For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వామ్మో.. బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి: ఈ వారం ఎలా ఉండవచ్చు?

|

బంగారం ధరలు మళ్లీ రూ.48,000 దాటాయి. వివిధ పరిణామాల నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని గతంలోనే బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అంచనాలకు తగినట్లు ధరలు గతవారంలో భారీగా పెరిగాయి. గతవారం మొత్తంగా డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.500 వరకు పెరిగింది. ధరలు నేడు కూడా భారీగానే పెరిగాయి. వరుసగా మూడో రోజు ధరలు పెరగడంతో ప్రస్తుతం మూడు నెలల గరిష్టం వద్ద ఉన్నాయి. వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.65,000కు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్ ఫ్యూచర్స్ 1820 డాలర్లను క్రాస్ చేసి రెండు నెలల గరిష్టానికి చేరుకుంది. ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి.

అందుకే బంగారం ధర పెరిగింది

అందుకే బంగారం ధర పెరిగింది

అంతర్జాతీయ మార్కెట్లోని పరిణామాల నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు పెరగడం వరుసగా మూడోసారి. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్(శుక్రవారం)లో 0.8 శాతం పెరిగాయి. వెండి 0.3 శాతం లాభపడింది. డాలర్ వ్యాల్యూ కాస్త క్షీణించింది. గత శుక్రవారం ఏడాది గరిష్టానికి చేరుకున్న తర్వాత, పడిపోయింది. ఈ అంశం పసిడికి కలిసి వచ్చింది. అమెరికాలో పేరోల్స్ అంచనాలకు మించి కనిపించాయి. అయినప్పటికీ బంగారం ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. 2021 క్యాలెండర్ ఏడాది చివరి త్రైమాసికంలో ఆర్థిక రికవరీ మరింత వేగం అందుకుందనే సంకేతాలు కనిపించాయి. రికవరీ నేపథ్యంలో బంగారానికి కూడా డిమాండ్ పెరిగింది.

నేటి ధరలు

నేటి ధరలు

నేటి (సోమవారం నవంబర్ 8) ప్రారంభ సెషన్‌లో ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.177.00 (0.37%) పెరిగి రూ.48149.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.198.00 (0.41%) ఎగిసి రూ.48299.00 వద్ద ట్రేడ్ అయింది. చాలా రోజులకు బంగారం ఫ్యూచర్ రూ.48,000 క్రాస్ చేసింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.95 (+0.27%) డాలర్లు ఎగిసి 1,821.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,816.80 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో 1,814.60-1,822.70 డాలర్ల మధ్య కదలాడింది.

డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో రూ.493.00 (0.77%) పెరిగి రూ.64825.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.449.00 (0.69%) ఎగిసి రూ.65451.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.201 (+0.83%) డాలర్లు లాభపడి 24.358 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మద్దతు ధర.. నిరోధకస్థాయి

మద్దతు ధర.. నిరోధకస్థాయి

ఫెడ్ రేట్ హైక్ అంచనాల నేపథ్యంలో గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. ఈ వారం గోల్డ్ ట్రేడర్స్ అమెరికా సీపీఐ డేటా కోసం వేచి చూస్తున్నారు. అందుకే ఈ వారం బంగారం 1800 డాలర్ల నుండి 1830 డాలర్ల మధ్య ట్రేడ్ కావొచ్చునని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులోనే బంగారం 1830 డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 48,500కు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. తగ్గితే మాత్రం రూ.47,000 దిగువకు పడిపోవచ్చు.

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.47,700, నిరోధకస్థాయి రూ.48,200, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.64,330, నిరోధకస్థాయి రూ.65,500.

English summary

వామ్మో.. బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి: ఈ వారం ఎలా ఉండవచ్చు? | Gold prices today rise for 3rd day in a row, near 3-month high

Gold price is retreating from a fresh two-month high of $1819, reached in the last hour. The pullback in gold price comes on the back of a firm rebound staged by the US Treasury yields across the curve.
Story first published: Monday, November 8, 2021, 11:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X