For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధర రూ.50,000కు చేరుకునే ఛాన్స్! రూ.45,500 వద్దనే ధరలు

|

ముంబై: బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. నేడు (మార్చి 2, మంగళవారం) ప్రారంభ సెషన్లో బంగారం ధరలు తగ్గినప్పటికీ, సాయంత్రం సెషన్‌కు పెరిగాయి. అయితే అతి స్వల్పంగా పెరిగాయి. అయితే రూ.45,500 దిగువనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులోనే పసిడి ధరలు తిరిగి రూ.50,000కు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అమెరికా ఆర్థిక ప్యాకేజీ, డాలర్ వ్యాల్యూ వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతాయి.

రూ.45,500 దిగువనే బంగారం ధరలు

రూ.45,500 దిగువనే బంగారం ధరలు

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (మంగళవారం, మార్చి 2) ప్రారంభ సెషన్లో తగ్గినప్పటికీ, సాయంత్రానికి అతి స్వల్పంగా పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46.00 (0.10%) పెరిగి రూ.45,354.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,066.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,615.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,975.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.44.00 (0.10%) పెరిగి రూ.45,510 వద్ద ట్రేడ్ అయింది. 45,205.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,760.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,149.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.67వేల వద్ద వెండి

రూ.67వేల వద్ద వెండి

వెండి ధరలు తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.222.00 (0.33%) తగ్గి రూ.67,200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,463.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,450.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,863.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.332.00 (-0.48%) తగ్గి రూ.68468.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,001.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,820.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,803.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

స్వల్పంగా పెరిగిన బంగారం

స్వల్పంగా పెరిగిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే 1750 డాలర్ల దిగువనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ +5.05 (+0.29%) డాలర్లు తగ్గి 1728.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,704.75 - 1,734.45 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 8.37 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. ఔన్స్ ధర -0.085

(-0.32%) డాలర్లు పెరిగి 26.593 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.820 - 26.745 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

బంగారం ధర రూ.50,000కు చేరుకునే ఛాన్స్! రూ.45,500 వద్దనే ధరలు | Gold prices may bounce back towards Rs 50,000 in the medium term

After the first red closing in the month of January since 2013, the market participants had a lot of expectations from the second month of 2021. However, the expectations were defied and prices retreated nearly 7%, carrying over a weak momentum into March.
Story first published: Tuesday, March 2, 2021, 22:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X