For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు సవరించిన HDFC బ్యాంకు, ఎంతంటే?

|

ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు సేవింగ్స్ అకౌండ్ వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ప్రకారం బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 2, 2022 బుధవారం నుండి అమల్లోకి వచ్చాయి. ఇవి డొమెస్టిక్, ఎన్ఆర్‌వో, ఎన్ఆర్ఈ సేవింగ్స్ అకౌంట్‌కు వర్తిస్తాయి. కరోనా సమయంలో వివిధ వడ్డీ రేట్లు తగ్గాయి. ఆర్థిక రికవరీ క్రమంగా కనిపిస్తుండటంతో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను పెంచింది.

వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లు

ఇప్పుడు HDFC బ్యాంకు రూ.50 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ బ్యాలెన్స్ పైన ఏడాది వడ్డీ రేటు 3 శాతాన్ని ఆఫర్ చేస్తోంది. రూ.1000 కోట్ల నుండి రూ.50 లక్షల కంటే పైన సేవింగ్స్ బ్యాలెన్స్ మొత్తం పైన 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే, రూ.1000 కోట్ల కంటే పైన సేవింగ్స్ అకౌంట్ పైన 4.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వడ్డీ రేటును రోజువారీ అకౌంట్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. 'ఫిబ్రవరి 2వ తేదీ నుండి సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ అకౌంట్స్ పైన వడ్డీ రేటును కింది విధంగా సవరించడం జరిగింది' అని వెబ్ సైట్‌లో పేర్కొంది.

ఎస్బీఐ, ఐసీఐసీఐ సేవింగ్స్ వడ్డీ రేటు

ఎస్బీఐ, ఐసీఐసీఐ సేవింగ్స్ వడ్డీ రేటు

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో రూ.1 లక్ష వరకు ఎస్బీఐ డిపాజిట్ అకౌంట్స్ వడ్డీ రేటు 2.75 శాతానికి పెరిగింది. రూ.1 లక్షకు పైన ఎస్బీఐ డిపాజిట్ అకౌంట్స్ పైన 2.70 శాతం కాగా, 2.75 శాతానికి పెరిగింది.

ఐసీఐసీఐ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ రేటు రూ.50 లక్షల లోపు ఉంటే 3 శాతం, రూ.50 లక్షలకు పైన ఉంటే 3.50 శాతం వడ్డీ రేటు ఉంటుంది.

యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు

యాక్సిస్ బ్యాంకు వడ్డీ రేటు

యాక్సిస్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు రూ.50 లక్షల లోపు అయితే 3 శాతం, రూ.50 లక్షల నుండి రూ.10 కోట్ల వరకు 3.50 శాతం, రూ.10 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు 3.50 శాతం, రూ.100 కోట్ల నుండి రూ.200 కోట్ల వరకు రెపో ఆధారంగా ప్లస్ ఆర్ మైనస్ 0.50 శాతం, రూ.200 కోట్ల నుండి రూ.2500 కోట్ల వరకు రెపో ఆధారంగా ప్లస్ ఆర్ మైనస్ 0.50 శాతం వడ్డీ రేటు ఉంది.

English summary

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు సవరించిన HDFC బ్యాంకు, ఎంతంటే? | HDFC Bank Revises Savings Account Interest Rates W.e.f. 2nd February 2022

The country's largest private sector lender, HDFC Bank, has adjusted its savings account interest rates. The new rates, according to the bank's official website, are effective as of today, February 2nd, 2022, and applicable to domestic, NRO, and NRE savings accounts.
Story first published: Thursday, February 3, 2022, 14:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X