For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC సరికొత్త 'బీమా జ్యోతి' ప్లాన్: కనీస పాలసీ రూ.1,00,000, ఎన్నో ప్రయోజనాలు...

|

జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) తన ఖాతాదారుల కోసం సరికొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత సేవింగ్స్, లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ లైఫ్ ఇన్సురెన్స్ సేవింగ్ ప్లాన్ బీమా జ్యోతి ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇది ఖాతాదారులకు రక్షణ కల్పించడంతో వారి సొమ్మును ఆదా చేస్తుంది.

మెచ్యూరిటీ సమయానికి భారీ మొత్తంలో సొమ్ము పొందే హామీని ఇస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ అసాధారణ మరణానికి గురయితే కుటుంబానికి ఆర్థిక మద్దతు ఉంటుంది. దీనిని ఎల్ఐసీ ఏజెంట్ లేదా ఇతర మార్గాల్లో ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే www.licindia.inలోకి వెళ్లి ఆన్ లైన్‌లోను తీసుకోవచ్చు.

కనీసం రూ.1 లక్ష పాలసీ

కనీసం రూ.1 లక్ష పాలసీ

రూ.లక్షకు తగ్గకుండా ఈ ప్లాన్‌లో ఎంత విలువైన పాలసీని అయినా పొందే అవకాశం ఉంది. అంటే కనిష్టంగా రూ.1 లక్ష నుండి పాలసీని కొనుగోలు చేయాలి. గరిష్టానికి పరిమితి లేదు. అలాగే 90 రోజుల చిన్నారి దగ్గర నుండి 60 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ కాలపరిమితి 15 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు ఉంది.

ప్రతి సంవత్సరం పాలసీ బేసిక్ మొత్తంలో ప్రతి రూ.వెయ్యికి రూ.50 జమ అవుతాయి. అంటే ప్రతి రూ.1000 పాలసీ మొత్తానికి ఏడాదికి రూ.50 జమ చేస్తారు. అంటే ఏడాదికి కచ్చితంగా ఐదు శాతం రిటర్న్స్ ఉంటాయి. ఈ మొత్తాన్ని పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లిస్తారు. అకాల మరణానికి గురైతే పాలసీ షరతులకు అనుగుణంగా భారీ మొత్తంలో హామీతో పాటు అదనపు సొమ్ము అందుతుంది. ఇన్‌స్టాల్‌మెంట్లలోను డెత్ లేదా మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉన్నాయి.

ప్రీమియం...

ప్రీమియం...

తొంబై రోజుల నుండి 60 ఏళ్లలోపు లోపు వారు ఈ పాలసీలో చేరవచ్చు. ఏడాదికి, ఆరు నెలలకు, మూడు నెలలకు, నెలకు ఓసారి ప్రీమియం చెల్లించవచ్చు. శాలరైడ్ అయితే వేతనం నుండి నేరుగా డిడక్షన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆర్థిక సమస్యలు ఎదురైతో లోన్ సౌకర్యం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో రిస్క్ కవర్‌తో పాటు హామీ ఇవ్వబడిన ఎల్ఐసీ బీమా జ్యోతి ఆకర్షణీయ ఎంపిక అని ఎల్ఐసీ ఓ ప్రకటనలో తెలలిపింది.

పాలసీ గురించి క్లుప్తంగా..

పాలసీ గురించి క్లుప్తంగా..

కనీస పాలసీ మొత్తం రూ.1 లక్ష. గరిష్ట పరిమితి లేదు. పాలసీ కాల వ్యవధి 15 ఏళ్లు లేదా 20 ఏళ్లు. ప్రీమియం చెల్లింపుల సమయం 10 ఏళ్లు లేదా 15 ఏళ్లు. ప్రవేశానికి కనీస వయస్సు 90 రోజులు. ప్రవేశానికి గరిష్ట వయస్సు 60 ఏళ్లు. మెచ్యూరిటీ నాటికి కనీస వయస్సు 18 ఏళ్లు. మెచ్యూరిటీ నాటికి గరిష్ట వయస్సు 75 ఏళ్లు.

ఉదాహరణకు రూ.10 లక్షల పాలసీ మొత్తంతో 20 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే... ప్రీమియం పదిహేనేళ్లు చెల్లించాలి. పాలసీ మొత్తం రూ.10 లక్షలు. ఏడాది ప్రీమియం రూ.82,454. అదనపు చెల్లింపలు ఉంటాయి. మెచ్యూరిటీ అనంతరం అందే మొత్తం..... పాలసీ అమౌంట్ రూ.10 లక్షలు, అదనపు చెల్లింపులు రూ.10 లక్షలు. మొత్తం రూ.20 లక్షలు.

English summary

LIC సరికొత్త 'బీమా జ్యోతి' ప్లాన్: కనీస పాలసీ రూ.1,00,000, ఎన్నో ప్రయోజనాలు... | LIC of India launches new Bima Jyoti plan: know details

Life Insurance Corporation (LIC) of India has introduced 'Bima Jyoti' plan a non-linked, non-participating, individual savings plan, which offers a combination of protection and savings.
Story first published: Tuesday, February 23, 2021, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X