For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC సరికొత్త ఆరోగ్య రక్షక్ ప్లాన్, ఇది తెలుసుకోండి

|

ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్(LIC) సోమవారం ఆరోగ్య రక్షక్ పేరుతో సరికొత్త పాలసీని తీసుకు వచ్చింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, వ్యక్తిగత, హెల్త్ ఇన్సురెన్స్ ప్లాన్. పూర్తిస్థాయి కుటుంబ రక్షణ లక్ష్యంగా దీనిని దీనిని ఎల్ఐసీ తీసుకు వచ్చింది. సోమవారం హైదరాబాద్ ఎల్ఐసీ జోనల్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ పాలసీని సౌత్ సెంట్రల్ జోన్ జనరల్ మేనేజర్ విడుదల చేశారు.

వీరందరూ తీసుకోవచ్చు

వీరందరూ తీసుకోవచ్చు

వ్యక్తిగతంగా, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఒకే పాలసీని తీసుకునే వెసులుబాటు ఉంది. 18 నుండి 65 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. పిల్లల వయసు 91 రోజుల నుండి 20 ఏళ్ల లోపు ఉండాలి. 80 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ పాలసీ కొనసాగుతుంది. అనారోగ్యం, పాలసీలో పేర్కొన్న నిర్ణీత వ్యాధుల బారినపడినప్పుడు ఆసుపత్రి ఖర్చులతో సంబంధం లేకుండా పాలసీ వ్యాల్యూ మేరకు ఒకేసారి ఈ పాలసీ పరిహారం చెల్లించడం గమనార్హం.

అందుబాటులో ప్రీమియం చెల్లింపు

అందుబాటులో ప్రీమియం చెల్లింపు

ఈ పాలసీలో సౌకర్యవంతమైన ప్రీమియం చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. హాస్పిటలైజేషన్, సర్జరీలకు ఆర్థిక సాయం ఉంటుంది. వాస్త వైద్య ఖర్చులతో సంబంధం లేకుండా భారీ మొత్తాల ప్రయోజనం ఉంది. పాలసీ కొనుగోలులో సీనియారిటీ, నో క్లెయిమ్ ఆధారంగా హెల్త్ వరేజీ పెంచుకోవచ్చు. నిబంధనలకు లోబడి ప్రీమియం సడలింపులు ఉంటాయి. అంబులెన్స్, హెల్త్ చెకప్ ఖర్చులు, అందుబాటులో ఆప్షనల్ రైడర్స్.

స్థిర ప్రయోజనం

స్థిర ప్రయోజనం

ఈ స్కీం కొన్ని నిర్దిష్ట హెల్త్ రిస్క్ పైన స్థిర ప్రయోజన ఆరోగ్య బీమాను అందిస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సకాలంలో సహాయాన్ని అందిస్తుంది. బీమా చేసిన వ్యక్తి, అతని కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక స్వతంత్రానికి సహకరిస్తుంది.

English summary

LIC సరికొత్త ఆరోగ్య రక్షక్ ప్లాన్, ఇది తెలుసుకోండి | LIC launches Arogya Rakshak plan on Monday

The LIC of India has introduced today a new health insurance plan called Arogya Rakshak, which is a non linked, non participating, regular premium, individual health insurance plan.
Story first published: Tuesday, July 20, 2021, 9:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X