For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం లైఫ్ టైమ్ గరిష్టాన్ని దాటుతుందా, రూ.56,200 క్రాస్ చేసేనా?

|

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నెలలో ఓసారి రూ.50,000 దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్ ధరలు ఆ తర్వాత రూ.47,000 స్థాయికి పడిపోయాయి. అయితే గతవారం మళ్లీ పుంజుకున్నాయి. చివరి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.500కు పైగా పెరిగింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం వారం రూ.47,925 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,095 వద్ద ముగిసింది. భారీగా పెరిగినప్పటికీ రూ.48,000కు దిగువనే ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 21 డాలర్లు ఎగిసి 1784 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోను అంతకుముందువారం 1900 డాలర్ల సమీపానికి చేరుకొని, ఆ తర్వాత తగ్గింది. గతవారం పెరిగినప్పటికీ 1800 డాలర్ల దిగువనే ఉంది.

అప్రమత్తం.. పెరుగుదల

అప్రమత్తం.. పెరుగుదల

అంతర్జాతీయ ద్రవ్యోల్భణం, డాలర్ మారకంతో రూపాయి క్షీణత, బంగారం, వెండికి పారిశ్రామిక డిమాండ్ వంటడి అంశాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావం అంచనాల నేపథ్యంలో గోల్డ్ ఇన్వెస్టర్లు ఇటీవలి వరకు ఆచితూచి వ్యవహరించారు. దీంతో బంగారం ధరలు దాదాపు స్థిరంగా కనిపించాయి. అయితే చివరి సెషన్లో మాత్రం రూ.48,000 సమీపానికి చేరుకుంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8300 వరకు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం రూ.2075 డాలర్లతో పోలిస్తే 290 డాలర్ల వరకు తక్కువగా ఉంది.

ఆల్ టైమ్ గరిష్టాన్ని దాటేస్తాయా?

ఆల్ టైమ్ గరిష్టాన్ని దాటేస్తాయా?

స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్ పైన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం క్రమంగా ఎక్కువగా కనిపిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టాన్ని దాటుతుందా అనే చర్చ సాగుతోంది. అయితే సమీప భవిష్యత్తులో ఒమిక్రాన్ కారణంగా ఆ స్థాయికి చేరుకునే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఇప్పటికే ఆయా దేశాలు ఒమిక్రాన్ కట్టడికి చర్యలు, ఆర్థిక రికవరీపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో గరిష్టానికి చేరుకోవడం చూడలేమని అంటున్నారు.

ఒమిక్రాన్ కారణంగా బంగారం ధరలు 1800 డాలర్లు దాటుతుందని, వచ్చే మూడు నాలుగు వారాల కాలంలో 1830 డాలర్ల వద్ద మద్దతు ధర కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. స్పాట్ మార్కెట్‌లో 1835 డాలర్లకు చేరుకోవచ్చునని, అదే సమయంలో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో రూ.48,800 నుండి రూ.49,000 స్థాయికి చేరుకోవచ్చునని చెబుతున్నారు.

రూ.47,000 మద్దతు ధర

రూ.47,000 మద్దతు ధర

సాంకేతికంగా బంగారం మద్దతు ధర రూ.47,000 నుండి రూ.46,800 మధ్య, షార్ట్ టర్మ్‌లో బుల్లిష్‌గా ఉంటే రూ.49,000 వరకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఒమిక్రాన్ ప్రభావం మరింత విస్తృతమైతే మాత్రం రూ.52,000 క్రాస్ చేయవచ్చునని అంటున్నారు. అయితే ఈ స్థాయికి చేరుకోవడం చాలా అరుదు అంటున్నారు.

English summary

బంగారం లైఫ్ టైమ్ గరిష్టాన్ని దాటుతుందా, రూ.56,200 క్రాస్ చేసేనా? | Omicron scare: Will gold price breach lifetime high?

Gold price February future contract on MCX (Multi Commodity Exchange) on Friday shot up ₹524 per 10 gm and closed at ₹47,925 per 10 gm levels, logging 1.11 per cent intraday gain.
Story first published: Sunday, December 5, 2021, 11:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X