For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు మరింత తగ్గుతాయా? వడ్డీ రేటు పెరిగితే అంతేనా?

|

బంగారం ధరలు గతవారం భారీగా క్షీణించాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు రూ.1000కు వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు మూడు శాతం మేర క్షీణించాయి. భారత స్పాట్ గోల్డ్ మార్కెట్‌లో రూ 600 తగ్గింది. క్రితం సెషన్‌లో బంగారం ధర రూ.76 తగ్గడంతో గతవారం రూ.46,000 వద్ద ముగిసింది. ఓ సమయంలో రూ.46,000 దిగువకు కూడా పడిపోయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.120 తగ్గి రూ.46,153 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు 1800 డాలర్ల పై నుండి 1750 డాలర్ల స్థాయికి వచ్చాయి.

చివరి సెషన్‌లో 2.75 (0.16%) డాలర్లు క్షీణించి 1,753.95 డాలర్ల మధ్య ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్ ఎంసీఎక్స్‌లో రూ.45,900 నుండి రూ.46,900 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లో 1750 డాలర్ల నుండి 1800 డాలర్ల మధ్య కదలాడింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ చివరి సెషన్‌లో రూ.1,000కి పైగా తగ్గి రూ.60,000.00 వద్ద ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,129 తగ్గి రూ.60,827 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.0.436 (-1.91%) క్షీణించి రూ.22.358 వద్ద ముగిసింది.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

మన దేశంలో స్పాట్ గోల్డ్ విషయానికి వస్తే వివిధ నగరాల్లో ధరలు ఉన్నాయి.

- ముంబైలో 11 సెప్టెంబర్ నాడు రూ.46,120గా ఉన్న పెట్రోల్ ధర, సెప్టెంబర్ 18న రూ.45,390కి పెరిగింది.

- ఢిల్లీలో 11 సెప్టెంబర్ నాడు రూ.46150గా ఉన్న పెట్రోల్ ధర, సెప్టెంబర్ 18న రూ.45,550కి పెరిగింది.

- చెన్నై 11 సెప్టెంబర్ నాడు రూ.44400గా ఉన్న పెట్రోల్ ధర, సెప్టెంబర్ 18న రూ.43710కి పెరిగింది.

- బెంగళూరు 11 సెప్టెంబర్ నాడు రూ.44400గా ఉన్న పెట్రోల్ ధర, సెప్టెంబర్ 18న రూ.43710కి పెరిగింది.

- కోల్‌కతా 11 సెప్టెంబర్ నాడు రూ.46450గా ఉన్న పెట్రోల్ ధర, సెప్టెంబర్ 18న రూ.45650కి పెరిగింది.

- హైదరాబాద్ 11 సెప్టెంబర్ నాడు రూ.44400గా ఉన్న పెట్రోల్ ధర, సెప్టెంబర్ 18న రూ.43710కి పెరిగింది.

- కేరళలో 11 సెప్టెంబర్ నాడు రూ.44000గా ఉన్న పెట్రోల్ ధర, సెప్టెంబర్ 18న రూ.43400కి పెరిగింది.

అక్కడ ధరలు తగ్గితే...

అక్కడ ధరలు తగ్గితే...

భారత్‌లో ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే, ఇక్కడ కూడా తగ్గుతాయి. అమెరికాలో రిటైల్ సేల్స్ ఊహించిన వాటి కంటే బలంగా ఉన్నాయి. దీంతో ట్రెజరీ యీల్డ్స్ పెరిగాయి. ఈ ప్రభావం పడి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మూడు శాతం పడిపోతున్నాయి. డేటా ఇలాగే బలంగా కొనసాగితే అమెరికా ఫెడ్ ఊహించని దానికంటే ముందుగా తన బాండ్ కొనుగోలు కార్యక్రమాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అంటే అప్పుడు లిక్విడిటీ బయటకు వస్తుంది. ఇది బంగారం ధరల పైన భారీ ప్రభావం చూపుతుంది.

వడ్డీ ధరలు పెరిగితే

వడ్డీ ధరలు పెరిగితే

అలాగే, ఈ డేటా బలంగా ఉంటే ఊహించిన దాని కంటే ముందుగానే వడ్డీ రేట్లు పెరగవచ్చునని భావిస్తున్నారు. ఇది బంగారానికి గుడ్ న్యూస్ కాబోదు. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. వడ్డీ ధరలు తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. బంగారం - వడ్డీ రేట్ల పెట్టుబడులు అనులోమానుపాతంగా ఉంటాయి.

English summary

బంగారం ధరలు మరింత తగ్గుతాయా? వడ్డీ రేటు పెరిగితే అంతేనా? | Gold prices at RS.46,000: Is it right time to buy yellow metal?

Gold in the comex dropped almost 3 precent and what followed was a drop in Indian future market by about Rs 900 in the last one week.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X