For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలరోజుల పాటు HDFC ఇండియా హోమ్స్ ఫెయిర్, ఎన్నారైలకు శుభవార్త

|

పండుగల సీజన్ నేపథ్యంలో HDFC తమ కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇటీవల ప్రాసెసింగ్ ఫీజు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, క్యాష్ బ్యాక్, డిస్కంట్లు సహా వివిధ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నారైల కోసం మరో అదిరిపోయే ఆఫర్‌తో ముందుకు వచ్చింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల పాటు ఇండియా హోమ్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఆన్‌లై ద్వారా ఈ హోమ్ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. ఇటీవలి వరకు కరోనా నేపథ్యంలో డిమాండ్ భారీగా క్షీణించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభం కావడంతో, బ్యాంకులు ఆఫర్ల ద్వారా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో గోల్డ్‌మన్ శాక్స్ రెండో కార్యాలయం, 500 ఉద్యోగ అవకాశాలుహైదరాబాద్‌లో గోల్డ్‌మన్ శాక్స్ రెండో కార్యాలయం, 500 ఉద్యోగ అవకాశాలు

ఎన్నారైలకు, భారత సంతతి వ్యక్తులకు ఆఫర్

ఎన్నారైలకు, భారత సంతతి వ్యక్తులకు ఆఫర్

HDFC ఆన్‌లైన్ ప్రాపర్టీ షోలో దేశంలోని 50 నగరాల్లో 175కు పైగా డెవలపర్లకు చెందిన 350 కంటే ఎక్కువ ప్రాజెక్టులను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రవాస భారతీయులు, భారత సంతతి వ్యక్తులు, ఇండియాలో సొంత ఇంటిని సమకూర్చుకోవాలని భావిస్తున్నవారు హెచ్‌డీఎఫ్‌సీ వెబ్ సైట్ ద్వారా ఒక్క క్లిక్‌తో లోన్‌ను పొందవచ్చునని చెబుతోంది. లండన్, సింగపూర్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉన్న ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు.

హైదరాబాద్, విశాఖ సహా ఈ నగరాల్లో..

హైదరాబాద్, విశాఖ సహా ఈ నగరాల్లో..

వివిధ నగరాల్లోని 350కి పైగా ప్రాజెక్టుల నుండి సెలక్ట్ చేసుకోవచ్చు. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, పుణే, చెన్నై, లక్నో, హైదరాబాద్, విశాఖపట్నం, లుధియానా సహా వివిధ నగరాల్లో ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్‌లు బుక్ చేసుకోవచ్చు. రూ.35 లక్షల నుండి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, సమాచారంతో పాటు పోల్చి చూసేందుకు, షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి వీలుఉంది.

ప్రత్యేక ఆఫర్లు, వ్యాల్యూ యాడెడ్ బెనిఫిట్స్

ప్రత్యేక ఆఫర్లు, వ్యాల్యూ యాడెడ్ బెనిఫిట్స్

హోమ్ ఫెయిర్ సందర్భంగా కస్టమర్లు ప్రత్యేక ఆఫర్లు, వ్యాల్యూ యాడెడ్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చునని బ్యాంకు తెలిపింది. డిమాండ్ క్రమంగా కోలుకుంటోందని, 2020 జూలైలో.. 2019 జూలైతో పోలిస్తే డిమాండ్ 81 శాతానికి చేరుకుందని HDFC మేనేజింగ్ డైరెక్టర్ రేను సూద్ కర్నాడ్ తెలిపారు. లాక్ డౌన్ తర్వాత తాము ఊహించిన దాని కంటే డిమాండ్ వేగంగా పుంజుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఇటీవల అమ్మకాలు పెరుగుతున్నాయని, పండుగ కాలంలో డిమాండ్ మరింత వేగం పెరగవచ్చునని అంటున్నారు.

English summary

నెలరోజుల పాటు HDFC ఇండియా హోమ్స్ ఫెయిర్, ఎన్నారైలకు శుభవార్త | HDFC bank begins month long India Homes Fair to woo NRIs

To cash in on festive fervour, mortgage lender HDFC Ltd on Friday said it has started a month-long mega online property show India Homes Fair featuring over 350 projects from more than 175 developers located across 50 Indian cities.
Story first published: Saturday, October 3, 2020, 10:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X