For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండస్ఇండ్ బ్యాంకు పండుగ ఆఫర్, డెబిట్ కార్డ్స్‌పై EMI సౌకర్యం

|

పండుగ సీజన్‌లో వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు పలు రకాల ఆఫర్లు, డీల్స్ ద్వారా అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు.. ఇలా పలు బ్యాంకులు పండుగ సమయంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. కరోనా కారణంగా కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ఇప్పటికే వడ్డీ రేటును తగ్గించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గాయి. ఇప్పుడు పండుగ సమయంలో బ్యాంకులు ప్రత్యేక ఆఫర్‌తో మరింత తగ్గించాయి. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం.

కేవలం హోమ్ లోన్ పైనే కాకుండా ఆయా బ్యాంకులు వివిధ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండస్‌ఇండ్ బ్యాంకు కస్టమర్లకు మరో తీపి కబురు అందించింది. డెబిట్ కార్డ్స్ పైన ఈఎంఐ సదుపాయాన్ని ప్రారంభించింది. దీంతో అధిక మొత్తాన్ని వెచ్చించి ట్రాన్సాక్షన్స్ నిర్వహించే కస్టమర్లు వాటిని సులభ వాయిదాల్లోకి మార్చుకునే వెసులుబాటు దక్కుతుంది. బ్యాంకు డెబిట్ కార్డు కలిగినవారు నేరుగా ఆయా దుకాణాల్లో తమ కార్డును మర్చంట్ పీవోఎస్ టర్మినల్ వద్ద స్వైప్ చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.

సులభ వాయిదాల్లో చెల్లింపు

సులభ వాయిదాల్లో చెల్లింపు

కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ అనుభూతిని అందించ‌డంలో తాము ముందుంటామని, ఇప్పుడు డెబిట్ కార్డు హోల్డర్లకు EMI సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, దీంతో నిర్ణీత వ్య‌వ‌ధిలో సుల‌భ వాయిదాల్లో క‌స్ట‌మ‌ర్లు చెల్లింపులు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని ఇండ‌స్ఇండ్ బ్యాంకు చీఫ్ డిజిట‌ల్ అధికారి చారుమాధుర్ తెలిపారు.

భారీ రిటైల‌ర్లు, హైప‌ర్ మార్కెట్స్ స‌హా 60,000 ఆఫ్‌లైన్ మర్చంట్స్ ఔట్‌లెట్ల‌తో ఇండ‌స్ఇండ్ బ్యాంకుకు భాగస్వామ్యం ఉందన్నారు. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్, అప్పారెల్స్, ఆటోమొబైల్స్, హోమ్ డెకార్, హాస్పిటల్స్ తదితర ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు డెబిట్ కార్డు హోల్డర్లు పండుగ సమయంలో వారు కొనుగోలు చేసిన ఉత్ప‌త్తుల‌పై డెబిట్ కార్డు ఈఎంఐ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని చెప్పారు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలలతో సుల‌భ వాయిదాల ద్వారా చెల్లింపుల‌ు జరపవచ్చునని తెలిపింది.

ఇలా చేయండి

ఇలా చేయండి

డెబిట్ కార్డు హోల్డర్లు MYOFR అని టైప్ చేసి 5676757కు సందేశాన్ని పంపించడం ద్వారా పై ప్రయోజనాన్ని పొందవచ్చు. కాగా, అంతేకాదు, ఇండస్ఇండ్ బ్యాంకు త్వరలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో జత కట్టనుంది. ఆన్ లైన్ కొనుగోళ్ల ప్రారంభానికి వీటితో భాగస్వామ్యం కానుంది.

షేర్లు అప్ అండ్ డౌన్

షేర్లు అప్ అండ్ డౌన్

ఇండస్ఇండ్ బ్యాంకు షేర్ ధర బీఎస్ఈలో నిన్న 0.56 శాతం లాభపడి రూ.1201 వద్ద ముగిసింది. అయితే నేడు మాత్రం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12 సమయానికి 1.56 శాతం లేదా రూ.18.95 నష్టపోయి రూ.1182.75 వద్ద ట్రేడ్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంకు కన్స్యూమర్, కార్పోరేట్ కస్టమర్లకు సేవలు అందిస్తుంది.

30 జూన్ 2021 నాటికి ఇండస్ఇండ్ బ్యాంకు పంపిణీ నెట్ వర్క్‌లో 2015 శాఖలు, బ్యాంకింగ్ ఔట్ లెట్స్ ఉన్నాయి. 2870 ఆన్‌సైట్ అండ్ ఆఫ్ సైట్ ఏటీఎంలు ఉన్నాయి. ఇవి 760 జియోగ్రాఫిక్ లొకేషన్స్‌లో ఉన్నాయి. అదే సమయంలో 30 జూన్ 2020 నాటికి 1911 బ్రాంచీలు అండ్ బ్యాంకింగ్ ఔట్ లెట్స్, 2721 ఆన్ సైట్ అండ్ ఆఫ్ సైట్ ఏటీఎంలు ఉన్నాయి. ఇవి 751 జియోగ్రాఫిక్ లొకేషన్స్‌లో ఉన్నాయి.

English summary

ఇండస్ఇండ్ బ్యాంకు పండుగ ఆఫర్, డెబిట్ కార్డ్స్‌పై EMI సౌకర్యం | IndusInd Bank EMI on debit cards ahead of festive season

IndusInd Bank has launched EMI facility on debit cards amid the ongoing festive season to add to the festivities. Using the new facility, customers can convert their high value transactions debit card purchases into EMI.
Story first published: Thursday, October 21, 2021, 12:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X