For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali picks: ఇల్లు కొనుగోలు చేస్తున్నారా.. వీటిని దృష్టిలో పెట్టుకోండి

|

సొంతింటి కల దాదాపు అందరికీ ఉంటుంది. బయటి నుండి లేదా కార్యాలయం నుండి వచ్చి సొంతింట్లో స్వతంత్రంగా, కంఫోర్టబులిటీని ఎవరు కోరుకోరు. ఒక ఇంటిని కొనుగోలు చేసినప్పుడు జీవితంలోనే అది అతిపెద్ద లక్ష్యం. కాబట్టి ఇంటి కొనుగోలు, ఇంటిపై రుణం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు చాలా అంశాలను పరిశీలించాలి. ఇదీ దీర్ఘకాలిక పెట్టుబడి కాబట్టి ఒక్క తప్పడటుగు వేసినా ఆర్థికంగా లేదా ఇతర రూపంలో ఇబ్బంది.

ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు వాస్తు, ఎక్కడ ఉంది, డిమాండ్ పుంజుకునే స్థానంలో ఉందాఅని చూడటం పరిపాటి. అయితే వీటితో పాటు చూడాల్సిన మరెన్నో అంశాలు ఉన్నాయి. అదే సమయంలో హోమ్ లోన్ తీసుకుంటే కూడా మరిన్ని విషయాలు పరిశీలించాల్సి ఉంటుంది.

మీకు సరిపోతుందా?

మీకు సరిపోతుందా?

మీరు ఎంచుకున్న ప్రాపర్టీ మీ బడ్జెట్‌కు, ఆదాయానికి సరిపోతుందా చూసుకోవడం తప్పనిసరి. చేతిలో తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ ఖర్చు పెట్టి ఆ తర్వాత ఇబ్బందులు పడకూడదు. మీకు సాధ్యమైన ఆదాయంలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. అందుబాటులో ఉన్న విభిన్న ప్రాపర్టీస్‌ను సరిపోల్చుకోండి.

నిర్మాణంలో ఉన్న లేదా రెడీ టు హోమ్ ధరలు భిన్నంగా ఉంటాయి. ఆస్తి వైశాల్యం, లే-ఔట్, సౌకర్యాలు, బిల్డర్ లేదా బ్రోకర్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా ధరల పైన ప్రభావం చూపుతాయి. మీ వద్ద పెట్టుబడి ఎంత, మీరు నెలకు ఎంత చెల్లించాలి, దానికి అనుగుణంగా మీరు ఈఎంఐని ఎంచుకోవడానికి ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

మీరు మీ సేవింగ్స్‌ను అలాగే ఉంచి, ఇంటి కొనుగోలు కోసం హోమ్ లోన్ కోసం వెళ్తే కనుక... వివిధ బ్యాంకుల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు, నిబంధనలు, షరతులను పరిగణలోకి తీసుకోవాలి. పండుగ సీజన్‌లో వివిధ బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వీటిని కూడా పరిశీలించాలి. అన్ని బ్యాంకులను పరిశీలించి ఎందులో తక్కువ వడ్డీ రేటు ఉంది, ఎందులో బెస్ట్ డీల్ ఉందో చూసుకోవాలి. ఉదాహరణకు HDFC ఫెస్టివ్ ట్రీట్ పేరుతో 6.7 శాతం వడ్డీ రేటుకు హోమ్ లోన్ అందిస్తోంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ.. తదితర బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేటుకే అందిస్తున్నాయి. బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును తగ్గించడం లేదా పూర్తిగా మినహాయించడం కూడా చేస్తున్నాయి.

ఆస్తి చట్టబద్దత

ఆస్తి చట్టబద్దత

ప్రాపర్టీని కొనుగోలు చేసే సమయంలో ఆస్తి చట్టబద్దతను చూసుకోవాలి. విక్రేత లేదా బిల్డర్ వారి పత్రాల చెల్లుబాటును తనిఖీ చేయడం ద్వారా వారికి స్పష్టమైన శీర్షిక ఉందని నిర్ధారించుకోవాలి. మీరు ముప్పై ఏళ్ల పత్రాలను తనిఖీ చేయాలి. ప్రామాణికంగా కనిష్టంగా పన్నెండు నుండి పదిహేనేళ్లు చూసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ పరిశీలించాలి.

- Sale deed

- Will (if any)

- Partition deed

- Government grant order

- Succession certificate

- Development agreement

- Power of attorney executed by the seller

- Nature of title document: whether it is development, leasehold, or freehold

ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్టాంప్, రిజిస్టర్డ్ అయి వ్యాలిడ్ అయి ఉండాలి.

అనుమతులు, పరిసర ప్రాంతాలు

అనుమతులు, పరిసర ప్రాంతాలు

బిల్డర్ లేదా డెవలపర్ నిర్మాణానికి అవసరమైన ఆమోదం, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కలిగి ఉన్నాయో లేదా నిర్ధారించుకోవాలి. ఈ అనుమతులు తగిన ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, పర్యావరణ బోర్డు, నీటి సరఫరా, మురుగు నీటి బోర్డు, విద్యుత్ బోర్డు, సంబంధిత మున్సిపల్ కార్పోరేషన్ నుండి ఉండాలి. రెరా రిజిస్ట్రేషన్ ఉండాలి.

మీరు కొనుగోలు చేసే ఇంటి పరిసర ప్రాంతాలను చూసుకోవడం తప్పనిసరి. మీరు నివసించే ప్రాంతంలో కనెక్టివిటీ, పుష్కలమైన సౌకర్యాలు, భౌతిక మౌలిక సదుపాయాలు చూసుకోవాలి.

English summary

Home loan this Diwali: Checklist of things to keep in mind

It is essential that the property you pick is within your budget and income. Do your research and compare different properties that are available.
Story first published: Thursday, October 28, 2021, 18:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X