For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెండ్‌తో కలిసి బన్సాల్ బంపరాఫర్: బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేటుతో హోమ్‌లోన్

|

ఆర్బీఐ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) నావీ ఫిన్ సర్వ్ హోమ్ లోన్ పైన అదిరిపోయే వడ్డీ రేటును అందిస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు అత్యంత చౌకగా ఉన్నాయి. మహమ్మారి నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును 4 శాతంతో దశాబ్దం కనిష్టానికి తగ్గించింది. దీంతో వివిధ బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు తమ తమ వడ్డీ రేటును కూడా తగ్గించి, తమ తమ కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని బదలీ చేశాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ దిగ్గజం HDFC వంటి బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో 6.55 శాతం నుండి 6.7 శాతం మధ్య ఉన్నాయి. అయితే వీటి కంటే తక్కువ రేటు కూడా వస్తుంది.

న్యూ-ఏజ్ ఫిన్‌టెక్ కంపెనీ.. 6.46 వడ్డీ రేటు

న్యూ-ఏజ్ ఫిన్‌టెక్ కంపెనీ.. 6.46 వడ్డీ రేటు

ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేటును అత్యంత చౌకగా అందించే వాటిలో నావీ ఫిన్ సర్వ్ ఉంది. ఈ ఎన్బీఎఫ్‌సీలో హోమ్ లోన్ వడ్డీ రేటు కేవలం 6.4 శాతం మాత్రమే ఉంది. అర్హత కలిగిన రుణ గ్రహీతల కోసం నావీ యాప్ ద్వారా హోమ్ లోన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. హోమ్ లోన్ తక్షణ ఆమోదాన్ని అందిస్తుంది. హోమ్ లోన్ దరఖాస్తు అనేది డిజిటల్ ప్రక్రియ. దాని ఆమోదం సమయం సంప్రదాయ బ్యాంకుల కంటే వేగంగా ఉంటోంది. ప్రస్తుత పోటీ వడ్డీ రేటు కాలంలో ఏడాదికి 6.46 శాతం కనిష్టం వద్ద ఉన్నాయి. మీరు సంప్రదాయ బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు బదులు న్యూ-ఏజ్ ఫిన్ టెక్ కంపెనీ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, పరిశీలించవచ్చు.

ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీల్లేవు

ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీల్లేవు

నవీ హోమ్ లోన్‌ను రూ.20 లక్షల నుండి రూ.5 కోట్ల వరకు అందిస్తోంది. పాతికేళ్ల కాలపరిమితి వరకు ఉంటోంది. బెంగళూరు, మైసూర్, హుబ్లీ, దావణగెరె, గుల్బర్గా, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్ వంటి అనేక నగరాల్లో కంపెనీ హోమ్ లోన్ ప్రాజెక్టుల మంజూరు చేస్తోంది. త్వరలో ముంబై, పుణేలలో ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వాలని భావిస్తోంది. హోమ్ లోన్ వడ్డీ రేటు 6.46 శాతం నుండి ప్రారంభమవుతుంది.

స్థిర ఆదాయం, మంచి క్రెడిట్ స్కోర్, మంచి రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ ఉంటే అలాంటి కస్టమర్లకు మంచి వడ్డీ రేటును అందిస్తోంది. కస్టమర్లు బ్రాంచీని సందర్శించాల్సిన అవసరం లేదు. నావీ యాప్ ద్వారానే దరఖాస్తు దాదాపు పూర్తి చేయవచ్చు. కంపెనీ ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం లేదు. అంతేకాదు, అదనపు అడ్మినిస్ట్రేషన్ ఫీజు, సెంట్రల్ రిజిస్ట్రీ ఫైలింగ్ ఛార్జీలు, సెర్చ్ రిపోర్ట్ ఛార్జీలను కూడా విధించడంలేదు.

నావీ టెక్నాలజీస్.. ఫ్లిప్‌కార్ట్ మాజీ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్, అతని కాలేజ్ ఫ్రెండ్ అంకిత్ అగర్వాల్ 2018లో ప్రారంభించిన న్యూ-ఏజ్ ఫిన్ టెక్ కంపెనీ.

దరఖాస్తు ఎలా చేయాలి?

దరఖాస్తు ఎలా చేయాలి?

నావీ యాప్‌ను వినియోగించి హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు తప్పనిసరిగా యాప్ ద్వారా ఖాతాను సృష్టించాలి. ఇందు కోసం మీ పాన్ కార్డులో పేర్కొన్న మీ పేరు, పర్సనల్ డిటైల్స్ ఇవ్వాలి. అంటే పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, వైవాహిక స్థితి, ఉద్యోగ వివరాలు, నెలవారీ ఆదాయం వంటి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. మీ పాన్ కార్డు కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌తో పాటు మీ ప్రొఫైల్‌ను అంచనా వేయడానికి, మీ ఆర్థిక ఎస్సెమ్మెస్‌లు, లొకేషన్ డేటా, ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్స్ (మీ మొబైల్ ఫోన్స్), స్టోరేజీ వంటి వాటిని అనుమతించాలి.

ప్రయోజనం

ప్రయోజనం

ప్రముఖ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పోలిస్తే హోమ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి లేదా పోటాపోటీగా ఉన్నాయి. మూడేళ్ల పాటు వేరియేబుల్ రేటు స్థానంలో స్థిర ధరను ఎంచుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కస్టమర్ క్రెడిట్ స్కోర్ ఆధారంగా హోమ్ లోన్ అర్హతను నిర్ణయిస్తారు. కస్టమర్ ప్రొఫైల్, కంపెనీ అంతర్గత ధరల ప్రేమ్ వర్క్ ఆధారంగా రుణదాత వడ్డీ రేటు ఉంటుంది.

కంపెనీ నేరుగా కస్టమర్లకు చేరువ అవుతోంది. రుణం కోసం దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి ఛార్జీలు వర్తించవు. కస్టమర్ యాప్ ద్వారా లోన్‌ను ముందస్తుగా చెల్లించవచ్చు.

అయితే రుణగ్రహీత వడ్డీ రేటును, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నింటిని పరిశీలించి మీకు సరిపోయే ఉత్తమ స్కీంను ఎంచుకోవాలి.

English summary

ఫ్రెండ్‌తో కలిసి బన్సాల్ బంపరాఫర్: బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేటుతో హోమ్‌లోన్ | Navi offers home loans at 6.4%: what to do borrowers?

Navi Finserv (Navi), an RBI-registered non-banking financial company (NBFC), is offering instant approval of home loans through the NAVI app for eligible borrowers.
Story first published: Friday, January 7, 2022, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X