For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్‌లోన్ వడ్డీ రేటు ఈ బ్యాంకులో తక్కువ! ప్రాసెసింగ్ ఫీజు లేదు

|

2019 సంవత్సరంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో వివిధ బ్యాంకుల లోన్ల భారం కూడా తగ్గింది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్లపై వడ్డీ భారం తగ్గింది. ఎస్బీఐ వంటి బ్యాంకుల వద్ద మూలధనం ఎక్కువగా ఉంది. అలాగే, ఆర్బీఐ రెపో రేటును తగ్గించింది. దీంతో రుణాలపై ఎక్కువ వడ్డీ రేటును ఇస్తోంది. అలాగే డిపాజిట్స్‌పై వడ్డీ తక్కువగా వస్తోంది. బ్యాంకులు వడ్డీ రేట్లను తమ పరిధిలో సాధ్యమైనంత మేరకు తక్కువ ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ రేటు ఎలా ఉందంటే...

అమ్మఒడి రూ.15,000లలో 1,000 తిరిగివ్వాలి! బ్యాంకులు జమ చేసుకోఅమ్మఒడి రూ.15,000లలో 1,000 తిరిగివ్వాలి! బ్యాంకులు జమ చేసుకో

వడ్డీ రేటులో స్వల్ప తేడా.. కానీ రూ.లక్షలే..

వడ్డీ రేటులో స్వల్ప తేడా.. కానీ రూ.లక్షలే..

వడ్డీ రేట్లు బ్యాంకు ప్రాతిపదికన మారుతుంటాయి. హోమ్ లోన్ విషయంలో ఇది స్వల్ప తేడా ఉంటుంది. వడ్డీ రేటులో స్వల్పంగా తేడా ఉన్నప్పటికీ ఇది లక్షల్లో తేడా వస్తుంది. కాబట్టి హోమ్ లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉంది అనే విషయం స్పష్టంగా తెలుసుకోవడం మంచిది.

యాక్సిస్ బ్యాంకు

యాక్సిస్ బ్యాంకు

- యాక్సిస్ బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8.55-9.4 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 871-926 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కనీసం రూ.10,000 ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా

- బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8.15-9.15 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 846-909 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.25 శాతం నుంచి 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కనీసం రూ.8,000, గరిష్టం రూ.25,000.

బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ ఇండియా

- బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8.1-9 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 843-900 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కనీసం రూ.1,500, గరిష్టం రూ.10,000.

కెనరా బ్యాంకు

కెనరా బ్యాంకు

- కెనరా బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8.1-9 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 843-900 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కనీసం రూ.1,500, గరిష్టం రూ.10,000.

సెంట్రల్ బ్యాంకు

సెంట్రల్ బ్యాంకు

- సెంట్రల్ బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8-8.3 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 836-855 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. గరిష్టం రూ.20,000.

కార్పోరేషన్ బ్యాంకు

కార్పోరేషన్ బ్యాంకు

- కార్పోరేషన్ బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8.1-8.35 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 843-858 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. గరిష్టం రూ.50,000.

HDFC

HDFC

- HDFC బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8-8.95 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 836-897 మధ్య EMI పడుతుంది.

- వేతన జీవులు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అయితే 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది లేదా రూ.3,000 ఇంటుంది. ఇందులో ఏది ఎక్కువ అయితే అది ఉంటుంది.

- సెల్ఫ్ ఎంప్లాయిడ్ నాన్ ప్రొఫెషనల్స్ అయితే ప్రాసెసింగ్ ఫీజు 1.50 శాతం ఉంటుంది. లేదా రూ.4,500 ఉంటుంది. ఇందులో ఏది ఎక్కువ అయితే అది ఉంటుంది.

- ట్యాక్స్ అదనం.

ICICI బ్యాంకు

ICICI బ్యాంకు

- ICICI బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8.2-8.45 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 849-865 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. గరిష్టం రూ.25,000

IOB బ్యాంకు

IOB బ్యాంకు

- IOB బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8.2-8.45 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 849-865 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. గరిష్టం రూ.25,000

PNB

PNB

- పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 7.95-8.45 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 833-865 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.35 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కనీసం రూ.2,500 గరిష్టం రూ.15,000.

SBI

SBI

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ వడ్డీ రేటు 7.9-8.55 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 830-871 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.40 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. జీఎస్టీ అప్లై అవుతుంది. కనీసం రూ.10,000 గరిష్టం రూ.30,000. ప్లస్ జీఎస్టీ.

సిండికేట్ బ్యాంకు

సిండికేట్ బ్యాంకు

- సిండికేట్ బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8-8.7 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 836-881 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కనీసం రూ.500.

UCO బ్యాంకు

UCO బ్యాంకు

- యూకో బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8.05-8.15 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 840-846 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ పైన 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కనీసం రూ.1,500 గరిష్టం రూ.15,000.

యునైటెడ్ బ్యాంకు

యునైటెడ్ బ్యాంకు

- యునైటెడ్ బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8-8.15 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 836-846 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ ప్రాసెసింగ్ ఫీజును మార్చి 31, 2020 వరకు ఎత్తి వేసింది.

యూనియన్ బ్యాంకు

యూనియన్ బ్యాంకు

- యూనియన్ బ్యాంకు ఫ్లోటింగ్ వడ్డీ రేటు 8.2-8.35 మధ్య ఉంటుంది. దీంతో నెలకు రూ.1 లక్షకు 849-858 మధ్య EMI పడుతుంది.

- లోన్ అమౌంట్ ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం ఉంటుంది. గరిష్టం రూ.15,000

English summary

హోమ్‌లోన్ వడ్డీ రేటు ఈ బ్యాంకులో తక్కువ! ప్రాసెసింగ్ ఫీజు లేదు | Home loan interest rates and EMI in top 15 banks, in January 2020

Year 2019 ended with a series of interest rate cuts and with banks moving from the marginal cost of funds-based lending rate (MCLR) to repo-based lending rates. While 2019 also witnessed a liquidity crisis and housing finance companies (HFCs) facing financial distress, the real estate sector is hoping for a positive 2020.
Story first published: Friday, January 10, 2020, 15:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X