For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Children Mutual Fund:ఈ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేసి పిల్లలను లక్షాధికారులుగా మార్చండి..ఎలా అంటే..!!

|

పిల్లల కోసం ఎన్నో బీమా కంపెనీలు ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చాయి. వారు ఎదిగే కొద్దీ మంచి రిటర్న్స్ ఇవ్వడం లేదా... వారు పెరిగి పెద్దాయ్యాక ఉన్నత చదువుల కోసం లేదా వారి వివాహాల కోసం ఉపయోగపడేలా ఈ పాలసీలను రూపొందించారు. ఇక మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కూడా చిన్న పిల్లల కోసం పలు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాయి. ఇవి కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఈ స్కీమ్స్‌ను సరైన పద్ధతిలో వినియోగించినట్లయితే పిల్లలు పెరిగి పెద్దయి ఉద్యోగంలో సెటిల్ అయ్యేలోపే మిలయనీర్లుగా మారే అవకాశం ఉంది. కొన్ని స్కీమ్‌లు ఏడాదిలో 50శాతం రాబడిని ఇస్తుండగా 5 సంవత్సరాల్లో సగటున 15శాతం రాబడి కూడా ఇస్తున్నాయి.

పిల్లలను లక్షాధికారులగా మార్చండి

పిల్లలను లక్షాధికారులగా మార్చండి

ఈ మ్యూచువల్ ఫండ్ స్కీములు సుదీర్ఘకాలంలో సగటున 15శాతం రిటర్న్స్‌ ఇస్తాయి. ఉదాహరణకు ప్రతి ఏటా సగటున 12శాతం రిటర్న్స్‌ ఇస్తాయి అని అనుకుంటే పిల్లలు పెరిగి పెద్దయ్యాక అంటే ఓ 25 ఏళ్లు వచ్చేసరికి ఉద్యోగంలో సెటిల్ కాకమునుపే లక్షాధికారులుగా మారుతారు. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్ సిప్‌ పిల్లల పేరుతో తీసుకుని నెలకు రూ.5వేలు ఇన్వెస్ట్ చేయాలి.

ఒకవేళ 18 ఏళ్లకే పిల్లలు లక్షాధికారులుగా మారాలని భావిస్తే అప్పుడు నెలకు రూ.13వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి మ్యూచువల్ ఫండ్ స్కీములు పిల్లలను లక్షాధికారులుగా మారుస్తుందో తెలుసుకుందాం. ఇదంతా ఆర్థిక నిపుణుల నుంచి సేకరించిన సమాచారం.

UTI CCF మ్యూచువల్ ఫండ్ స్కీమ్

UTI CCF మ్యూచువల్ ఫండ్ స్కీమ్

UTI CCF మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఒక సంవత్సరంలో 51.92 శాతం రాబడిని ఇస్తోంది. దీన్ని 2021 ఆగష్టు 25 ఎన్‌ఏవీ ఆధారంగా రిటర్న్స్‌ను లెక్కించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఈ ప్లాన్‌ను ఈ రోజు తీసుకుంటే దీని రిటర్న్స్ ఇంచుమించు అలా ఉంటాయి. టాటా యంగ్ సిటిజన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కూడా ఒక ఏడాదిలో 51.53 శాతం రిటర్న్స్ ఇస్తోంది. ఇది కూడా 2021 ఆగష్టు 25 ఎన్‌ఏవీ ఆధారంగా రిటర్న్స్‌ను లెక్కించడం జరిగింది.

HDFC చిల్డ్రన్ గిఫ్ట్ ప్లాన్

HDFC చిల్డ్రన్ గిఫ్ట్ ప్లాన్

హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్ గిఫ్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కింద ఏడాదికి 41.23 శాతం రిటర్న్స్ ఇస్తోంది. 2021 ఆగష్టు 25 ఎన్‌ఏవీ ఆధారంగా రిటర్న్స్‌ను లెక్కించడం జరిగింది. ఇక మరో ప్రైవేట్ బ్యాంక్ నుంచి ఇంకో మ్యూచవల్ ఫండ్ స్కీమ్ ఉంది. అదే యాక్సిస్ చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఒక ఏడాదిలో 36.31శాతం గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తోంది. ఇది కూడా 2021 ఆగష్టు 25 ఎన్‌ఏవీ ఆధారంగా రిటర్న్స్‌ను లెక్కించడం జరిగింది.

 LIC మ్యూచువల్ ఫండ్

LIC మ్యూచువల్ ఫండ్

ప్రముఖ ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసీ కూడా పిల్లల కోసం మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ను అందిస్తోంది. ఇది చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్‌గా పిలుస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏడాదికి 32.78 శాతం రిటర్న్స్ వస్తున్నాయి. 2021 ఆగష్టు 25 ఎన్‌ఏవీ ఆధారంగా రిటర్న్స్‌ను లెక్కించడం జరిగింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బాల్ భవిష్య యోజన మ్యూచువల్ ఫండ్ పథకం కింద 1 సంవత్సరంలో 26.02 శాతం రాబడిని ఇస్తోంది. 25 ఆగస్టు 2021 NAV ఆధారంగా రాబడిని లెక్కించబడింది.

ఎస్‌బీఐ మాగ్నమ్ చిల్డ్రన్ ప్లాన్

ఎస్‌బీఐ మాగ్నమ్ చిల్డ్రన్ ప్లాన్

SBI మాగ్నమ్ చిల్డ్రన్ బెనిఫిట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసిన వారికి ఒక సంవత్సరంలో 23.68 శాతం రిటర్న్స్ వస్తున్నాయి. 25 ఆగస్టు 2021 NAV ఆధారంగా రాబడులను లెక్కించడం జరిగింది. మొత్తానికి చాలా కంపెనీలు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పలు మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్‌ను అందిస్తున్నాయని చెప్పారు బీపీఎన్ ఫిన్ క్యాప్ డైరెక్టర్ ఏకే నిగమ్. సుదీర్ఘ కాలం అంటే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే పిల్లల కోసం బంగారు బాటను ఏర్పాటు చేసి మంచి సంపదను వారికోసం సృష్టించినవారం అవుతామని చెప్పారు.

మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత ఎక్కువ కాలం పెట్టుబడులు పెడితే అంత మంచి లాభాలను ఆశించొచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే పిల్లలు పుట్టిన వెంటనే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వారికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు వచ్చేసరికి లక్షాధికారులుగా మారతారు.

English summary

Children Mutual Fund:ఈ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేసి పిల్లలను లక్షాధికారులుగా మార్చండి..ఎలా అంటే..!! | Invest in Children Mutual fund scheme and make them millionaires in 18 years,Check here

Many private players are offering good Mutual fund schemes for children that gives good returns.
Story first published: Thursday, August 26, 2021, 17:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X