For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jeevan Umang Policy: 100 ఏళ్ల వరకు ప్రతి ఏటా పెన్షన్ తరహా ప్రయోజనం, ఈ స్కీం గురించి తెలుసా..

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) కస్టమర్ల అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా వివిధ బీమా ఉత్పత్తులను క్రమం తప్పకుండా అందిస్తోంది. ఈ సంస్థ అందించే ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పూర్తి జీవిత బీమా పథకం. ఇది పాలసీదారు, పాలసీదారుపై ఆధారపడిన వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం, ఆదాయ రక్షణను అందిస్తుంది. మెచ్యూరిటీ వరకు ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత హామీ ప్రయోజనాలలో యాన్యువల్ సర్వైవల్ బెనిఫిట్స్, పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. పాలసీ మొత్తం ప్రీమియం పూర్తిగా చెల్లిస్తే పెన్షన్ తరహాలో పాలసీలో నిర్దేశించిన కాలపరిమితికి ప్రయోజనాలు కూడా అందుతాయి.

పాలసీ... వయస్సు

పాలసీ... వయస్సు

జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 90 రోజులు. గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. అయితే ప్లాన్‌ను బట్టి మారవచ్చు. తల్లిదండ్రులు కొత్తగా పుట్టిన తమ బేబీ కోసం ఈ పాలసీని తీసుకోవచ్చు. వారు పెరిగిన తర్వాత మంచి రిటర్న్స్ చేతికి వస్తాయి. కనీస సమ్ అస్యూర్ రూ.2 లక్షలు. గరిష్ట పరిమితి లేదు.

జీవన్ ఉమాంగ్‌లో నాలుగు ప్రీమియం టర్మ్స్ ఉన్నాయి. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కనీస, గరిష్ట వయో పరిమితి ఆధారంగా పాలసీ టర్మ్ మారుతుంది.

30 ఏళ్ల కాలపరిమితికి గాను జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవాలనుకుంటే.. సదరు ఇండివిడ్యువల్ వయస్సు 40 ఏళ్లు ఉండాలి. అప్పుడు 70 ఏళ్లకు పూర్తవుతుంది.

కనీసం 15 ఏళ్ల కాలపరిమితితో తీసుకోవాలి. అంటే ఈ పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయస్సు 55.

జీవన్ ఉమాంగ్ పాలసీ గరిష్ట వయో పరిమితిని 70. కనిష్ట వయోపరిమితి 30. తల్లిదండ్రులు కొత్తగా పుట్టిన తమ చిన్నారి కోసం ఈ పాలసీ తీసుకుంటే 30 ఏళ్లకు పూర్తవుతుంది.

100 ఏళ్ల వరకు

100 ఏళ్ల వరకు

ఈ ప్రభుత్వ బీమా కంపెనీ మెచ్యూరిటీ వయస్సును 30 ఏళ్లుగా నిర్ణయించింది. జీవన్ ఉమాంగ్ ప్లాన్ ప్రకారం మెచ్యూరిటీ సమయం వరకు ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత ఎల్ఐసీ ఏటా బీమా మొత్తంలో ఎనిమిది శాతం చెల్లిస్తుంది.

ఉదాహరణకు ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే సమయానికి పాలసీదారు 70 ఏళ్లు ఉంటే సదరు వ్యక్తి 100 ఏళ్లు వచ్చే వరకు వార్షిక మనుగడ ప్రయోజనాలు (ఇయర్లీ సర్వైవల్ బెనిఫిట్స్) అందుకుంటారు. 100 ఏళ్ల లోపు మృతి చెందితే నామినీకి ఏకమొత్తంలో చెల్లిస్తారు.

జీవన్ ఉమాంగ్ నాన్-లింక్డ్ ఇన్సురెన్స్ పాలసీ. గ్యారెంటీ రిటర్న్స్ హామీ ఇవ్వవచ్చు. డబ్బును ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయదు. పాలసీదారు సింపల్ రివర్సనరీ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్‌కు అర్హులు. కస్టమర్స్ అన్ని ప్రీమియంలను సక్రమంగా చెల్లిస్తే మెచ్యూరిటీ తర్వాత ఈ బోనస్‌లు ఏకమొత్తానికి జతకలుస్తాయి.

నామినీ మరణిస్తే

నామినీ మరణిస్తే

ఒకవేళ పాలసీదారు తొలి అయిదేళ్లలో మరణిస్తే పాలసీ హామీ మొత్తాన్ని నామినీకి అందిస్తారు. ఒకవేళ అయిదేళ్ల తర్వాత మరణిస్తే హమీ మొత్తంతో పాటు లాయల్టీ బోనస్ అందుతుంది.

ఒకవేళ పాలసీదారు అన్ని ప్రీమియంలు సక్రమంగా చెల్లిస్తే ప్రీమియం చెల్లించిన తేదీ ముగిసిన నాటికి పాలసీ మెచ్యూరిటీ వరకు ఏటా హామీ మొత్తంలో 8 శాతం అందిస్తారు. మెచ్యూరిటీ లోపు పాలసీదారు మరణిస్తే హామీ మొత్తాన్ని నామినీకి లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు.

ఒకవేళ పాలసీదారు 25 ఏళ్ల వయసులో రూ.5 లక్షల హామీ మొత్తంతో, 30 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకుంటే, ఆ వ్యక్తి ప్రతి సంవత్సరం రూ.14,758 ప్రీమియం చొప్పున 55 ఏళ్ల వయసు వరకు చెల్లించాలి. అక్కడి నుండి అతనికి 100 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏటా హామీ మొత్తంలో 8 శాతం అందుతుంది. అప్పటికీ జీవించి ఉంటే హామీ మొత్తం, ప్రయోజనాలు కలిపి రూ.63,08,250 అందుతాయి. ఆలోపు మరణిస్తే హామీ మొత్తంతో పాటు లాయల్టీ బోనస్ నామినీకి అందిస్తారు.

వివరాలు క్లుప్తంగా....

వివరాలు క్లుప్తంగా....

క్లెయిమ్ కనీస హామీ మొత్తం రూ.2 లక్షలు

గరిష్ఠ హామీ మొత్తం పరిమితి లేదు

ప్రీమియం చెల్లింపు కాలపరిమితి: 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు

పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 90 రోజులు

పాలసీ తీసుకోవడానికి గరిష్ఠ వయస్సు 55 ఏళ్లు

ప్రీమియం చెల్లింపు పూర్తయ్యే నాటికి కనీస వయస్సు 30 ఏళ్లు.

ప్రీమియం చెల్లింపు పూర్తయ్యే నాటికి ఉండాల్సిన గరిష్ఠ వయస్సు 70 ఏళ్లు

పాలసీ మెచ్యూరిటీకి గరిష్ఠ వయస్సు 100 ఏళ్లు.

English summary

Jeevan Umang Policy: 100 ఏళ్ల వరకు ప్రతి ఏటా పెన్షన్ తరహా ప్రయోజనం, ఈ స్కీం గురించి తెలుసా.. | Jeevan Umang Policy can Get you up to Rs 28 lakh Return for Rs 1,302 per Month

LIC of India regularly launches various insurance products according to the need and demand of customers.
Story first published: Tuesday, October 26, 2021, 17:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X