For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిప్టోకరెన్సీ: లైట్‌కాయిన్, డోజీకాయిన్, బిట్ కాయిన్ ధరలు ఇలా

|

మిల్లీనియల్స్ క్రిప్టోకరెన్సీ పైన చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల క్రిప్టోలు బిట్ కాయిన్, ఎథేరియం, లైట్ కాయిన్, డోజికాయిన్ వంటివి ఎగిసిపడుతున్నాయి. బిట్ కాయిన్ వంటివి ఆల్ టైమ్ గరిష్టంతో క్షీణించినప్పటికీ ఏడాది ప్రాతిపదికన చూస్తే ఎన్నో రెట్ల రిటర్న్స్ అందించాయి. క్రిప్టోకరెన్సీ పైన ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇది తాత్కాలికమేననే వాదనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడుల కోసం బంగారంతో పాటు క్రిప్టోను కూడా ఎంచుకుంటున్నారు. క్రిప్టో అంచనాలు కాస్త కష్టమే. అందుకే చాలామంది దీనికి అనుకూలంగా ఉండటంలేదు.

క్రిప్టోలో హెచ్చుతగ్గులు

క్రిప్టోలో హెచ్చుతగ్గులు

సంప్రదాయ డబ్బులా కాకుండా క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ మార్కెట్ ద్వారా లెక్కించబడుతుంది. బిట్ కాయిన్ పైన ఇప్పటికే వివిధ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు బినాన్స్ కాయిన్, కార్డానో, లైట్ కాయిన్, చైన్ లింక్ బుల్లిష్‌గా ఉంటాయని భావిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నందున క్రిప్టో రంగంపై ఓ కన్నెద్దాం...

బిట్ కాయిన్, ఎథేరియం..

బిట్ కాయిన్, ఎథేరియం..

లిట్‌కాయిన్- ఈ వారం లిట్‌కాయిన్(LTC) 35 శాతం ఎగిసింది. ఈ నెలలో ఇది మరింతగా ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నరు.

ఎథేర్- ఎథేరియం మంగళవారం ఆల్ టైమ్ గరిష్టం నుండి తగ్గింది. ఎథేరియం 4070ను తాకింది.

బిట్ కాయిన్- బిట్ కాయిన్ వ్యాల్యూ ఇటీవల తగ్గుతోంది. గత 24 గంటల్లోనే 5 శాతం మేర క్షీణించింది. ఓ సమయంలో ఇది 64వేల డాలర్లను క్రాస్ చేసింది. ప్రస్తుతం 56వేలకు సమీపంలో ఉంది.

డోజీకాయిన్- డోజీ కాయిన్ ఇటీవల బాగా వినిపిస్తోన్న పేరు. అతికొద్ది కాలంలోనే పది రెట్లు ఎగిసింది. గత వారం ఓ సమయంలో 0.74 డాలర్లకు పెరిగింది. మంగళవారం డోజీ 0.50 డాలర్ల వద్ద ఉంది.

మరిన్ని అంశాలు

మరిన్ని అంశాలు

డోజ్ కిల్లర్ అనేది సరికొత్త డిజిటల్ టోకెన్. ఇది చైనీస్ క్రిప్టోకరెన్సీ సర్కిల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. క్రిప్టోకరెన్సీ వ్యాల్యూమ్ అంతకంతకూ పెరగడంపై కొరియా ఫౌండేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. క్రిప్టోకరెన్సీ సేవలు ప్రారంభించేందుకు బ్యాంకులకు అధికారం ఇచ్చేందుకు నెబ్రాస్కా లెజిస్లేటర్స్ దృష్టి సారించారు.

English summary

క్రిప్టోకరెన్సీ: లైట్‌కాయిన్, డోజీకాయిన్, బిట్ కాయిన్ ధరలు ఇలా | Latest Crypto News: Litecoin, Dogecoin, Bitcoin, Ethereum Prices After A rally

Millennials are becoming more interested in cryptocurrency. A cryptocurrency is a form of digital currency that can be used to buy things on certain websites. Because of how unpredictable cryptocurrencies can be, not everybody accepts them.
Story first published: Wednesday, May 12, 2021, 13:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X