For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరింత మెరుపుకు పసిడి రెడీ, కొద్ది నెలల్లో బంగారం ధర రూ.80,000!

|

కరోనా మహమ్మారి సమయంలో అల్యూమినియం నుండి నేచరల్ గ్యాస్ వరకు అన్ని ధరలు పెరిగాయి. ఖర్చులు పెరిగి ఒకదాని తర్వాత మరొకదాని ధరలు పెరిగాయి. వివిధ కారణాలతో తదుపరి భారీ పెరుగుదల బంగారానిది కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పసిడి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయని, కాబట్టి దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56200కు చేరుకున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓ స్థాయిలో రూ.44,000 దిగువకు పడిపోయి, ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.48,000 సమీపంలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోను 1800 డాలర్ల సమీపంలో ఉన్నాయి. క్రితం సెషన్‌లో.. అలాగే, క్రితం వారం మొత్తంలో ధరలు భారీగా పెరిగాయి.

రూ.80వేలు దాటనున్న బంగారం ధర

రూ.80వేలు దాటనున్న బంగారం ధర

దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు సమీప భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నార. బంగారం ఇన్‌ఫ్లేషన్-ప్రొటెక్షన్ నేపథ్యంలో 3000 డాలర్లకు చేరుకోవచ్చునని అంటున్నారు. ఇదివరకు గోల్డ్ కార్ప్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోరోఫాలో, రాబ్ మెక్‌వెన్ ప్రకారం ప్రకారం ఔన్స్ బంగారం ధర 1800 డాలర్ల నుండి 3000 డాలర్లకు చేరుకోవచ్చు. మన వద్ద పది గ్రాముల బంగారం ధర రూ.80,000కు చేరుకోవచ్చునని అంటున్నారు. ఈ పెరుగుదల కూడా కొద్ది నెలల్లోనే ఉండవచ్చనని అంటున్నారు.

సురక్షిత పెట్టుబడి సాధనం

సురక్షిత పెట్టుబడి సాధనం

మహమ్మారి వంటి వాటిని ఎదుర్కోవడానికి ప్రపంచ ద్రవ్య, రుణ విస్తరణ, సప్లై డిస్‌రప్షన్‌తో సంబంధం ఉన్న ద్వితీయ డ్రైవర్లు, సంపదను రక్షించే సాంప్రదాయ పద్ధతులకు ప్రజలు మరలుతున్నారని చెబుతున్నారు. తద్వారా సురక్షిత పెట్టుబడి సాధనాలకు అధిక ప్రాధాన్యత మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

ప్రస్తుతం దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పది గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.395.00 (0.83%) పెరిగి రూ.47799.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.373.00 (0.78%) పెరిగి రూ.47910.00 వద్ద ముగిసింది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.607.00 (0.93%) లాభపడి రూ.65620.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.682.00 (1.04%) ఎగిసి రూ.66322.00 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ చాన్నాళ్లకు రూ.65,000 పైన ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 11.45 (0.64%) లాభపడి 1,793.35 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.220 (+0.91%) డాలర్లు ఎగిసి 24.390 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో బంగారం ధరలు దాదాపు 7 శాతం తగ్గాయి. 52 వారాల గరిష్టం 1978 డాలర్లు, కనిష్టం 1677 డాలర్లు. ఏడాదిలో వెండి ధర దాదాపు 3 శాతం తగ్గింది.

English summary

మరింత మెరుపుకు పసిడి రెడీ, కొద్ది నెలల్లో బంగారం ధర రూ.80,000! | Gold prices ready to glitter, experts predict $3,000 an ounce in months

One after another, commodities from aluminum to natural gas have surged as pandemic aftershocks rattle supply chains. Gold could be next, although for very different reasons.
Story first published: Sunday, October 24, 2021, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X