For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేదాంత గ్రూప్ గ్లోబల్ హెల్త్ ఐపీఓ ప్రారంభం.. సబ్‌స్క్రైబ్ చేసుకోవాలా వద్దా..?

|

ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. మేదాంత గ్రూప్‌కు చెందిన గ్లోబల్ హెల్త్ ఐపీఓను విడుదల చేసింది.మొత్తం రూ.2119.3-2205.6 కోట్లు సైజులో ఉన్న ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైంది. ఇక ఈ ఐపీఓకు దరఖాస్తు చేసుకునేందుకు 7 నవంబర్ 2022 చివరి తేదీ. ఒక్క ఐపీఓ షేర్ విలువ రూ.319 నుంచి రూ.336గా నిర్ణయించడం జరిగింది. దీని ముఖ విలువ రూ.2.

ఐపీఓ యొక్క ముఖ్య ఉద్దేశం

ఆఫర్ ఫర్ సేల్: షేర్ హోల్డర్ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ ఎలాంటి ఆదాయాన్ని పొందదు. (అనంత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా 50,661,000 వరకు ఈక్విటీ షేర్లు మరియు సునీల్ సచ్‌దేవా ద్వారా 100,000 వరకు ఈక్విటీ షేర్లు)

Medantas Global Health IPO opens for public,Know whether you can subscribe or not

తాజా ఇష్యూ: GHPPL మరియు MHPL లాంటి అనుంబంధ సంస్థల్లో పెట్టుబడులు. రుణం లేదా ఈక్విటీ రూపంలో రుణాలు తిరిగి చెల్లించడం/పూర్తిగా లేదా పాక్షికంగా, అటువంటి అనుబంధ సంస్థల (రూ. 375 కోట్లు); మరియు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలు.

గ్లోబల్ హెల్త్ లిమిటెడ్:

ఉత్తరం మరియు తూర్పు భారత దేశంలో గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ (మేదాంత)అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.కార్డియాలజీ, కార్డియక్ సైన్స్,న్యూరో సైన్సెస్, ఆంకాలజీ, ఆర్తోపెడిక్స్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, కిడ్నీ మరియు యూరాలజీ డిపార్ట్‌మెంట్లలో ఈ హాస్పిటల్‌కు మంచి గుర్తింపు ఉంది.మేదాంత బ్రాండ్ కింద కంపెనీకి 5 నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. గురుగ్రామ్, ఇండోర్, రాంచీ, లక్నో, మరియు పాట్నాల్లో ఉన్నాయి.నోయిడాలో ఓ హాస్పిటల్ ఇంకా నిర్మాణ దశలో ఉంది.

ఇక మేదాంత నుంచి వచ్చిన ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలా వద్ద అనేదానిపై ప్రముఖ సంస్థ ఆషికా రీసెర్చ్ పలు సూచనలు చేసింది.

* మేదాంత సంస్థ మార్కెట్‌లోని పలు పారామీటర్లపై దృష్టి సారించింది.బలోపేతం అయ్యేందుకు అన్ని చర్యలు చేపడుతోందని ఆషికా రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది.ప్రస్తుతం ఉన్న హాస్పిటల్స్‌లో పడకల సంఖ్య పెంచడంపై దృష్టి సారించింది సంస్థ.అదే సమయంలో హెల్త్ కేర్ వ్యవస్థను కూడా విస్తరించేందుకు అడుగులు ముందుకేసింది.ఇందుకోసం సమాచార వ్యవస్థను, సాంకేతిక వ్యవస్థను, పరిశోధనా వ్యవస్థను ఇతర వనరులను బలోపేతం చేయనుంది.

* నిర్దేశిత రంగాలలో అధిక సామర్థ్యం ఉన్న కొత్త వైద్య నిపుణులను నియమించడం మరియు క్లినికల్ ఎక్సలెన్స్‌పై దృష్టి పెట్టడం ద్వారా ఆసుపత్రులలో ఆక్యుపెన్సీ రేట్లు మరియు పరికరాల వినియోగాన్ని మెరుగుపరచాలని కంపెనీ భావిస్తోంది.క్లినికల్ ప్రాక్టీస్‌లను మెరుగుపరచడం మరియు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఆసుపత్రులలో (ALOS) సగటు నిడివిని తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీ ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరిచి సాంకేతికత ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ద్వారా కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించింది.

* దేశీయ అంతర్జాతీయ క్లినికల్ డెవలప్‌మెంట్ నిపుణులతో మరియు ఇన్స్‌టిట్యూషన్స్‌తో కలిసి పనిచేసేందుకు మేదాంత ముందుకొస్తోంది. వరల్డ్ ఫస్ట్‌క్లాస్ ఎక్విప్‌మెంట్‌తో సేవలందిస్తోంది మేదాంతా హాస్పిటల్స్.

* ఆర్థిక పరంగా, ఆర్థిక సంవత్సరం 2020-22 సమయంలో, మెదాంతా యొక్క ఆదాయం, EBITDA మరియు నికర లాభం వరుసగా 20.2%, 55.4% మరియు 132.4% CAGR వద్ద వృద్ధి చెందాయి. సగటు EBITDA మార్జిన్‌లు 16%, అయితే PAT మార్జిన్‌లు 6%. RoE/RoCE 14.0%/9.3%. Q1FY23కి, ఆదాయం రూ. 617 కోట్లు మరియు EBITDA మార్జిన్ 21.4%.

* హెల్త్‌కేర్ సెగ్మెంట్‌లో వృద్ధి, మంచి పేషెంట్ వాల్యూమ్‌లు, కాస్ట్ ఎఫిషియెన్సీ, బలమైన ఫైనాన్షియల్‌లు, కొత్త సేవలకు విస్తరణ మరియు కొత్త రంగాలకు విస్తరించడం, కంపెనీ పనితీరును ముందుకు నడిపిస్తోంది. అందువల్ల, దీర్ఘకాలిక కోణంలో చూస్తే ఈ ఐపీఓను "SUBSCRIBE" చేసుకోవాల్సిందిగా ఆషికా రీసెర్చ్ సిఫార్సు చేస్తోంది.

English summary

మేదాంత గ్రూప్ గ్లోబల్ హెల్త్ ఐపీఓ ప్రారంభం.. సబ్‌స్క్రైబ్ చేసుకోవాలా వద్దా..? | Medanta's Global Health IPO opens for public,Know whether you can subscribe or not

Global Health initial public offering (IPO) with Rs. 2119.3 - 2205.6 Crore issue size is open for subscription now. The IPO will close on November 7, 2022.
Story first published: Friday, November 4, 2022, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X