలో పర్సనల్ లోన్‌ను ప్రిఫర్ చేస్తారు. అయితే పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణం అందిస్తుందో తెలుసుకోవాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలి.

96 శాతం మంది పర్సనల్ లోన్స్

96 శాతం మంది పర్సనల్ లోన్స్

ఆర్బీఐ డేటా ప్రకారం బ్యాంకుల నుంచి తీసుకున్న కొత్త రుణాల్లో 96 శాతం పర్సనల్ లోన్స్. డిజిటల్ లెండింగ్ కంపెనీ CASHe ప్రకారం 2018లో 23 శాతం మంది మిల్లీనియల్ వేతన జీవులు షార్ట్ టర్మ్ పర్సనల్ లోన్స్ తీసుకున్నారు. 14 శాతం మంది వారి రుణాలు చెల్లించేందుకు ఈ లోన్స్ తీసుకున్నారు.

అలహాబాద్ బ్యాంకులో వడ్డీ రేటు

అలహాబాద్ బ్యాంకులో వడ్డీ రేటు

వివిధ రకాల బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లకు పర్సనల్ లోన్స్ ఇస్తుంటాయి. అలహాబాద్ బ్యాంకు 8.40 శాతం నుంచి 1.90 శాతం వరకు వడ్డీకి ఇస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు.. లోన్ అమౌంట్ పైన 1.06 శాతం ఉంటుంది.

సిండికేట్ బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ రేటు 11.25 శాతం నుంచి 13.65 శాతం మధ్య ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతంగా ఉంటుంది.

English summary

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఇది మీకోసమే! ఏ బ్యాంకులో ఎంతంటే? | Personal loan interest rates compared: Allahabad Bank vs HDFC Bank vs SBI

Personal loans are one of the most expensive categories of loans you can avail of. These are unsecured loans that can be easily availed of and banks are eager to offer them.
Story first published: Monday, November 25, 2019, 14:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X