చాలామంది ఇష్టపడే పెట్టుబడి మార్గాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. FD 7 రోజుల కాలపరిమితి నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. బ్యాంకు FDలు హామీ రాబడిని అందిస్తాయి. మీరు నెలవారీ, త్రైమాసికం, వార్షిక ప్రాతిపదికన వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు. FD పైన వచ్చే వడ్డీ క్రమంగా తిరిగి పెట్టుబడిగా మారుతుంది. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తం పైన వడ్డీ వస్తే, ఆ వడ్డీ బ్యాంకులోనే ఉంటే, ఈ మొత్తం తిరిగి పెట్టుబడిగా మారి మీకు ఎక్కువ రాబడిని అందిస్తుంది. అంటే మీకు వచ్చే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి.

బ్యాంకు FD సురక్షితం
బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంతో సురక్షితమైనవి. రూ.5 లక్షల వరకు డిపాజిట్లు బీమా పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.4,94,000 ప్రిన్సిపల్ అకౌంట్, వడ్డీ రూ.5,000గా ఉంటే DICGC బీమా మొత్తం రూ.4,99,000 అవుతుంది. ఇక, బ్యాంకు FDని కింది అంశాల ఆధారంగా పరిగణలోకి తీసుకోవచ్చు. - బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటు, FD పైన రుణం, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, సీనియర్ సిటిజన్ ఆఫర్, ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలి.

వివిధ కాలపరిమితిలపై వడ్డీ
6 నెలల నుండి ఏడాది, 1 సంవత్సరం నుండి 2 ఏళ్ల కాలపరిమితి, 2 నుండి 3 ఏళ్ళ కాలపరిమితి, 3 నుండి 5 ఏళ్ల కాలపరిమితి, 5 ఏళ్ళ కాలపరిమితి, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు వివిధ బ్యాంకుల్లో ఇలా ఉన్నాయి.
DCB Bank - 5.95, 6.05 నుండి 6.70, 6.5, 6.75, 6.75, 4.75 నుండి 7.25
Yes Bank - 5.50 నుండి 5.75, 6.25 నుండి 6.50, 6.5, 6.75, 6.75, 4.00 నుండి 7.50
IndusInd Bank - 4.5 నుండి 5.75, 6.5, 6.5, 6.5, 6.75, 4.50 నుండి 6.80
RBL బ్యాంకు - 5.25 నుండి 5.75, 6.5, 6.5, 6.25 నుండి 6.75, 6.25, 5.75 నుండి 7.25
కరూర్ వైశ్య బ్యాంకు - 4.75 నుండి 5, 5.5, 5.5, 5.65, 5.65 నుండి 6, 6 నుండి 6.15

మరిన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 4.30 నుండి 4.50, 5.25 నుండి 5.30, 5.30 నుండి 5.50, 5.50 నుండి 5.55, 5.55 నుండి 5.60, 3.50 నుండి 6.10
కర్నాటక బ్యాంకు - 5.2, 5.3, 5.30 నుండి 5.55, 5.55, 5.55 నుండి 5.70, 3.80 నుండి 5.95
కెనరా బ్యాంకు - 4.45, 5.2, 5.4, 5.5, 5.5, 4.50 నుండి 6.14
యాక్సిస్ బ్యాంకు - 4.5 నుండి 5.15, 5.10 నుండి 5.25, 5.4, 5.4, 5.5, 4.5 నుండి 5.90
సౌత్ ఇండియన్ బ్యాంకు - 5, 5.4, 5.4, 5.5, 5.5, 5.50 నుండి 6
ఫెడరల్ బ్యాంకు - 3.75 నుండి 4.40, 5.10 నుండి 5.35, 5.35, 5.35, 5.5
ఎస్బీఐ - 4.4, 5, 5.1, 5.3, 5.4, 4.90 నుండి 5.80
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications