For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే 12 నెలల్లో బంగారం ధర రూ.53,000 చేరుకోవచ్చు

|

బంగారం ధరలు రానున్న 12 నెలల కాలంలో రూ.52,000 నుండి రూ.53,000 మధ్యకు చేరుకోవచ్చునని డొమెస్టిక్ బ్రోకేరేజీ ఫర్మ్ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. గత ఏడాది దీపావళి సమయంలో బంగారం రూ.51,000 పైన ఉంది. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ అనంతరం రూ.44,000 దిగువకు పడిపోయినప్పటికీ, మళ్లీ పుంజుకొని, రూ.47,000 పైన ఉంది. ఈ వారంలో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000ను కూడా దాటింది. అయితే చివరి సెషన్‌లలో నష్టపోవడంతో ఈ మార్కు దిగువకు చేరుకుంది.

కామెక్స్‌లో వచ్చే ఏడాది కాలంలో బంగారం 2000 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని, మన దగ్గర ఇది రూ.52,000 నుండి రూ.53,000 మధ్య ఉండవచ్చునని భావిస్తున్నారు.

Gold prices expected to surge to Rs 52000-53000 over next 12 months

బంగారం ధర క్రితం సెషన్‌లో భారీగా తగ్గింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.354.00 (-0.74%) క్షీణించి రూ.47607.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.358.00 (-0.75%) తగ్గి రూ.47664.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 17.75 (-0.98%) డాలర్లు పతనమై 1,784.85 డాలర్ల వద్ద ముగిసింది.
ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.391.00 (-0.60%) తగ్గి రూ.64540.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.376.00 (-0.57%) తగ్గి రూ.65276.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.152 (-0.63%) డాలర్లు క్షీణించి 23.968 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

వచ్చే 12 నెలల్లో బంగారం ధర రూ.53,000 చేరుకోవచ్చు | Gold prices expected to surge to Rs 52000-53000 over next 12 months

Bullions have been in a consolidation mode from the last Diwali to this Diwali, and in the past few months, it has been witnessed some choppiness amidst volatility in the US Dollar and bond yields.
Story first published: Saturday, October 30, 2021, 17:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X