For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Loans: బంగారం రుణం తీసుకున్నారా, మీపై ప్రభావం ఎలా?

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో పసిడి ధరలు భారీగా ఎగిశాయి. వ్యాక్సీన్ రాక నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గి భారీగా పడిపోయాయి. ఓ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో 2072 డాలర్లకు ఎగిసిన గోల్డ్ ఫ్యూచర్ ఇప్పుడు 1750 డాలర్లకు దిగువన, దేశీయ మార్కెట్ ఎంసీఎక్స్‌లో రూ.56,200 పలికిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.46,000 స్థాయిలో ఉంది. కరోనా ఎంతోమంది ఉద్యోగాలు పోవడానికి కారణమైంది. మరెంతోమంది వేతనాల్లో కోత పడింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో చేతిలో డబ్బులులేని వారు ఉద్యోగులైతే పీపీఎఫ్, ఇతరులు బంగారంపై రుణాలు తీసుకొని, తమ అవసరాలు తీర్చుకున్నారు. అత్యవసరంగా డబ్బు అవసరమైతే గోల్డ్ లోన్‌ను చాలామంది ఎంచుకుంటారు.

మైక్రోసాఫ్ట్ భారీ డీల్, 20 బిలియన్లకు AI న్యూఆన్స్ కొనుగోలుమైక్రోసాఫ్ట్ భారీ డీల్, 20 బిలియన్లకు AI న్యూఆన్స్ కొనుగోలు

కొత్త రుణ గ్రహీత... తక్కువ మొత్తం

కొత్త రుణ గ్రహీత... తక్కువ మొత్తం

బంగారం ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్న వారికి ఎక్కువ మొత్తం చేతికి వచ్చింది. ఇప్పుడు ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో దాదాపు రూ.10వేలు తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు లోన్ తీసుకునే వారికి తక్కువ వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం లోన్ టు వ్యాల్యూ (LTV) రేషియో 75 శాతంగా ఉంటుంది.

ఈ LTV రేషియో మార్చి 31, 2021 వరకు 90 శాతం పెంచుతూ బ్యాంకులకు అనుమతి లభించింది. LTV అంటే రూ.100 విలువ కలిగిన బంగారంపై బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్‌సీలు రూ.75 రుణం ఇస్తాయి. కనీసం 18 క్యారెట్ల ప్యూరిటీ కలిగిన బంగారంపై లోన్ ఇస్తారు. బంగారం వ్యాల్యూ చేసే సమయంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు ఆభరణాలలో ఉండే స్టోన్స్, ఇతర ఖరీదైన వాటిని లెక్కించవు.

పాత రుణ గ్రహీత అయితే

పాత రుణ గ్రహీత అయితే

ఇప్పటికే మీరు రుణం తీసుకొని ఉంటే, అంటే బంగారం ధరలు గరిష్టస్థాయిలో ఉన్నప్పుడు గోల్డ్ లోన్ తీసుకుంటే మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్‌సీలు LTVకి అనుగుణంగా కొంత అడ్వాన్స్ చెల్లించాలని అడుగుతాయి. అంటే ప్రస్తుత బంగారం వ్యాల్యూకు అనుగుణంగా LTV ఉండే మొత్తం చెల్లించాలని అడుగుతాయి.

భారీగా పెరిగి.. తగ్గుతున్న పసిడి ధరలు

భారీగా పెరిగి.. తగ్గుతున్న పసిడి ధరలు

ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్ 1750 డాలర్లకు చేరువలో ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్లకు పైన ఉంది. కరోనా సెకండ్ వేవ్, అంతర్జాతీయ పరిణామాలు, ఈక్విటీ మార్కెట్ బేజారు వంటి వివిధ కారణాలతో గతవారం నుండి పసిడి ధరలు పెరుగుతున్నాయి. నిన్న కూడా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎగిశాయి.

నేడు కామెక్స్‌లో ధరలు స్వల్పంగా క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో నిన్న జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.545.00 (1.17%) పెరిగి రూ.46964.00 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.504.00 (1.08%) పెరిగి రూ.47153.00 వద్ద క్లోజ్ అయ్యాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,472.00 (2.23%) పెరిగి రూ.67600.00 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,490.00 (2.22%) పెరిగి రూ.68601.00 వద్ద క్లోజ్ అయింది.

English summary

Gold Loans: బంగారం రుణం తీసుకున్నారా, మీపై ప్రభావం ఎలా? | How will gold price impact borrowers?

In India, a large number of people have opted for gold loans to fulfil their urgent fund requirements as it is convenient to get a gold loan due to less paperwork.
Story first published: Wednesday, April 14, 2021, 11:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X