For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, రూ.46,000 దిగువకు పడిపోయిన బంగారం ధర: వెండి రూ.6,000 డౌన్

|

బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. కేవలం రెండు సెషన్‌లలోనే రూ.1600 మేర పడిపోయాయి. నేడూ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.3 శాతం మేర లేదా రూ.600 వరకు క్షీణించి రూ.46,029 వద్ద ట్రేడ్ అయింది. ఇది నాలుగు నెలల కనిష్టం. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్స్ 1.6 శాతం లేదా రూ.1000 మేర క్షీణించి రూ.63,983 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో బంగారం ధర రూ.1000 వరకు, వెండి రూ.2000 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 4.4 శాతం మేర పతనమైంది. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి.

బంగారం ధర మరింత తగ్గేనా?

బంగారం ధర మరింత తగ్గేనా?

అంతర్జాతీయంగా కరోనా డెల్టా వేరియంట్ కేసులు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు అమెరికా జాబ్ డేటా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే, పెడ్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను ఊహించిన దాని కంటే ముందుగానే పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం ప్రధానంగా పసిడి పైన పడింది. దీంతో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 2.3 శాతం మేర క్షీణించి 1722.06 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో ఏకంగా 1684 డాలర్ల స్థాయికి కూడా దిగి వచ్చింది. అదే సమయంలో వెండి ఔన్స్ ధర 2.6 శాతం మేర క్షీణించి 23.70 డాలర్లకు దిగి వచ్చింది. క్రితం సెషన్లో 7.5 శాతం పడిపోయింది. బంగారం బలహీన సంకేతాలు మరికొంత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం 1788 డాలర్ల దిగువనే మరికొంతకాలం ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 1665 డాలర్ల వద్ద కీలక మద్దతు ఉంది.

ఉద్యోగ డేటా జంప్

ఉద్యోగ డేటా జంప్

శుక్రవారం విడుదలైన డేటా ప్రకారం అమెరికా కంపెనీలు ఇటీవల చాలామందిని ఉద్యోగాల్లో నియమించుకున్నాయి. గత ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ నియామకాలు జూలైలో జరిగినట్లుగా డేటా వెల్లడిస్తోంది. అలాగే, వేతనాలు కూడా పెరిగిన సంకేతాలు కనిపించాయి. అలాగే, అమెరికా టెన్ ఇయర్ ట్రెజరీ యీడ్ల్స్, డాలర్‌కు డేటా బూస్ట్ వంటి అంశాలు బంగారంపైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR వద్ద శుక్రవారం నాటికి బంగారం నిల్వలు 1,025.28 టన్నులకు పడిపోయాయి. అంతకుముందు రోజు అంటే గురువారం 1,027.61 టన్నులు నమోదయ్యాయి.

బంగారం, వెండి ధరలు ఇలా...

బంగారం, వెండి ధరలు ఇలా...

బంగారం ధరలు నేడు (సోమవారం, ఆగస్ట్ 9) కూడా భారీగా క్షీణించాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.595.00 (-1.28%) క్షీణించి రూ.46045.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.531.00 (-1.14%) క్షీణించి రూ.46245.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,311.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,956.00 వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.46,000 దిగువకు వచ్చింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.531.00 తగ్గి రూ.46245.00 వద్ద ట్రేడ్ అయింది.

ఆగస్ట్ సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.1,263.00 తగ్గి రూ.63737.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,203.00 క్షీణించి రూ.64617.00 వద్ద ట్రేడ్ అయింది. వెండి గత కొద్ది సెషన్లలోనే రూ.70,000 నుండి రూ.63,000 స్థాయికి వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 1750 డాలర్ల దిగువకు పడిపోయింది. నేడు 17.70 డాలర్లు క్షీణించి 1745.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.341 శాతం క్షీణించి 23.985 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

గుడ్‌న్యూస్, రూ.46,000 దిగువకు పడిపోయిన బంగారం ధర: వెండి రూ.6,000 డౌన్ | Gold prices today: Yellow metal sees big fall, 4 month low

Gold rates have plunged ₹1,600 per 10 gram in just two days, tracking global selloff in precious metals.
Story first published: Monday, August 9, 2021, 11:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X