For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు క్షీణతతోనే క్లోజ్! ఈ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే..

|

ఈ వారం వరుసగా క్షీణిస్తున్న బంగారం ధరలు నిన్న దాదాపు స్థిరంగా ఉన్నాయి. నేడు (నవంబర్ 25 గురువారం) అతి స్వల్పంగా లాభపడ్డాయి. నేడు ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,600కు దిగువన, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో ఫ్యూచర్ 1800 డాలర్లకు దిగువనే ఉంది.
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ప్రారంభ సెషన్‌లో రూ.140.00 (0.30%) లాభపడి రూ.47578.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.133.00 (0.28%) ఎగిసి రూ.47920.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో 7.60
(+0.43%) డాలర్లు క్షీణించి 1,791.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,786.45 - 1,794.25 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,784.30 డాలర్ల వద్ద ముగిసింది.

మద్దతు ధర, నిరోధకస్థాయి

మద్దతు ధర, నిరోధకస్థాయి

ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.247.00 (0.39%) పెరిగి రూ.62882.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.268.00 (0.42%) లాభపడి రూ.63893.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.117 (+0.50%) డాలర్లు లాభపడి 23.615 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 23.535 - 23.733 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 23.496 డాలర్ల వద్ద ముగిసింది. కామెక్స్ స్పాట్ గోల్డ్ మద్దతు ధర 1780 డాలర్లు, నిరోధకస్థాయి 1810 డాలర్లు. ఎంసీఎక్స్ గోల్డ్ డిసెంబర్ మద్దతు ధర రూ.47,200, నిరోధకస్థాయి రూ.47,800.

బంగారం ధర-జీఎస్టీ

బంగారం ధర-జీఎస్టీ

బంగారం పైన జీఎస్టీని 5 శాతానికి పెంచవచ్చునని వార్తలు వస్తున్నాయి. కరోనా అనంతరం కోలుకుంటున్న జ్యువెల్లరీ పరిశ్రమకు ఇది ఎదురుదెబ్బ అవుతుంది. బంగారం ధరలు ఈ వారం రూ.47,700కు కాస్త అటు ఇటుగా ఉండే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.47,700 వద్ద బై-జోన్, టార్గెట్ ధర రూ.48,000. రూ.47,000 టార్గెట్ ధరతో రూ.47,300 వద్ద సెల్-జోన్ ఉందని చెబుతున్నారు.

అయితే బంగారం ధరలు ఈ వారం క్షీణతతోనే ముగియవచ్చునని అంటున్నారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ప్రస్తుత స్మాల్ డిప్ సమయంలో కొత్తగా లాంగ్ టర్మ్‌కు ఇన్వెస్ట్ చేయవచ్చునని సూచిస్తున్నారు.

కనిష్టం వద్ద

కనిష్టం వద్ద

ప్రస్తుతం బంగారం ధరలు నవంబర్ నెలలోనే దాదాపు కనిష్టం వద్ద ఉన్నాయి. యూఎస్ ట్రెజరీ యీల్డ్స్, డాలర్ పెరుగుదల లేదా క్షీణత పైన బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయంగా 1780 డాలర్ల వద్ద బంగారానికి బలమైన సాంకేతిక మద్దతు ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

English summary

బంగారం ధరలు క్షీణతతోనే క్లోజ్! ఈ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే.. | Gold Prices Today: Yellow metal likely to remain weak

Gold and silver futures prices were trading with gains on Thursday but comments from the US Federal Reserve policymakers suggesting the central bank could accelerate stimulus tapering kept the gains in check.
Story first published: Thursday, November 25, 2021, 10:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X