For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021లో సరళ్ జీవన్ బీమా: ప్రీమియం కాస్త ఎక్కువే కానీ..

|

కొత్త సంవత్సరంవేళ సరళ్ జీవన్ బీమా లేదా స్టాండర్జైడ్జ్ టర్మ్ పాలసీ ప్రీమియం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 1, 2021 నుండి ఈ పాలసీని ప్రారంభించాలని అన్ని బీమా సంస్థలు ఇన్సురెన్స్ రెగ్యులేటర్ irdaiని కోరాయి. ఈ పాలసీ వివిధ అంశాలపరంగా సరళంగానే ఉండవచ్చునని, కానీ ఇప్పటికే ఉన్న ఈ తరహా ఇతర పాలసీలతో పోలిస్తే ప్రీమియం కాస్త ఎక్కువగా ఉండవచ్చునని బీమా అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత బీమా పాలసీలతో పోలిస్తే తమ బేస్ రేట్లపై 200 శాతం నుండి 400 శాతం పెంపుకు రీ-ఇన్సూరర్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 8.5 శాతం వడ్డీకి ఆర్థికశాఖ ఓకేఉద్యోగులకు గుడ్‌న్యూస్, 8.5 శాతం వడ్డీకి ఆర్థికశాఖ ఓకే

సరికొత్త సరళ్ జీవన్ బీమా

సరికొత్త సరళ్ జీవన్ బీమా

irdai మార్గదర్శకాలకు అనుగుణంగా సరళ్ బీమా పాలసీని రూపొందించామని, తుది అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని, ఆ తర్వాత ప్రీమియం వివరాలు వెల్లడిస్తామని ఇన్సురెన్స్ కంపెనీలు చెబుతున్నాయి. కరోనా కవచ్, కరోనా రక్షక్, ఆరోగ్య సంజీవిని తర్వాత IRDAI సరళ్ జీవన్ బీమా పాలసీతో ముందుకు వచ్చింది. ఈ కొత్త పాలసీని బీమా కంపెనీలు జనవరి 1, 2021 నుండి ప్రారంభించవచ్చు.

సరళ్ జీవన్ బీమా పాలసీ ఇదీ...

సరళ్ జీవన్ బీమా పాలసీ ఇదీ...

స్టాండర్డ్ హెల్త్ ఇన్సురెన్స్ ప్రోడక్ట్ ఆరోగ్య సంజీవిని వలె సరళ్ జీవన్ బీమా ఒకేరకమైన లక్షణాలు, ప్రయోజనాలు, ఇన్‌‌క్లూజన్స్, మినహాయింపులు కలిగి ఉండవచ్చును. అయితే ధరలు, సేవలస్థాయి, క్లెయిమ్ సెటిల్మెంట్ కాస్త భిన్నంగా ఉండవచ్చు.

సరళ్ జీవన్ బీమా పాలసీ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ పూర్తి రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్. పాలసీ కాలంలో ప్రమాదవశాత్తూ మరణిస్తే నామినీకి ఒకే మొత్తంలో హామీ మొత్తాన్ని చెల్లిస్తారు.

ఈ ప్రోడక్ట్ ప్రాంతం, జెండర్, ట్రావెల్, వృత్తి లేదా విద్యార్హతలతో సంబంధం లేకుండా అందరికీ అందుతుంది.

కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 65. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70. పాలసీ టర్మ్ 5 ఏళ్ల నుండి 40 ఏళ్ల వరకు ఉంటుంది.

ప్రీమియం ఆప్షన్

ప్రీమియం ఆప్షన్

మినిమం సమ్ అస్యూర్డ్ రూ.5 లక్షలు, మ్యాగ్జిమమ్ సమ్ అస్యూర్డ్ రూ.25 లక్షలు. పాలసీదారు రూ.25 లక్షలకు మించి కూడా ఆప్షన్ ఎంచుకోవచ్చు.

మూడు ప్రీమియం చెల్లింపు ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్రీమియం. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు. సింగిల్ ప్రీమియం.

English summary

2021లో సరళ్ జీవన్ బీమా: ప్రీమియం కాస్త ఎక్కువే కానీ.. | Insurers to offer Saral Jeevan Bima policy from January 1: all you need to know

After Corona Kavach, Corona Rakshak, and Arogya Sanjeevani, the Insurance Regulatory and Development Authority of India (IRDAI) has come out with a standardised term insurance policy known as 'Saral Jeevan Bima'.
Story first published: Friday, January 1, 2021, 14:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X