పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుధ్దం ప్రకటించాయి. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇజ్రాయెల్-అమెరికా కలయికతో ఇరాన్‌పై వైమానిక దాడులు మొదలయ్యడంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత గరిష్టానికి చేరింది. ఈ దాడులపై ఇరాన్ కూడా ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్‌లోని సివిల్, సైనిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రారంభించాయి. ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగించబడ్డాయి, పాఠశాలలు, కార్యాలయాలు మూసివేయబడ్డాయి, పౌర విమానాలు నిలిపివేయబడ్డాయి. ఇరాన్‌లో కూడా స్టాక్ ఎక్స్ఛేంజ్, మొబైల్ సేవలు నిలిచిపోయాయి.
ఈ పరిణామం వల్ల బంగారం (XAUUSD) ధరలు మరోసారి ర్యాలీకి సిద్ధమయ్యాయి. స్పాట్ గోల్డ్ 5250 డాలర్ల వద్ద ఒక నెల గరిష్టానికి చేరింది. ఆల్-టైమ్ హై 5602.23 డాలర్లను చేరడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5143.89 డాలర్ల వద్ద కీలక మద్దతు స్థిరంగా ఉంది. అయితే ఇది పెట్టుబడిదారులకు ఉత్సాహం కలిగిస్తోంది. సాంకేతిక విశ్లేషణ ప్రకారం.. ఈ పరిణామం బంగారం పై బలమైన అప్‌సైడ్ ప్రెజర్‌ను సృష్టించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ప్రధాన సైనిక కార్యకలాపాలు ప్రారంభించామని ప్రకటించారు. అమెరికా ప్రజలను రక్షించడానికి, ఇరాన్ పాలన ఎదుర్కొంటున్న తక్షణ ముప్పులను నిర్మూలించడం మా లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, అమెరికా వైమానిక, నావికా దళాలు ఇరాన్ పరిధిలో ఉన్నాయని, తదుపరి కొన్ని రోజుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమయ్యిందని చెప్పొచ్చు. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ పెట్టుబడి మార్కెట్లపై ప్రభావం చూపిస్తూ, బంగారం, వెండి ధరలు కొత్త గరిష్టాలకు చేరే అవకాశం కల్పిస్తున్నాయి. పెట్టుబడిదారులు దీన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించి, బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
మొత్తం మీద చెప్పాలంటే.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా మద్దతు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు Gold ర్యాలీకి ప్రధాన కారణాలుగా మారాయి. 5250 డాలర్ల స్థాయిని దాటితే, కొత్త కొనుగోలుదారులు మార్కెట్లోకి ప్రవేశించి, ఆల్-టైమ్ హై దిశగా బలమైన ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. రిట్రేస్‌మెంట్ జోన్ 5143.89 డాలర్ల నుంచి 5002.31 డాలర్ల వద్ద ఉండటంతో, పెట్టుబడిదారులు దీన్ని సేకరణకు ఉపయోగించవచ్చు. 50-రోజుల మూవింగ్ యావరేజ్ 4795.22 డాలర్ల వద్ద కూడా మరో కీలక మద్దతు సూచనగా ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications