For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ 33% పతనం, క్రిప్టోకరెన్సీలోకి పెట్టుబడులకు ఇదే సమయమా?

|

క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ. ఇది వర్చువల్ కరెన్సీ మాత్రమే. సాధారణంగా డిజిటల్ కరెన్సీపై ప్రభుత్వాల లేదా ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నియత్రణ ఉంటుంది. డిజిటల్ కరెన్సీ నిర్వహణ బాధ్యతను చూస్తాయి. అయితే ఇక్కడ క్రిప్టోకరెన్సీల విషయానికి వస్తే వీటిపై ఎవరి నియంత్రణ లేదని చెప్పవచ్చు. డీసెంట్రలైజ్డ్ సిస్టం ద్వారా పని చేస్తాయి. క్రిప్టోకరెన్సీల విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతుంది. ఇటీవల బిట్ కాయిన్, ఎథేరియం, డోజీకాయిన్ వంటి క్రిప్టోలు ఎగిసిపడ్డాయి. ఇన్వెస్టర్లు వీటి వైపు దృష్టి సారిస్తున్నారు.

ఎలాన్ మస్క్ టెస్లా కీలక నిర్ణయం, 3 నెలల తర్వాత బిట్ కాయిన్ భారీ పతనంఎలాన్ మస్క్ టెస్లా కీలక నిర్ణయం, 3 నెలల తర్వాత బిట్ కాయిన్ భారీ పతనం

ఈ క్రిప్టోలు ఇలా...

ఈ క్రిప్టోలు ఇలా...

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. దాదాపు ఐదువేలకు పైగా ఉన్నాయి. కొన్ని ట్రేడింగ్ వ్యాల్యూమ్ లేదు. కొన్ని క్రిప్టోకరెన్సీలు హఠాత్తుగా ఎగిశాయి. మరిన్ని హఠాత్తుగా ఎగిసి, అంతేస్థాయిలో కిందకు పడ్డవి ఉన్నాయి. ఇటీవల డోజికాయిన్ భారీగా ఎగిసింది. ఎథేరియం కూడా 3000 డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ ఏకంగా 65వేల డాలర్ల సమీపానికి చేరుకున్నప్పటికీ ఇప్పుడు 40వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. బిట్ కాయిన్ నుండి ఫండ్స్ వెనక్కి వెళ్తున్నాయి. దీంతో ఈ కరెన్సీ వ్యాల్యూ పడిపోతోంది.

మంచి రిటర్న్స్

మంచి రిటర్న్స్

బిట్ కాయిన్‌లో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారీగా పెట్టుబడులు పెట్టింది. దీంతో ఈ క్రిప్టో వ్యాల్యూ భారీగా పెరిగింది. అయితే పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన అనంతరం బిట్ కాయిన్ వ్యాల్యూ క్షీణిస్తోంది. క్రిప్టోల్లోకి పెట్టుబడుల ఆధారంగా వాటి మార్కెట్ క్యాప్ పెరుగుతుంది. ప్రస్తుతం ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో క్రిప్టోలోకి పెట్టబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆచితూచి, మార్కెట్ నిపుణుల సలహాలతో వివిధ క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో మంచి రిటర్న్స్ పొందేందుకు ఆస్కారం ఉంటుంది.

పతనమైన సమయంలో పెట్టుబడులు

పతనమైన సమయంలో పెట్టుబడులు

బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు ఇప్పటికే బంగారానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ తర్వాత బిట్ కాయిన్ వ్యాల్యూ కాస్త పడిపోయింది. చాలామంది పెట్టుబడిదారులు బిట్ కాయిన్ సహా వివిధ క్రిప్టోల్లో పెట్టుబడుల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. బిట్ కాయిన్ గత నెలలో 65వేల డాలర్లను తాకింది. ఇటీవల 45వేల డాలర్ల దిగువకు పడిపోయింది. అంటే 33 శాతం పతనమైంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారు ఉంటారు. జూలై 2022 నాటికి బిట్ కాయిన్ 85వేల మార్కును తాకవచ్చుననే అంచనాలు ఉన్నాయి.

English summary

బిట్ కాయిన్ 33% పతనం, క్రిప్టోకరెన్సీలోకి పెట్టుబడులకు ఇదే సమయమా? | Good Reasons To Invest In Cryptocurrency Now

Cryptocurrency by a laymen can be understood as some asset or a new investment class with technology as its backbone and herein blockchain technology comes into picture. Now other than that there are miners of these cryptocurrencies which can mine only a limited supply.
Story first published: Wednesday, May 19, 2021, 15:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X