For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు, నేడు స్థిరంగా...

|

ముంబై: బంగారం ధరలు భారీగా తగ్గాయి! నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.900 వరకు తగ్గింది. నేడు (శుక్రవారం, సెప్టెంబర్ 17) ప్రారంభ సెషన్‌లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్న ఓ సమయంలో గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.500 తగ్గి రూ.46 వేల దిగువకు చేరుకుంది. కిలో వెండి ఏకంగా రూ.720 తగ్గి, రూ.61,540 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.300 తగ్గి రూ.48 వేలకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.300 తగ్గి రూ.44,000 వద్ద ఉంది. వెండి రూ.100 పెరిగి రూ. 67,800 పలికింది. గోల్డ్ ఫ్యూచర్ ప్రస్తుతం నెల కనిష్టానికి పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.10,100 తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.18,000 వరకు తక్కువగా ఉంది.

భారీగా తగ్గి.. స్థిరంగా

భారీగా తగ్గి.. స్థిరంగా

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో నిన్న రూ.900 వరకు తగ్గిన పసిడి, నేటి ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.20.00 (0.04%) తగ్గి రూ.46096.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.20.00 (0.04%) తగ్గి రూ.46293.00 వద్ద ట్రేడ్ అయింది. ఇక డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.181.00 (0.30%) పెరిగి రూ.61,258 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.110 తగ్గి రూ.62,066 వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ధర ఇటీవల రూ.48,000 తాకినట్లుగా కనిపించినప్పటికీ, అంతలోనే పడిపోయింది. ప్రస్తుతం రూ.46,000 స్థాయిలో ఉంది. ఇక వెండి కిలో రూ.65,000 దాటింది. అయితే ఈ వారం మళ్లీ క్రమంగా పడిపోయి రూ.62,000 దిగువకు వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నిన్న 1760 డాలర్ల దిగువకు పడిపోయాయి. ఓ సమయంలో 1752 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి ప్రారంభ సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ 7.00 (+0.40%) డాలర్లు పెరిగి 1,763.75 డాలర్లకు చేరుకుంది. అంటే నేడు స్వల్పంగా పెరిగింది.

నిన్న మాత్రం 30 డాలర్ల వరకు తగ్గింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్ల దిగువకు పడిపోయింది. నేటి ప్రారంభ సెషన్‌లో 0.163 (+0.72%) డాలర్లు పెరిగి 22.957 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నిన్న దాదాపు డాలర్ మేర క్షీణించింది.

గరిష్ట క్షీణత

గరిష్ట క్షీణత

కామెక్స్‌లో బంగారం ధరలు బుధవారం 0.6 శాతం మేర క్షీణించాయి. గత వారం రోజుల్లో ఇదే గరిష్ట క్షీణత. నిన్న అంతకుమించి పడిపోయాయి. అమెరికా ట్రెజరీ యీల్డ్స్ పెరుగుతున్నాయి. బంగారం ధర 1800 డాలర్లకు ఎగువన నిలబెట్టుకోలేకపోయిందని, ఈ మార్కు దిగువకు చేరుకుందని, మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎంసీఎక్స్‌లో బంగారం మరింత కాలం రూ.46,600 నుండి రూ.47,300 మధ్య కదలాడవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. వచ్చే వారం ఫెడ్ మీటింగ్ సమావేశానికి ముందు బలమైన ఆర్థిక రికవరీ కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో కామెక్స్‌లో గోల్డ్ మద్దతు ధర 1775, నిరోధకస్థాయి 1810. ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.46,700, నిరోధకస్థాయి రూ.47,200.

English summary

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు, నేడు స్థిరంగా... | Gold prices today near 1 month low after sharp fall

Gold prices were weak today in Indian markets after a sharp fall in the previous session. On MCX, gold futures were down 0.04% to near one-month low of ₹46,878 while silver edged 0.28% higher to ₹63,468 per kg.
Story first published: Friday, September 17, 2021, 12:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X