For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారం క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.1,21,000 రాబడి: రెండేళ్లలో రూ.50 లక్షలు

|

2021 ఏడాది ఏడాదిలో సెన్సెక్స్ 10,000 పాయింట్ల వరకు ఎగిసింది. గత క్యాలెండర్ ఏడాది హెవీ వెయిట్స్ కంటే స్మాల్, మీడియం సైజ్ కంపెనీలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి. చాలా స్టాక్స్ మల్టీబ్యాగర్‌గా నిలిచాయి. కొన్ని చిన్న స్టాక్స్ కూడా మంచి రిటర్న్స్ అందించి మల్టీ బ్యాగర్‌గా అదరగొట్టాయి. 2020 ప్రారంభంలో కరోనా మహమ్మారి వెలుగు చూసింది. దీంతో మార్చి చివరి వారంలో సెన్సెక్స్ ఏకంగా 26,000 దిగువకు పడిపోయింది. ఇప్పుడు 60,000 పాయింట్లకు పైన ఉంది. అంటే 34,000 పాయింట్లు లాభపడింది. ఇదే రెండేళ్ల కాలంలో పలు స్టాక్స్ అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చాయి.

ఆరు నెలల్లోనే అదిరిపోయే రిటర్న్స్

ఆరు నెలల్లోనే అదిరిపోయే రిటర్న్స్

2020తో పాటు 2021 కూడా స్టాక్స్‌కు ప్రత్యేక సంవత్సరం. ఈ రెండేళ్లలో మంచి రిటర్న్స్ ఇచ్చిన వాటిలో లాయిడ్స్ స్టీల్ ఇండస్ట్రీస్. ఈ మెటల్ స్టాక్ రూ.0.50 నుండి రూ.25కు చేరుకుంది. కేవలం రెండేళ్లలోనే అంటే జనవరి 2020 నుండి జనవరి 2022 నాటికి ఈ స్థాయి రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఇది రెండేళ్ల కాలంలో 4900 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ స్టాక్ గత ఆరు నెలల్లోనే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. ఆరు నెలల క్రితం రూ.3.45గా ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.24.95కి చేరుకుంది. గత రెండు వారాల్లో 21 శాతం ఎగిసిపడింది. రూ.20.65 నుండి రూ.24.95ని తాకింది.

వారం క్రితం లక్ష ఇన్వెస్ట్ చేస్తే..

వారం క్రితం లక్ష ఇన్వెస్ట్ చేస్తే..

ఏడాది క్రితం ఈ స్టాక్ రూ.1 వద్ద ఉంది. ఈ కాలంలో 2400 శాతం ఎగిసి రూ.24.95కి చేరుకుంది. ఒకవేళ ఎవరైనా ఈ స్టాక్‌లో రెండేళ్ల క్రితం రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే 2022 కొత్త ఏడాదిలో వారి సంపద రూ.50,00,000 అవుతాయి. అదే 2022 కొత్త ఏడాది ప్రారంభంలో రూ.1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ వారంలోనే రూ.1,21,000 వచ్చేవి. అలాగే నెల రోజుల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు రూ.1,30,000 వచ్చేవి.

మార్కెట్ పెట్టుబడి రిస్క్

మార్కెట్ పెట్టుబడి రిస్క్

స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, ఆర్థిక అంశాలతో పాటు ఆయా కంపెనీల ప్రభావం మార్కెట్ పైన, స్టాక్స్ పైన ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు అన్నీ ఆలోచించి, పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి

English summary

వారం క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ.1,21,000 రాబడి: రెండేళ్లలో రూ.50 లక్షలు | Multibagger Penny Stock: This stock turned Rs 1 Lakh into Rs 50 Lakh in 2 years

2021 was a special year for stocks. The market grew more than 20 per cent in the year and attracted scores of new investors in the market. The market also delivered a number of multibagger stocks.
Story first published: Monday, January 10, 2022, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X