For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC Festive Treat: అద్భుతమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్స్

|

పండుగ సమయంలో వివిధ బ్యాంకులు వ్యక్తిగత రుణాల నుండి హోమ్ లోన్స్ వరకు భారీ ఆఫర్లను ప్రకటించాయి. ప్రధానంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఆల్ టైమ్ కనిష్టానికి తగ్గించాయి. అలాగే, పండుగ సమయంలో వివిధ ఉత్పత్తుల కొనుగోళ్లపై కూడా తగ్గింపును ప్రకటిస్తున్నాయి బ్యాంకులు. తాజాగా ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు ఫెస్టివ్ ట్రీట్ 3.0 పేరుతో భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ మేరకు మంగళవారం ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కార్డులు, రుణాలు, సులభతరమైన ఈఎంఐల పైన పదివేలకు పైగా ఆఫర్లను తీసుకు వచ్చింది.

ఈ డీల్ కింద అందరి కోసం మెగా డిస్కౌంట్స్‌ను అందుబాటులో ఉంచింది. రిటైల్ కస్టమర్లు ఖరీదైన స్మార్ట్ ఫోన్ కావాలనుకున్నా, ఔత్సాహిక వ్యాపారవేత్తల మూలధనం సమకూర్చుకోవాలనుకున్నా, రైతులు కొత్త ట్రాక్టర్స్ కొనుగోలు చేయాలన్నా.. ఇలా అందరి కోసం అన్ని రకాల ఆఫర్లను HDFC బ్యాంకు ప్రకటించింది. 100కు పైగా నగరాలు, పట్టణాల్లోని పదివేలమందికి పైగా వ్యాపారులతో బ్యాంకు భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఆపిల్, అమెజాన్, షాపర్స్ స్టాప్, ఎల్‌జీ, శాంసంగ్, సోనీ, టైటాన్, సెంట్రల్, ఏ-జియో, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్, లైఫ్ స్టైల్ వంటి దిగ్గజ వ్యాపార సంస్థలతోను భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే చెన్నై సిల్క్స్, జీఆర్టీ జ్యువెల్లరీస్, ఫోన్ వాలే, పూర్విక మొబైల్స్, ఎలక్ట్రానిక్ ప్యారడైజ్ వంటి బ్రాండ్స్‌తో జత కట్టింది. వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు ఈ ఆఫర్లు దోహదం చేస్తాయని బ్యాంకు తెలిపింది.

ఆఫర్లు ఇవే

ఆఫర్లు ఇవే

HDFC బ్యాంకు ఫెస్టివ్ ట్రీట్ పేరుతో వినియోగదారులకు భారీ ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లకు అందించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రీమియం మొబైల్ ఫోన్స్ పైన క్యాష్ బ్యాక్ మరియు నో-కాస్ట్ ఈఎంఐ ఉంది. ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ గూడ్స్ (వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్స్ వంటి ఉత్పత్తులు) పైన నో-కాస్ట్ ఈఎంఐ, 22.5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.

వ్యక్తిగత రుణాలు 10.25 శాతం నుండి అందిస్తోంది. ఈ పర్సనల్ లోన్ డిస్ట్రిబ్యూషన్ తక్షణమే ఉంటుంది. పర్సనల్ లోన్ తీసుకుంటే ఖాతాలోకి వెంటనే క్రెడిట్ అవుతుంది.

కారు లోన్ 7.50 శాతం వడ్డీ రేటు నుండి ప్రారంభమవుతుంది. ఫోర్-క్లోజర్ ఛార్జీలు ఏమీ ఉండవు. టూ-వీలర్ లోన్స్ పైన 100 శాతం వరకు ఫండింగ్ చేస్తుంది. వడ్డీ రేటు సాధారణంతో పోలిస్తే నాలుగు శాతం వరకు తక్కువగా ఉందని బ్యాంకు తెలిపింది.

ట్రాక్టర్ రుణం పైన ప్రాసెసింగ్ ఫీజు జీరో. 90 శాతం వరకు రుణం ఇస్తుంది. కమర్షియల్ వెహికిల్ లోన్స్ పైన ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది.

కొల్లేటెరల్ ఫ్రీ-బిజినెస్ రుణాలను రూ.75 లక్షల వరకు ఆఫర్ చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు ఉంటుంది.

రాయితీలు

రాయితీలు

తేలిక‌పాటి రుణ వాయిదాల‌పై రుణాలు మంజూరు చేస్తుంది. గ‌త ఏడాదితో పోలిస్తే 10 రెట్లు రాయితీలు అందించనుంది. ఐఫోన్-13 కొనుగోలు పైన రూ.6000 క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ వర్తిస్తుంది.

HDFC బ్యాంకు ఆపిల్, అమెజాన్, షాపర్స్ స్టాప్, ఎల్జీ, శాంసంగ్, సోనీ, టైటాన్, సెంట్రల్ వంటి వ్యాపార సంస్థలతో కస్టమర్ల ప్రయోజనం కోసం జత కట్టింది.

తగ్గింపు.. వినియోగం పెంపు

తగ్గింపు.. వినియోగం పెంపు

ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లకు మరింత ఆనందాన్ని ఇచ్చేలా ఫెస్టివ్ ట్రీట్ 3.0ను ప్రకటించాని, తమ వద్ద 10,000కు పైగా ఆఫర్లు ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా, హైపర్ లోకల్ ద్వారా అందుబాటులో ఉన్నాయని బ్యాంకు గ్రూప్ హెడ్(పేమెంట్స్, కన్స్యూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఐటీ) పరాగ్ రావ్ అన్నారు.

క్రెడిట్ కార్డ్స్ పైన తాము ఆఫర్లు ప్రకటించడం కేవలం వినియోగాదారులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, భారతదేశంలో వినియోగం పెరగడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో క్రెడిట్, డెబిట్, ప్రీపెయిట్ కార్డ్స్ కోసం చేసే ఖర్చులలో మూడింట ఒకవంతు HDFC బ్యాంకు ద్వారా జరుగుతోందని, అందుకే వినియోగం పెంపుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని, కస్టమర్ల వ్యయం గతంలో కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

English summary

HDFC Bank Festive Treats 3.0, partners with over 10,000 merchants

HDFC Bank on Tuesday said that it has partnered with over 10,000 merchants for its Festive Treats 3.0 campaign, a near 10 fold increase from 2020. Customers can choose from 10,000 offers on cards, loans and easy EMIs.
Story first published: Wednesday, October 6, 2021, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X