For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు మరింత పెరుగుతాయా?

|

గతవారం పసిడి మార్కెట్ స్థిరంగా ముగియగా, స్టాక్ మార్కెట్ ప్రతికూలంగా ముగిసింది. బంగారం ధరలు రూ.50,000 పైకి చేరుకొని, తర్వాత కాస్త తగ్గినప్పటికీ, తిరిగి అదేస్థాయిలో ముగిశాయి. ఇక సెన్సెక్స్ 58,000 పాయింట్ల దిగువన ముగిసింది. పసిడి, స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా కాస్త ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాల నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారడం, పెరిగిన ముడి చమురు ధరలు, అధిక ద్రవ్యోల్భణం, FIIల విక్రయాల కారణంగా గత వారం మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఐఐపీ సూచీ తగ్గడం, రిటైల్ ద్రవ్యోల్భణం ఏడు నెలల గరిష్టానికి చేరుకోవడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది.

ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు

ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు

అయితే ఈసారి చమురు ధరలు కాస్త శాంతించడం, డాలర్ మారకంతో రూపాయి కాస్త బలపడటం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచే అవకాశముంది. ద్రవ్యోల్భణం పెరుగుతున్నందున వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్ల పెంపుకు సంకేతాలు ఇచ్చింది. ఇది గతవారం మార్కెట్ పైన ప్రభావం చూపింది.

ఈ వారం కూడా చూపే అవకాశాలు ఉంటాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ.12,215 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.10,592 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు రూ.18,856 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

నిరోధకం, మద్దతుస్థాయి

నిరోధకం, మద్దతుస్థాయి

గతవారం సెన్సెక్స్ ఒడిదుడుకుల మధ్య 56,300 పాయింట్ల నుండి రికవరీ అయింది. 58,500-59,000 పాయింట్ల మధ్య ఈ వారం నిరోధకం ఎదురు కావొచ్చు. 57,200-56,500 మధ్య సపోర్ట్‌కు అవకాశముంది. ఈ స్థాయి కంటే పడిపోతే మరింత క్షీణించే అవకాశముంది. నిఫ్టీ గతవారం 17,590 నుండి 16,810 పాయింట్ల మధ్య కదలాడింది. ఈ వారాంతంలో 15,575 కంటే దిగువన ముగిస్తే స్వల్పకాలిక బేరిష్ కావొచ్చు. నిఫ్టీ నిరోధకం 17,500, మద్దతు స్థాయి 17,050.

బంగారం ధరలు

బంగారం ధరలు

గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.49,420 కంటే దిగువకు వస్తే రూ.48,720 వరకు పడిపోయే అవకాశముందని బులియన్ మార్కెట్ వర్గాల అంచనా. ఒకవేళ రూ.50,600 స్థాయిని దాటితే రూ.51,150 వరకు వెళ్లే అవకాశముందని భావిస్తున్నారు. రూ.49,680 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు.

English summary

ఈ వారం మార్కెట్ ఎలా ఉండవచ్చు, బంగారం ధరలు మరింత పెరుగుతాయా? | Market and Gold Forecast for 21 Feb 2022 week

Gold bulls are meeting critical resistance, all eyes on Fed speakers and Russian diplomacy.
Story first published: Monday, February 21, 2022, 8:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X