For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్‌లోన్ వడ్డీ రేట్లు త్వరలో పెరిగే అవకాశం, డిపాజిటర్లకు మరింత రిటర్న్స్

|

ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేటు భారీ కనిష్టాల వద్ద ఉన్నాయి. చాలా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7 శాతం దిగువనే ఉన్నాయి. కొన్ని బ్యాంకులు అయితే హోమ్ లోన్ వడ్డీ రేటును 6.4 శాతం నుండి 6.5 శాతం మధ్య అందిస్తున్నాయి. అయితే వడ్డీ రేట్లు ఎంతోకాలం ఇలా కనిష్టాల వద్ద ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.5 శాతం వద్దనే కొనసాగటం అర్థవంతం కాదని బ్యాంకులు అంటున్నాయి. అదే సమయంలో బెంచ్ మార్క్ యీల్డ్స్ 7 శాతం దిశగా ఉన్నాయి.

హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా రెపో రేటుతో అనుసంధానమై ఉంటాయి. శుక్రవారం ఆర్భీఐ గవర్నర్ ఎంపీసీ సమావేశం నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా రెపో రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే మున్ముందు మాత్రం వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో వచ్చే కొద్ది నెలల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయని భావిస్తున్నారు.

 Home loan rates may rise soon, retail depositors set to see higher returns

జూన్ నెలలో రెపో రేటు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. త్వరలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని భాటియా అన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయని బ్యాంకర్లు అంటున్నారు. బల్క్ డిపాజిట్స్ పైన కూడా గత కొద్ది నెలలుగా పెరుగుదల కనిపిస్తోందని, రిటైల్ డిపాజిట్స్ పైన 5 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయని గుర్తు చేస్తున్నారు. రిటైల్ డిపాజిటర్లు త్వరలో మరింత ఎక్కువ రిటర్న్స్ పొందే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

English summary

హోమ్‌లోన్ వడ్డీ రేట్లు త్వరలో పెరిగే అవకాశం, డిపాజిటర్లకు మరింత రిటర్న్స్ | Home loan rates may rise soon, retail depositors set to see higher returns

Interest rates on home loans could move up soon even as banks will continue to increase deposit rates
Story first published: Sunday, April 10, 2022, 9:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X