For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్: దేశమంతా ఒకే ఆరోగ్య పాలసీ

|

ప్రధాని నరేంద్ర మోడీ తన 74వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (NDHM) ప్రారంభించినట్లు ప్రకటించారు. వన్ నేషన్, వన్ హెల్త్ కార్డ్ భారతీయులందరికీ ఆరోగ్య కార్డులను డిజిటలైజ్ చేస్తోంది. పేషంట్ల డేటాను ఒకే కార్డులో పొందుపరుస్తారు. వన్ నేషన్ వన్ హెల్త్ కార్డు స్వచ్చంధంగా ఉంటుంది. ఇండివిడ్యువల్స్, హాస్పిటల్స్ అభిష్టానుసారం ఉంటుంది. దీనిని ఎంచుకున్న వ్యక్తులకు ప్రత్యేకమైన హెల్త్ ఐడీ కార్డు కేటాయించబడుతుంది.

ఒక్క మిస్డ్ కాల్‌తో SBI నుండి రూ.25 లక్షల రుణం: అర్హులెవరు.. ఇలా చేయండిఒక్క మిస్డ్ కాల్‌తో SBI నుండి రూ.25 లక్షల రుణం: అర్హులెవరు.. ఇలా చేయండి

irdai పాలసీలు..

irdai పాలసీలు..

కరోనా నేపథ్యంలో ఇటీవల ఆరోగ్య బీమా తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అనుకోని ఇబ్బందులు, నష్టాలు జరిగినప్పుడు తట్టుకునేందుకు ఎన్నో బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కానీ పదుల సంఖ్యలో లైఫ్ ఇన్సురెన్స్, జనరల్ ఇన్సురెన్స్ సంస్థలు ఉండటంతో పాటు ఒకే రకం పాలసీలోను వేర్వేరు నిబంధనలు, వీటన్నింటినీ అర్థం చేసుకోవడం, మనకు ఏది సరిపోతుందో అర్థం చేసుకోవడం సవాలే.

దీనిని అధిగమించి, ప్రతి విభాగంలోను ఒక ప్రామాణిక పాలసీని తీసుకురావాలని irdai పలు పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. బీమా పాలసీల ఎంపికలో గందరగోళాన్ని తొలగించడమే దీని ప్రధాన లక్ష్యం. కానీ ఇన్సురెన్స్ సంస్థలు వీటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు.

ఆరోగ్య బీమా అవసరం గుర్తిస్తున్నారు

ఆరోగ్య బీమా అవసరం గుర్తిస్తున్నారు

కరోనా తర్వాత జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరాన్ని గుర్తిస్తున్నారు. దీంతో హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగింది. కానీ జీవిత, ఆరోగ్య బీమా పీలసుల నిబంధనలు పాలసీదారులకు ఇబ్బందిగా మారాయి. కరోనా చికిత్సకు సంబంధించి హెల్త్ బీమా పాలసీల్లో స్పష్టత లేకపోవడంతో పాటు పిహారం ఇవ్వడానికి బీమా సంస్థలు నిరాకరించిన సమయంలో irdai రంగంలోకి దిగింది. కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది irdai.

ఆరోగ్య సంజీవని

ఆరోగ్య సంజీవని

కరోనా నేపథ్యంలో irdai కరోనా రక్షకమ, కరోనా కవచ్ పాలసీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని బీమా సంస్థలు ఈ పాలసీలను అందించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పాటు ఆరోగ్య సంజీవని పేరుతో మరో ప్రామాణిక ఆరోగ్య పాలసీని అందించాలని జనరల్ ఇన్సురెన్స్ కంపెనీలకు సూచించింది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఈ పాలసీని అందించాలని తెలిపింది.

English summary

వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్: దేశమంతా ఒకే ఆరోగ్య పాలసీ | One Nation One Health Card: All You Need To Know

Prime Minister Narendra Modi, in his 74th Independence Day speech, announced the launch of National Digital Health Mission (NDHM). The 'One Nation One Health Card' will digitize the health records of all Indians, making patient data accessible and inclusive in one card.
Story first published: Sunday, February 21, 2021, 14:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X