బంగారం ధరలు రూ.10,000 తక్కువ! ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా?
ముంబై: గత ఏడాది కరోనా కారణంగా బంగారం ధరలు ర్యాలీ చేశాయి. శుక్రవారం ప్రారంభ సెషన్లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి ఏకంగా రూ.46,000 దిగువకు పడిపోయింది. ఓ సమయంలో రూ.45,861.00 స్థాయిని తాకింది. తద్వారా పసిడి ఎనిమిది నెలల కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.10,000 కంటే ఎక్కువ తక్కువగా ఉంది. అయితే సాయంత్రం సెషన్లో పసిడి ధరలు కాస్త పెరిగాయి. అయినప్పటికీ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేలు తక్కువగా ఉంది.
కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్ తర్వాత పెన్షనర్లకు ఎన్నో ప్రయోజనాలు

ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?
బంగారం ధరలు భారీగా పడిపోవడంతో ఇప్పుడు కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. సమీప కాలంలో మరింత తగ్గినా భారీగా తగ్గక పోవచ్చునని, కాబట్టి దీర్ఘకాలంలో పెట్టుబడులకు ఇది మంచి అవకాశంగానే చెప్పవచ్చునని అంటున్నారు.

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేలు తక్కువ
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు సాయంత్రం సెషన్లో స్వల్పంగా పెరిగాయి. రూ.46,000 పైకి చేరినప్పటికీ రూ.10వేల పైకి చేరుకుంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.125.00 (0.27%) పెరిగి రూ.46,251.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,986.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,490.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,861.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.116.00 (0.25%) పెరిగి రూ.46,411 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,203.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,039.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిగువనే పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. నేడు 1783 డాలర్లకు దిగువనే ఉంది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 8.95
(+0.50%) డాలర్లు పెరిగి 1783.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,759.15 - 1,790.70 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 8.04 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.447
(+1.65%) డాలర్లు పెరిగి 27.532 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.180 - 27.700 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 44.79 శాతం పెరిగింది.