For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. కొటక్ మహీంద్రా గుడ్‌న్యూస్: వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

|

ప్రయివేటురంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు గురువారం (సెప్టెంబర్ 9) రోజున ప్రకటించింది. తగ్గించిన వడ్డీ రేట్లు సెప్టెంబర్ 10(శుక్రవారం) నుండి అమలులోకి వస్తాయని ప్రకటించింది. రిపోర్ట్ ప్రకారం హోమ్ లోన్ వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. తాజా తగ్గింపుతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు 6.50 శాతం నుండి ప్రారంభమవుతాయి. జూలై నెల డేటా ప్రకారం ఇప్పటికే వివిధ బ్యాంకులతో పోలిస్తే కొటక్ మహీంద్రా బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్‌ను అందిస్తోంది.

దాదాపు 16 బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రూ.75 లక్షలకు మించిన హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటును ఏడు శాతంతో అందిస్తున్నాయి. ప్రయివేటు రంగ బ్యాంకుల విషయానికి వస్తే కొటక్ మహీంద్రా బ్యాంకు, ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులు తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. వీటిలో వడ్డీ రేటు 6.65 శాతంగా ఉంది. ప్రభుత్వ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ దిగ్గజం HDFCలలో రూ.75 లక్షలకు మించిన హోమ్ లోన్ పైన వడ్డీ రేటు 6.95 శాతంగా ఉంది.

ఎస్బీఐ ఇటీవలే అద్భుతమైన హోమ్ లోన్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మాన్‌సూన్ ధమాకా ఆఫర్‌లో భాగంగా హోమ్ లోన్ పైన ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. ఇది గత నెలతో ముగిసింది.

Kotak Mahindra slashes home loan rates by 15bps to 6.5 percent per annum

వివిధ బ్యాంకుల్లో రూ.75 లక్షల హోమ్ లోన్ 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంటే కనుక వడ్డీ రేట్లు, ఈఎంఐ ఇలా ఉండవచ్చు. కొటక్ మహీంద్రా బ్యాంకు వడ్డీ రేటు 6.50 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు వడ్డీ రేటు 6.65 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 6.75 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ వడ్డీ రేటు 6.75 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేటు 6.80 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.85 శాతం, ఐడీబీఐ బ్యాంకు వడ్డీ రేటు 6.85 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 6.85 శాతం.

ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా సవరిస్తున్నాయి

ఇటీవల పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు, హోమ్ లోన్ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. పక్షం రోజుల క్రితం ప్రయివేటురంగ బ్యాంకు ధనలక్ష్మీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఈ ప్రయివేటురంగ బ్యాంకు రెగ్యులర్, సీనియర్ సిటిజన్స్ కోసం వివిధ రకాల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను అందిస్తోంది. ధనమ్ అభివృద్ధి టర్మ్ డిపాజిట్ స్కీం, ధనమ్ క్యుమ్యులేటివ్ డిపాజిట్ సర్టిఫికెట్(DCDC), సురభి డిపాజిట్, ధనమ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ డిపాజిట్, శ్రీ ధన చక్ర డిపాజిట్, సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ వంటి స్కీమ్స్‌ను అందిస్తోంది.

వివిధ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ధనలక్ష్మి బ్యాంకు అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితికి రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన బ్యాంకు ప్రస్తుతం 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 3.75 శాతం, 91 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 4.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 180 రోజుల నుండి ఏడాది కాలపరిమితిపై 4.25 శాతం, ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై 5.15 శాతం, రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 5.30 శాతం, మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 5.40 శాతం, అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

అంతకుముందు ఐడీబీఐ బ్యాంకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. IDBI 16వ తేదీ ఆగస్ట్ 2021 నుండి ఫిక్స్డ్ డిపాజిట్స్(FD) పై వడ్డీరేట్లను సవరించింది. ఐడీబీఐ బ్యాంకు రెండు రకాల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను అందిస్తుంది. ఇందులో సువిథ ఫిక్స్డ్ డిపాజిట్, ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలు ఉన్నాయి. ఈ రెండింటిలోను కనీస డిపాజిట్ మొత్తం రూ.10,000, ఆటో రెన్యూవల్, నెలవారీ, త్రైమాసికం, ఏడాది ఇన్‌కం ప్లాన్స్, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ రేట్లు, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, స్వీప్-ఇన్ వంటి అంశాలు ఉన్నాయి. సువిధ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద ఏడు రోజుల నుండి పది సంవత్సరాల పదవీ కాలాన్ని ఎంచుకోవచ్చు. అయితే ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్ స్కీంలో సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు పొందడానికి అయిదు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇటీవల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది.

ఐడీబీఐ బ్యాంకు వడ్డీ రేట్ల సవరణ అనంతరం ఏడు రోజుల నుండి 30 రోజుల కాలపరిమితిపై 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 31 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై 2.80 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 3 శాతం వడ్డీ రేటు, 91 రోజుల నుండి 6 నెలల కాలపరిమితిపై 3.50 శాతం వడ్డీ రేటు, 6 నెలల నుండి ఏడాది కాలపరిమితిపై 4.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

English summary

హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. కొటక్ మహీంద్రా గుడ్‌న్యూస్: వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు | Kotak Mahindra slashes home loan rates by 15bps to 6.5 percent per annum

Kotak Mahindra Bank announced on September 9 that it has reduced home loan rates by 15 base points effective September 10.
Story first published: Thursday, September 9, 2021, 15:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X