For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC Bachat Plus Scheme: ఎల్ఐసీ సరికొత్త రక్షణ, పొదుపు పాలసీ.. ఇవీ వివరాలు

|

LIC బచత్ ప్లస్ పేరిట కొత్త బీమా ప్లాన్‌ను తీసుకు వచ్చింది. రక్షణతో పాటు పొదుపు అవకాశం కల్పించే ప్లాన్ ఇది. అయిదేళ్ల మెచ్యూరిటీ కాలపరిమితి గల ఈ ప్లాన్ పాలసీదారు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే కుటుంబానికి ఒకేసారి ఆర్థిక సహాయం అందుతుంది. పాలసీ కాలపరిమితి ముగిసి మెచ్యూరిటీ తేదీ లోగా పాలసీదారు మరణించినా హామీ మొత్తంతో పాటు లాయల్టీలతో కలిపి కుటుంబానికి ఒకేసారి సొమ్ము అందిస్తారు. ఇది సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం విధానాలతో ఉంది. కనీస హామీ మొత్తం రూ.1 లక్ష. గరిష్ట పరిమితి లేదు. ఈ ప్లాన్ మీద రుణ సౌకర్యం ఉంది.

ఏసీ, ఫ్రిడ్జ్ మరింత భారం కావొచ్చు: రూ.2,000 వరకు పెరగనున్న ధరలుఏసీ, ఫ్రిడ్జ్ మరింత భారం కావొచ్చు: రూ.2,000 వరకు పెరగనున్న ధరలు

బచత్ ప్లస్ సేవింగ్ ప్లాన్

బచత్ ప్లస్ సేవింగ్ ప్లాన్

LIC ఈ సరికొత్త బచత్ ప్లస్ సేవింగ్స్ ప్లాన్ పాలసీదారులకు రక్షణతో పాటు పొదుపును అందిస్తుందని ప్రభుత్వరంగం బీమా దిగ్గజం తెలిపింది. పెద్ద పాలసీల ప్రీమియం చెల్లింపు విధానాలపై రిబేట్ ఉంటుంది. ఈ ప్లాన్‌లో పాలసీదారులకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఇది సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ప్లాన్స్‌ను కలిగి ఉంది. సింగిల్ ప్రీమియం ఆప్షన్ ఏ ఎంచుకుంటే మృతిపై బేసిక్ సమ్ అస్యూర్డ్‌కు 10 రెట్ల ప్రీమియం హామీ ఉంటుంది. ఆప్షన్ బీ ఎంచుకుంటే 1.25 రెట్లు ఉంటుంది.

ప్రీమియం

ప్రీమియం

లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ కింద ఆప్షన్ 1 అయితే బేసిక్ సమ్ అస్యూర్డ్ ప్రీమియంకు పది రెట్ల హామీ ఉంటుంది. ఆప్షన్ 2 అయితే ప్రీమియం కంటే ఏడు రెట్ల హామీ ఉంది. మెచ్యూరిటీ పైన గ్యారెంటీ సమ్ అస్యూర్డ్.. కనీస హామీ మొత్తం ఉంది. అయిదేళ్ల పాలసీ ముగించుకొని, అన్ని ప్రీమియంలు చెల్లిస్తే అదనంగా లాయాల్టీ ఉంటుంది.

వయో పరిమితి

వయో పరిమితి

ఎల్ఐసీ బచత్ ప్లస్ సేవింగ్ ప్లాన్ తీసుకోవడానికి సింగిల్ ప్రీమియం కోసం కనీస వయస్సు 90 రోజులు. ఆప్షన్ ఏకు అయితే గరిష్ట పరిమితి 44 సంవత్సరాలు. ఆప్షన్ బీకి అయితే 70 సంవత్సరాలు.

లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ అయితే ఆప్షన్ 1కు 90 రోజులు పూర్తి కావాలి. ఆప్షన్ 2కు అయితే 40 సంవత్సరాలు. గరిష్ట పరిమితి ఆప్షన్ 1కు 60 సంవత్సరాలు. ఆప్షన్ 2కు కూడా 60 సంవత్సరాలు.

సింగిల్ ప్రీమియం మెచ్యూరిటీకి కనీస వయస్సు 18 సంవత్సరాలు. ఆప్షన్ ఏకి గరిష్ట వయో పరిమితి 65 సంవత్సరాలు, ఆప్షన్ బీకి 80 సంవత్సరాలు.

లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ 1కు అయితే గరిష్ట వయో పరిమితికి మెచ్యూరిటీ 75 సంవత్సరాలు. ఆప్షన్ 2కు 80 ఏళ్లు.

English summary

LIC Bachat Plus Scheme: ఎల్ఐసీ సరికొత్త రక్షణ, పొదుపు పాలసీ.. ఇవీ వివరాలు | LIC Bachat Plus Scheme: New Policy! Combination of protection and savings

LIC Bachat Plus Scheme New Policy: In a major development, Life Insurance Corporation (LIC) on Monday said it has introduced a new policy, Bachat Plus that offers a combination of protection and savings.
Story first published: Tuesday, March 16, 2021, 20:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X